Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    "అయితే మోసానికి స్నేహ ధర్మమంటూ ఉండదు. నువ్వు చెప్పిన రహస్యాలన్నీ దాచడానికి బహుశా నువ్వొక లక్ష రూపాయలు నాకు చెల్లించాల్సి ఉంటుంది." అన్నాడు సోమరాజు గంభీరంగా.
    "రహస్యాలూ దాచినా దాచాకపోయినా స్నేహితుడిగా లక్ష రూపాయలు నీకివ్వడానికి నేనెప్పుడు సిద్దమే" అన్నాడు వెంకట్రావు నవ్వుతూ.
    సోమరాజు మిత్రుడు నవ్వులో జతకలిపి -- "నన్ను నువ్వు సరిగ్గా అర్ధం చేసుకోలేదనుకుంటాను." అన్నాడు.

                                                            3
    "ఛీ, నీముఖం నాకు చూపించకు. నమ్మిన స్నేహితుడికి ఇంత ద్రోహం చేసిన నీలాంటివాడి ముఖం చూస్తేనే పాపం." అంది సావిత్రి.
    సోమరాజు ఏమీ మాట్లాడలేదు. అతను తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు.
    ఇన్ స్పెక్టర్ మోహన్ అతన్ని చూస్తూనే లేచి వచ్చి "మిమ్మల్నెలా అభినందించాలో నాకు తెలియడం లేదు మిస్టర్ సోమరాజూ! ఈ మధ్యకాలంలో మీకులా ప్రభుత్వానికి సాయపడ్డ యువకుణ్ణి చూడలేదు. మీకు ప్రభుత్వనుంచి బహుమతి ముట్ట చెబుతుంది..." అన్నాడు.
    "సంఘ విద్రోహుల ఆచూకీ నాకు తెలిసినపుడు ప్రభుత్వానికి తెలియజెప్పడం నా భాద్యత. ఇందులో నేను చేసిన విశేషమేమీ లేదు. నా స్నేహితుడు నన్ను బాగు చేయాలనుకుని తన రహస్యాలు నాకు చెప్పాడు. ఆ సమాచారంతో నాలో మార్పు వస్తుందనీ , నేను తన విద్రోహ చర్యలతో అతనికి చేదోడువాదోడుగా ఉంటానని అతనాశించాడు తప్పితే అతన్ని పోలీసులకు పట్టిస్తానని కలలో కూడా ఊహించలేదు. మా స్నేహం అలాంటిది...."
    "అందుకే నాకు మీమీద గౌరవం పెరిగింది. అటువంటి స్నేహితుడిచ్చిన అవకాశాన్ని మరొకరేవైనా  ఇంకోలా వినియోగించుకుని ఉండేవారు. మీరు నిరుద్యోగులు కూడా అని తెలిసింది. బహుశా పోలీస్ డిపార్ట్ మెంట్లో ఉద్యోగానికి మీ పేరు రికమెండ్ కావచ్చు నని నిన్న కమీషనర్ గారన్నారు."
    "థాంక్యూ ....నేను ప్రస్తుతం నా స్నేహితుడు వెంకట్రావుని మీటవ్వాలని వచ్చెను" అన్నాడు సోమరాజు.
    మోహన్ నవ్వి అతనికి దారి చూపించాడు.
    కటకాల వెనుక వెంకట్రావుని చూసి సోమరాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "నామూలంగానేకదా నీకీ అవస్థ ప్రాప్తించింది" అన్నాడు బాధగా.'
    "ఎందుకురా మొసలి కన్నీళ్ళు? నేనేం అవకాశం చేశాన్రా నీకు. నాదారి నీకు నచాకపోతే నీ మానాన నువ్వు పోయి నా మానాన నన్ను బ్రతకనివ్వక పోలీసుల కెందుకు చెప్పావురా ? నీమూలంగా నేనేకాదు నాతొ సంబందమున్న ప్రతి ఒక్కోరూ జైలు పాలై పోయారు కదురా?" అన్నాడు వెంకట్రావు.
    "నాదారికీ నీదారికీ తేడా తెలిసింది కదా. నువ్వు నడిచే దారిలో ఎన్ని సుఖాలు లభించినా అది ఛీకటి దారి . అందులోకి రవంత వెలుగు రాగానే నువ్వు కటకటాల వెనుక ఉన్నావు. నా దారిలో సుఖాలు లేకపోవచ్చు. కానీ ఇది వెలుతురూ లో ఉంది. ఇక్కడ చీకటి లేదు...." అన్నాడు సోమరాజు.
    "చీకటి వెలుగులు మనిషి ఆలోచనలను బట్టి ఉంటాయి. స్నేహితుడి పని నమ్మి నాదారి రహస్యాలు నీకు చెబితే నన్ను జైలు పాలుచేశావు. ఇదేనా స్నేహధర్మం!" అన్నాడు వెంకట్రావు.
    నీగురించి పూర్తీ నిజాలు తెలియగానే నీదారి ఏమాత్రమూ సరైనది కాదని నాకు తోచింది. . నిన్ను నా దారిలోకి మళ్లించాలనీ - ఇంకా ఇంకా పతనంకాకుండా కాపాడాలనీ నాకు తోచింది. అందులోనూ నీలో నిజమైన స్నేహితుడిని నేను చూడడం - నువ్వు నాకు నీ అంతరంగిక రహస్యాలు చెప్పడంతోనే జరిగింది.
    ఇటువంటి స్నేహితుడిని మంచి మనిషిగా మార్చడం స్నేహితుడిగా నా ధర్మమనిపించింది. అందుకే బాధను నొక్కిపట్టి, పోలీసులకు సమాచారం అందించాను. ఈ జైలు శిక్ష నిన్ను పునీతుడిని చేస్తుందని -- శిక్ష అనంతరం నువ్వు స్వచ్చమైన జీవితం గడపగలననీ ఆశిస్తున్నాను. అందుకు నా నుంచి అవసరమైన సహాయం లభిస్తుంది" అన్నాడు.
    నవ్వాలో , ఏడవాలో తెలియక మిత్రుడి ముఖంలోకే చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు. 




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.