Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 10


 

                          మృత్యు రహస్యం ?

                                                                       వసుంధర

    "సాంబశివరావు గారింట్లో వున్నారండీ ?" అన్నాడతడు.
    "లేరండి " అందా అమ్మాయి.
    "ఇప్పుడు వస్తారాండీ?"
    "తెలియదండీ."
    "ఎప్పుడు వస్తారో తెలుసాండీ?"
    "తెలియదండి..."
    అతను చిరాకును వ్యక్త పరచకుండా 'అయన వచ్చేవారకూ ఇంట్లో నేను ఎదురు చూడ్డానికి మీకేమైనా అభ్యంతరమా?' అన్నాడు.
    "అన్నయ్య నడిగి చెబుతాను- " అంటూ తుర్రున లోపలకు పరుగేత్తిందా అమ్మాయి. అతడు ఆ వైపే చూస్తూ "ఈ యింట్లో ఈ సమయంలో ఇంట్లో ఉండే మగాడొకడున్నాడన్న మాట" అనుకున్నాడు.
    రెండు నిముషాల్లో వీధి గుమ్మంలోకి ఇరవై ఏళ్ళ కుర్రాడొకడొచ్చి "ఎవరండీ మీరు?" అనడిగాడు.
    "సాంబశివరావు గారి కోసం వచ్చాను" అన్నాడతను.
    "అయన మా నాన్నగారు. మీరెవరో చెప్పి ఆయనతో మీకేం పనో నాకు తెలియజేస్తే నాన్నగారు రాగానే మీ గురించి చెబుతాను" అన్నాడా కుర్రాడు.
    "నీపేరు?" అన్నాడతను.
    "వీరభద్రం " అన్నాడా కుర్రాడు.
    "మిస్టర్ వీరభద్రం మీ నాన్నగారితో నేను స్వయంగా వీలైనంత అర్జంటుగానూ మాట్లాడాల్సి వుంది. ఆయన వచ్చేవరకూ మీ యింట్లో ఎదురు చూడవచ్చా?" అన్నాడతను.
    వీరభద్రం ఇబ్బందిగా ముఖం పెట్టి 'అయన ఎప్పుడు వస్తారో తెలియదు. అసలీ వేల్టికి వస్తారో రారో తెలియదు" అన్నాడు.
    'సాంబశివరావుగారూర్లోనే వున్నారా?' అన్నాడతను.
    "ఉన్నావు "
    "ఉంటె ఇంటికి రాకుండా ఊర్లో ఎక్కడో ఎందుకుండి పోతారు? ఏదో టైము కిల్లు చేరుకోక తప్పదు గదా" అన్నాడతను.
    "అవన్నీ యిప్పుడెందుకు లెండి? అయన అలవాట్లు వేరు. మీ పనేమిటో చెబితే ఆయనకు తెలియజేస్తాను. లేకపోతె మరోసారి రండి" అన్నాడు వీరభద్రం.
    "ఎప్పుడింటికి వస్తారో తెలియని పెద్ద మనిషి కోసం మరోసారి మాత్రం ఎప్పుడని వచ్చేది? ఇప్పుడే ఇక్కడుండి పోయి వచ్చేదాకా ఎదురు చూస్తె వదిలి పోతుంది ...."
    'చూడండి మీరేవారో నాకు తెలియదు ."
    "నాకు మాత్రం మీరవరో తెలుసా?" అన్నాడతను చిరాగ్గా.
    'అయితే నన్నగారోచ్చే దాకా ఇంట్లో వుంటానంటారా" అన్నాడు వీరభద్రం.
    'అనలేదు. అందుకు మీ అనుమతి కోరుతున్నాను."
    'అయితే వుండండి. మా అమ్మనడిగి వస్తాను" అంటూ వీరభద్రం లోపలికి వెళ్ళబోయాడు. అతను వీరభద్రాన్ని వెనక్కు పిలిచి, "చూడు, మీ ఇంట్లో మీ అమ్మకంటె పెద్ద వాళ్ళేవ్వరైనా వున్నారా?' అనడిగాడు.
    వీరభద్రం ఆశ్చర్యంగా "మీ మామ్మ వుంది . ఏం?" అన్నాడు.
    "ఏకంగా అవిడినే పిల్చుకొనిరా. ఒక్కొక్కల్లే పదేసి నిముషాలు నన్ను గుమ్మంలో నిలబెట్టి మాట్లాడి వాళ్ళ కంటే పెద్ద వాళ్ళని పీల్చుకుని వస్తా,మని వెళ్ళిపోతున్నారు."
    వీరభద్రం నవ్వి "మా యింట్లో మా అమ్మ మాటకు తిరుగు లేదు" అని అక్కణ్ణించి లోపలకు వెళ్ళి పోయాడు. అతను వెళ్ళిన రెండు నిమిషాల్లో ఓ నడి వయస్కురాలు అక్కడికి వచ్చి "ఎవరు ?' అని ఏదో ప్రశ్నించబోయి అతడ్ని చూసి నోట మాట రాక ఆగిపోయింది. అతను కూడా ఆమె వంక అదోరకంగా చూస్తున్నాడు.
    ఒక్క నిముషం అలా నిలబడ్డాక "నువ్వా?" అన్నదావిడ.
    "నాకు మీరేవ్వరో తెలియదు. నేను సాంబశివరావు గారితో మాట్లాడడానికి వచ్చాను" అన్నాడతను.
    ఆవిడ అతని వంకే తదేక ధ్యాసతో చూస్తూ "నువ్వేమీ మారలేదు" అంది.
    'సాంబశివరావు గారు వచ్చేవరకు మీ ఇంట్లో ఉండొచ్చా?" అన్నాడతను అసహనంగా.
    ఆవిడ ఈ లోకంలోకి వచ్చినట్లు కనపడింది.
    "నీ పేరేమిటి బాబూ?' అన్నదావిడ.
    "అడిగిన వాళ్ళందరికీ నా పేరు చెప్పవద్దని మా నాన్న నాకు మరీమరీ చెప్పాడు" అన్నడతాడు గంబీరంగా.
    "మీ నాన్నా?" అని ఆవిడ గతుక్కుమని "పోనీ మీ నాన్న పేరు ?' అంది.
    "న పేరైనా చెప్పవచ్చు గానీ అయన పేరు చెప్పకూడదు. అని నాన్నగారి శాసనం."
    "పోనీ సాంబశివరావు గారితో నీ పని ?" అందామె.
    "అది ఆయనకే చెప్పాలి."
    "నేనాయనకు భార్యను. మా ఇద్దరి మధ్యా ఏ రహస్యాలు లేవు. ఆయనకు చెప్పదల్చుకున్నదేదో నువ్వు నాకు చెప్పి వెళ్ళవచ్చు " అందామె.
    "భార్యకు చెప్పే రహస్యం రహస్యం కాదంటాడు నాన్న. నిజమైన రహస్యాన్ని ఏ భర్తా భార్యకు చెప్పాడుట"అన్నాడతడు.
    ఆవిడ గతుక్కుమని "మీ నాన్న ఎక్కడున్నాడు?" అంది.
    "మా నాన్న గురించి నేనేమీ చెప్పను" అన్నాడతను.
    "అయితే నువ్వు సాంబశివరావుగార్ని కలుసుకోవడానికి వీల్లేదు" అందావిడ.
    "ఆయన్ను కలుసుకోవడం వల్ల నాకేమీ లాభం లేదు. ఆయనకే లాభం" అన్నాడతను.
    "ఏమిటా లాభం."
    'చాలా పెద్ద లాభం"
    "ఎంత పెద్దది?"
    "అద్దె ఇంట్లో వుండి నెలకు రెండొందలు మాత్రం సంపాదించుకునే వాడు స్వంత బంగాళా కొనుక్కుని లక్షాధికారి అయ్యాడనుకొండి. అది పెద్ద లాభమేనా?'
    "ఏమో నాకేం తెలుస్తుంది?" అందావిడ యేమో ఆలోచిస్తూ.
    "మీరు మరిచిపోయి వుంటారు. కానీ సాంబశివరావు గారికి గుర్తుటుంది."
    "ఇంతకీ ఏమంటావు?" అందావిడ.
    "సాంబశివరావు గారిని అర్జంటుగా కలుసుకుని మాట్లాడాలి. అయన ఎక్కడున్నాడో చెప్పండి లేదా ఆయన ఇంటికి వచ్చేవరకు ఎదురుచూసే అవకాశం నాకివ్వండి" అన్నాడతను.
    ఆవిడ ముఖంలో రకరకాల భావాలు మారాయి. కొంచెం సేపు ఆగి "సరే లోపలకు రా" అంది.

                                      2

    "ఎవరమ్మా అతను?' అన్నాడు వీరభద్రం.
    "ఏమో -- ఎవరో?" అందావిడ . ఆవిడా ఏదో ఆలోచిస్తున్నదని ముఖం చూస్తేనే తెలుస్తుంది.
    "ఎవరో ఏమిటి -- నీకలు తెలుసు. నువ్వతన్ని గుర్తు పట్టావు " అన్నాడు వీరభద్రం.
    "ఓహ్! సంభాషణ అంతా విన్నారన్న మాట. ఆ కుర్రవాడు నాకు తెలియదు. కానీ గతంలో నాకు తెలిసిన ఒకడు అచ్చం ఇతనిలా ఉండేవాడు" అందావిడ.
    'అతనే ఇతను కాదని గ్యారంటీ ఏమిటి?" అన్నాడు  వీరభద్రం.
    "కాడు. అతన్ని నేను సుమారు పాతికేళ్ళ వయసప్పుడు చూశాను. చూసి ఇరవై ఏళ్ళకు పైగా అయింది. ఇతనికి వయసు పాతికేళ్ళ లోపే గదా " అందావిడ.
    వీరభద్రం తనలో తనే ఏదో గొణుక్కుని , "ఎంత కుర్రాడి లా కనిపించాలనుకున్నా యాభయ్యేళ్ళ వాడి ముఖానికి పాతికేళ్ళ వాడి ముఖానికి తేడా వుంటుంది. బహుశా ఇతను అతడి కోడుకై వుంటాడు. అచ్చు గుద్దినట్లు తండ్రి పోలిక వచ్చి వుంటుంది" అన్నాడు.
    'అయుండొచ్చు అనిపించే తండ్రి గురింఛి అడిగాను. కుర్రాడు చెప్పలేదు--"
    "అసలీ కుర్రాడి తండ్రి నీకెలా తెలుసునమ్మా?"
    "ఈ కుర్రాడి తండ్రి ఎవరో నాకు తెలియదనే కదరా చెప్పాను."
    వీరభద్రం విసుగులో గారాన్ని మేళవించి "అతన్ని చూడగానే నువ్వా అని ఆశ్చర్యపడ్డావు గదా , అంటే నీకేవ్వరో గుర్తుకు వచ్చారు. ఆ గుర్తుకు వచ్చిన మనిషి గురించి నేనడుగుతున్నాను" అన్నాడు.
    వీరభద్రం తల్లి కొడుకు ముఖంలోకి పరీక్షగా చూసి అతని మనసులోని భావాల్ని చదవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత "రోడ్డు మీద నిన్నెవరో చనువుగా పలాకరించారానుకో ఆ మనిషి ముఖం నీకు గుర్తుకు రావడం లేదనుకో అప్పుడేం చేస్తావ్?' అనడిగింది.
    "తెలివిగా సంభాషణ నడిపించి అతనెవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను."
    "అదే నేనూ చేశాను. ఆ కుర్రాణ్ణి చూడగానే ఎప్పుడో నేను బాగా ఎరిగిన ముఖం అనిపించింది. కానీ ఎవరో గుర్తుకు రాలేదు. ఆ విషయం అతని నోటమ్మటే చెప్పించాలని ప్రయత్నించి ఓడిపోయాను."
    "మరొక్క సందేహం అమ్మా!" అన్నాడు వీరభద్రం.
    ఆవిడ కంగారుగా కొడుకు ముఖంలోకి చూసి "అడుగు- తీర్చగలిగితే తీరుస్తాను" అంది. వీరభద్రం వెంటనే "నాన్నగారు పేదవాడుగా వుంటూ హటాత్తుగా ఆస్తి పరుడయ్యారా?" అన్నాడు.
    ఒక్క క్షణం తటపటాయించి "అవును" అందావిడ.
    "హటాత్తుగా ఐశ్వర్యం ఎలా వచ్చింది?"
    "ఇవన్నీ నీ కనవసరం" అందావిడ కోపంగా.
    "తండ్రి డబ్బెలా సంపాదించాడో కొడుకు తెలుసుకో వడం తప్పా?"
    "తప్పని నేను అనలేదు. అనవసరం అన్నాను."
    "ఎందుకని?"
    "తారతరాలకు సరిపడ్డ డబ్బు మనకుంది. దాన్ని ఎలా కాపాడుకోవాలో నువ్వు తెలుసుకుంటే చాలు" అంది ఆవిడ. కొడుకు ఇంకేదో ప్రశ్న అడగబోతుంటే ఆవిడ గోడ గడియారం వంక చూసి "నాన్నగారింకా రాలేదు, అయన వచ్చేదాకా ఆ మనిషి హాల్లోనే వుంటాడు" అంది.
    తల్లి కింక ఆ విషయం చర్చించడం ఇష్టం లేదని గ్రహించి వీరభద్రం అక్కణ్ణించి హాల్లోకి వెళ్ళాడు.

                                     3

    "ఎవరైనా కొత్తమనిషి మీ జీవితంలోకి ప్రవేశించి వెళ్ళిపోయాడనుకొండి. వాడి పేరు తెలుసుకోకపోవడమే మంచిది" అన్నాడతను.
    "ఎందుకని?"
    "మనిషి మనసు విచిత్రమైనది. కనపడ్డ ప్రతివాడికి ఇది ఏదో ఒక పేరును అలోచించేస్తుంది. నన్ను చూడగానే మీకు ఏదో పేరు స్పురించే వుంటుంది. సొట్టబుగ్గల వాడనో, పీక్కు మొహం గాడనో , సూది ముక్కు వాడనో అలా ఏదో ఒక పేరు మనసులోకి చేరుతుంది. అట్టే పరిచయం లేదు కాబట్టి నన్ను గురించి ఆ పేరుతొ వ్యవహరిస్తేనే మీకు తృప్తిగా వుంటుంది. ఒకవేళ నా పేరు తెలిసిందనుకొండి . ఇష్టం లేకపోయినా దాంతోనే వ్యవరించాలి. అలా బాగుండదు" అన్నాడతను.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.