Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 10


 

    "ప్రస్తుతానికి నేను చేయగలగింది వాడిల్లు వదిలి పెట్టడమే! ఎవరి గొడవా లేకుండా మనం సుఖంగా కలుసుకోవడానికి కాస్త ఖరీదయితే అయినా ఓ మార్గముంది. ఈ ఊళ్ళో శోభా లాడ్జి వుంది. అందులో గది అద్దె చాలా ఎక్కువ. అన్ని సదుపాయాలూ వుంటాయి. రేపు మనం అక్కడ కలుసుకుందాం" అన్నాడు రాజశేఖరం.
    "ఏం మనిషివి నువ్వు?" పట్టపగలు లాడ్జికి రమ్మని పిలుస్తున్నావ్--"
    "అదేమిటి మోహనా? అలాగంటావ్ , నీ గురించే కదా నేను అన్ని పనులూ వదులుకుని ఈ ఊళ్ళో మకాం పెట్టాను" అన్నాడు రాజశేఖరం.
    'అదికాదు ,, గౌరవనీయులయిన వాళ్ళెవరయినా లాడ్జికి వెడతారా?"
    రాజశేఖరం నవ్వి, "అయితే శోభా లాడ్జి గురించి నీకు తెలిసింది చాలా తక్కువన్న మాట! అన్ని సమయాలలోనూ అక్కడికి ఆడవాళ్ళూ, మగవాళ్ళూ వస్తూ పోతూ వుంటారు. వచ్చే వాళ్ళందరూ కూడా సమాజంలో పెద్ద పెద్ద హోదాలో ఉన్నవాళ్ళే! అయ్యేయస్సాఫీసర్ల భార్యలూ, వ్యాపారస్థుల కూతుళ్ళు -- చాలా సమయం అక్కడే గడుపుతుంటారు" అన్నాడు.
    'అవినీతి మరీ బట్ట బయలుగా వుందంటారా అక్కడ"
    "పాపం మాట లెందుకూ! నాకేమీ తెలియదు , గొప్ప గొప్ప వాళ్ళందరూ అక్కడ మకాం వేస్తారు కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళక్కడికి చూడ్డానికి రావడం జరుగుతుంటుంది. కావాలనుకున్న వాళ్ళు గదుల్లో ఆడపిల్ల లతో ప్రయివేట్ గా ఉండవచ్చునని మాత్రం నేను విన్నాను. తప్పితే అక్కడి కందరూ అలాంటి పనిమీదనే వెడుతున్నారని అనుకోకు....' అన్నాడు రాజశేఖరం.
    అతని మాటలు వింటుంటే అక్కడికి వెళ్ళడం మంచిదే ననిపించింది. డబ్బిచ్చి వుండే హోటల్ కాబట్టి కొత్త ఇబ్బందు లేమీ ఎదురు కావనిపించింది.
    మర్నాడు సరిగ్గా పావు తక్కువ పదకొండు గంటలకు శోభా లాడ్జికి వెళ్ళాను.
    అక్కడి వైభవం చూస్తె నా తల తిరిగి పోయింది. భవనమూ, ఏర్పాట్లూ అంత ఘనంగా వుంటాయని నేను వూహించలేదు. అక్కడున్న మగవాళ్ళు అందరూ పుల్ మాటల్లో వున్నారు. ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళలా అగుపిస్తున్నారు. ఒకరి గురించి ఒకరు పట్టించుకునే వారు చాలా తక్కువ.
    నేను తిన్నగా రూమ్ నంబర్ పన్నెండులో కెళ్ళాను. తలుపులు దగ్గరగా మాత్రమే వేసి వున్నాయి. తోయగానే తెరచుకున్నాయి. అక్కడున్న సోఫాలో రాజశేఖరం కూర్చుని వున్నాడు. నన్ను చూస్తూనే అతనొక అడుగు ముందుకు వేసి పొదివి పట్టుకుని -- చేయి జాపి డోర్ లాక్ చేశాడు.
    అది ఎయిర్ కండిషన్డ్ గది. చల్లగా హాయిగా వుంది. ఆ చల్లదనానికి రాజశేఖరం స్పర్శ అద్భుతమైన కాంబినేషన్! నామీద ఏం మత్తు మందు చల్లాడో ఏమో కానీ అతనికి నేను నానాటికీ పూర్తిగా ఎందుకు లొంగి పోతున్నానో అర్ధం కావడం లేదు.
    
                                    8

    ఆరోజు ఎంత వుత్సాహంగా గడిచిదంటే జీవితమంతా అక్కడే వుండి పోవాలనిపించింది. టైము రెండు దాటేసరికి నిరుత్సాహం కూడా ఆవరించింది నన్ను.
    జయదేవ్ ఇంటికీ శోభా లాడ్జి కి చాలా తేడా వుంది. వయసులో వున్న దంపతుల్ని దృష్టిలో వుంచుకుని గదిలో అన్ని రకాల ఏర్పాట్లు చేయబడ్డాయి.
    ఆ గదిలోంచి బైటకు వెళ్ళ బోయేముందు నాకు కాలచక్రం గబగబా తిరిగిపోయి మళ్ళీ రేపు రావాలనిపించింది. అప్పటి నా ఆలోచనలు తలచుకుంటుంటే నేనెలాంటి మనిషినో నాకే తెలీకుండా పోతోంది.
    ఆడవాళ్ళందరి ఆలోచనలూ ఆలాగే వుంటాయా? అవకాశం వస్తే అందరు ఆడవాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారా? నాలో నైతిక విలువ నశించి పోవడానికి కారణం నా మనస్తత్వమా లేక పరిస్తితులా?
    ఇలాంటి రకరకాల ఆలోచనలు నన్ను ముసురు కుంటుంటే సమాధానం గురించి ఆలోచించకుండా నా అదృష్టాన్ని కాలానికి వదిలిపెట్టి లాడ్జిలో నాలుగు రోజులు గడిపాను.
    వీర్రాజు పాటించే క్రమశిక్షణ నాకు బాగా ఉపయోగపడుతోంది. సెలవు రోజులు మినహాయిస్తే అతను మిగతా రోజుల్లో పది నుంచి అయిదు మధ్యలో ఇంటికి రాడు, అందుక్కారణం ఏమైనా కావచ్చు. నాకు తెలుసుకోవాలని లేదు.
    అయిదవ రోజున లాడ్జిలో నేను పరవశం పట్టలేక రాజశేఖరం తో ఏమిటో వాగుతున్న సందర్భంలో -- "ఎక్స్ క్యూజ్ మీ!" అన్న మాటవిని పించి వులిక్కి పడ్డాను. రాజశేఖరం చటుక్కున దుప్పటీ మీదకు లాగి అటు తీరిగాడు.
    అతనికి ముప్పయ్యేళ్ళ లోపే ఉంటుంది వయసు. మనిషి ఎర్రగా బాగున్నాడు.
    "ఎలా వచ్చావిక్కడికి ?" అన్నాడు రాజశేఖరం.
    "తలుపులు వేసి వున్నప్పటికీ ఏ సమయంలోనయినా నేను ఏ గదిలోకయినా వెళ్ళగలను. అందుకు కొన్ని ఏర్పాట్లున్నాయి" అన్నాడతను.
    "కావచ్చు . అది కస్టమర్స్ కి ఇబ్బంది కాదా?"
    "కస్టమర్స్ కి సౌకర్యం కలిగించడం కోసమే మేమీ ఏర్పాటు  చేశాం. మిమ్మల్ని కలుసుకునేందుకు విశ్వనాధం వచ్చాడు. అతన్ని పంపి గది తలుపు తట్టమనడం కంటే నేనిలా రావడం మంచిదని పించింది" అన్నాడతను.
    "ఒకే మిస్టర్ గంగాధర్!" అన్నాడు రాజశేఖరం. అతని ముఖంలో కంగారు స్పష్టంగా కనబడుతోంది.
    "గంగాధర్ ఎవరు రాజా?" అన్నాను.
    "వచ్చేక చెబుతాను " అంటూ అతను లేచి గబగబా బట్టలు వేసుకుని హడావుడిగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. నేనేం చేయాలో తెలియక అలా దుప్పటి లోనే వుండిపోయాను.
    "నన్ను చూసీ నీవు సిగ్గు పడనవసరం లేదు మోహనా! నేనూ నీకు కావలసినవాడినే!" అన్నాడు ఆ యువకుడు.
    "ఎవర్నువ్వు?" అన్నాను కంగారుగా.
    "నా పేరు రాజకుమార్. ఈ హోటల్ ప్రోప్రయిటర్  కొడుకుని. ఇప్పుడు బయటకు వెళ్ళిన రాజశేఖరం తిరిగి రావడానికి కనీసం రెండు గంటల పడుతుందని తెలిసినవాణ్ని " అన్నాడు.
    "నేను రాజశేఖరం కోసం వంటరిగా ఎదురు చూడగలను. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా సంతోషిస్తాను" అన్నాను. నాకుఅసహనంగా వుంది.
    "నేను వెళ్ళడానికి రాలేదు. నీతో మాట్లాడాలని వచ్చాను" అన్నాడు రాజకుమార్.
    "నువ్వు కనీసం కాసేపయినా బయటకు వెడితే నేను బట్టలు వేసుకుంటాను."
    రాజకుమార్ నవ్వి "మాట్లాడటానికి బట్టలు అవసరం దేనికి? ఇంతసేపూ మాట్లాడలేదూ! ఆడవాళ్ళతో ఇలా మాట్లాడడం లోనే థ్రిల్ కూడా వుంటుంది" అన్నాడు.
    "నువ్వు మాట్లాడదల్చుకున్నది చెప్పు" అన్నాను.
    వీర్రాజు పక్కన వీధిన నడుస్తున్నప్పుడు  ఎవరయినా నా అందం చూసి కన్ను చెదరినా రెండో సారి చూడ్డానికి భయపడేవారు. నా అందం అద్భుత మైనదే కావచ్చు -- కానీ దాని కింత కాలమూ లభించే గౌరవం చేజేతులా పోగొట్టుకున్నా ననిపిస్తోంది. రాజశేఖరం వెర్రి లోపడి నానాటికీ పతనమై పోతున్నాను. దీనికి అంతమెక్కడ?
    "మా లాడ్జికి చాలామంది ఆడవాళ్ళు వచ్చారు కానీ నీలాంటి వాళ్ళు చాలా అరుదు. నీది అద్భుత సౌందర్యము. సౌందర్యానికి తగ్గ రసికత కూడా నీదగ్గర వుంది" అన్నాడు రాజకుమార్.
    "ఇవన్నీ ఎందుకు చెబుతున్నావ్?"
    "మా లాడ్జి సామాన్యమయినది కాదు. ఆనందం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళంతా మినిస్టర్ల లెవల్ వాళ్ళు. ఒక రాత్రికి ఒకోసారి లక్ష రూపాయలు కూడా సంపాదించుకోవచ్చు. డబ్బు సంగతి అటుంచితే కొన్ని కొన్ని అవసరాలకు ఆడవాళ్ళు పనికి వచ్చినట్లుగా ఎవ్వరూ పనికి రారు. నీలాంటి వాళ్ళను ఎర చూపి కొండ మీది కోతిని కూడా దింప వచ్చు" అన్నాడు రాజకుమార్.
    "నేను వ్యభిచారిణి కాను...." అన్నాడు నీరసంగా.
    "అలాగని ఎవరన్నారు? అయినా శోభా లాడ్జి లో జరిగేది వ్యభిచారమేలగౌతుంది? అదేమీ కాదు , నీకు వేరే భర్త వున్నాడు. అయినా రాజశేఖరంతో కులుకుతున్నావ్. అలాగే మరో వ్యక్తితో గడపాలి. అందుకు నీకు మంచి ప్రతిఫలముంటుంది !"
    "నాకు డబ్బాశ లేదు. నాగురించి మీరూహించినది తప్పు . నన్ను వదిలి పెట్టు ."
    "మాలాడ్జిలో గడిపిన ప్రతి ఆడదీ మేమూ చెప్పినట్లు విని తీరాల్సిందే!"
    "వినకపోతే...."
    "వినకపోతేనా? అని నవ్వాడు రాజకుమార్. "నీ జీవితం బజారు పాలవుతుంది. ఇక్కడ్నించి బయటపడకుండా పచ్చి బోగం దానిలా నిన్ను మార్చేస్తాను.
    నా మాట వింటే భర్త నీడన బ్రతుకుతూ నాకూ సాయపడవచ్చు...."
    నాకు చాలా భయం వేసింది. ఏదో భయంకరవ్యూహంలో నేను ఇరుక్కు పోతున్నానెమోనని నాకు అనుమానం కలిగింది. ఇందులో రాజశేఖరం పాత్ర కూడా వున్నదా?
    'ఆలోచిస్తావు నాకు తెలుసు. కానీ అతి తెలివికి పోకు. ఇక్కడ్నించి మంచి మాటలతో బయటపడి ఆ తర్వాత మోసం చేయాలనుకుంటే జరగదు. మా లాడ్జిలో నువ్వు రాజశేఖరం తో పొందిన ప్రతి అనుభవమూ మూవీ కెమెరాలో కెక్కింది. ఆ ఫిల్సు బయటకు రావడం నా కిష్ట ముంటుందనుకోకు...."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.