Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 4


 

    "అవును....." అన్నాడు సురేష్ కుమార్.
    దీప అతడి వంక ఆశ్చర్యంగా చూస్తూ -- 'అప్పటికంటే యిప్పుడు యింకా  స్మార్టుగా వున్నావు. సినిమా స్టార్సు గా వయసు తో పాటు నీకు గ్లామర్ పెరుగుతున్నట్లుంది...." అంది.
    సురేష్ కుమార్ నవ్వి -- "నా అందాన్ని మెచ్చుకున్నావంటే నీకు నామీద కోసం పోయినట్లేగా!" అన్నాడు.
    దీప ముఖం అదోలాగైంది -- "కోపమా-- అది యీ జన్మకు పోదు. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను. కానీ నువ్వు నన్ను అమాయకురాల్ని చేసి నా ప్రేమ నుంచి పొందవలసింది పొంది -- పెళ్ళి చేసుకోమనగానే సారీ చెప్పేశావు...."అంది.
    "అదంతా ఎందుకులే - ఇప్పుడు నీకు పెళ్ళయిందిగా ...." అన్నాడు సురేష్ కుమార్.
    "ఏం పెళ్ళిలే.... మనసొక చోట ....మను నొక చోట ...." అని నిట్టూర్చింది దీప.
    "ఇంతకీ ఈ ఊరేలా వచ్చావ్'?"
    "మా ఆయనకు డబ్బు పిచ్చి, నాచేత ఉద్యోగాలకు అప్లై చేయిస్తున్నారు. ఈ ఊళ్ళో ఇంటర్వ్యూ...."
    "అయితే ఎవరింట్లో దిగావు?"
    "చూశావుగా -- "అవతారం -- ఇంకా ఎక్కడా దిగలేదు. ఇంటర్వ్యూ రేపు...."
    "ఇంటర్యూఎక్కడ?"
    దీప చెప్పింది.
    "పోనీ..... నువ్వు మా యింటి కొచ్చి వుంటావా?"
    "ఎందుకుండదు ?" అంది దీప చటుక్కున .
    సురేష్ కుమార్ కళ్ళు మెరిశాయి-- "కానీ ....." అని ఆగిపోయాడతను.
    "నాకు తెలుసు. నేను మీ ఇంటికి రావడం నీ కిష్టముండదని, ఏదో వంక పెట్టి నేను రాకుండా చేస్తావ్...." అంది దీప.
    "అది కాదు దీపా! నన్నపార్ధం చేసుకోకు. ముందే చెప్పేస్తున్నాను. మా ఇంట్లో ఇప్పుడేవ్వరూ లేరు. నేనొక్కడినే వున్నాను....'
    "అయ్ సి.... అయితే మరీ మంచిది " అంది దీప ఉత్సాహంగా.
    సురేష్ కుమార్ ఆశ్చర్యంగా 'ఆడదానివి , అందులోనూ పెళ్ళైనదానివి ఒప్పుకుంటావనుకోలేదు" అన్నాడు.
    "ఒప్పుకోకపోవడానికి నువ్వు నాకేం కొత్త కాదు గదా! మెళ్ళో తాళి కట్టకపోయినా నాతొ ఓ నెల్లాళ్ళు సంసారం చేశావు. ఆ అనుభూతులే ఇప్పటికీ నాకు ఊపిరి పోస్తున్నాయి."
    సురేష్ కుమార్ కళ్ళలో గర్వం కనబడింది. "మరి మీ భర్తా నిన్నాపార్ధం చేసుకోడా?"
    "ఉద్యోగం కోసం ఒక్కర్తీనీ పొరుగూరికి ఇంటర్వ్యూ కు పంపించిన మహానుభావుడాయన. అయనకు భయపడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కనిపించడం నా అదృష్టం అనుకుంటాను. నీకుభార్యను కాగల అదృష్టం నా కెలాగూ కలగలేదు. కనీసం అప్పుడప్పుడైనా మన మిలా కలుసుకోగలిగితే...."
    సురేష్ కుమార్ మనసు, తనువూ పులకరించి పోయాయి. అతను దీపతో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి కోసం తనే హోటల్ నుంచి క్యారియర్ భోజనం తెచ్చాడు.
    "మీఇల్లు బాగుంది.అన్నీ కలిసివస్తే ఈయింటి తాళాలు నాచేతుల్లోకి వుండేవి..."
    'అవన్నీ మరిచిపో దీపా! ప్రస్తుతం మనకు భూతం వద్దు, భ్విష్యత్తు వద్దు, వర్తమానం ఒక్కటే. మన ముందున్నది" అన్నాడు సురేష్ కుమార్.
    "భవిష్యత్తు సంగతి సరే -- భూతం నన్ను వదలడం లేదు. నిన్నెలా వదుల్తుందో ఆశ్చర్యంగా ఉంది" అంది దీప.
    తర్వాత ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు స్నానాలు చేశారు. స్నానానంతరం బట్టలు మార్చుకుని భోజనాలు చేశారు.
    దీప తెల్ల చీర కట్టుకుంది. తెల్ల రవిక వేసుకుంది. జడలో మల్లె పూలు పెట్టుకుంది. ఆమె కళ్ళు మత్తుగా వున్నాయి. ఆమె వళ్ళు మిసమిసలాడుతోంది.
    ఆమెనలా చూస్తుంటే సురేష్ కుమార్ కు హటాత్తుగా ప్రభ గుర్తుకు వచ్చి భయం వేసింది. అనుకోకుండా అతనామే వంక చూసి "నువ్వు దీప వె కదూ!" అన్నాడు.
    "ఇప్పుడిదెం ప్రశ్న ?' అంది దీప.
    ఎందుకో సురేష్ కుమార్ శరీరంలో వణుకు ప్రారంభమైయింది . అది మదన తాపం పుట్టించిన వణుకు కాదు. పాత అనుభవాలు గుర్తుకొచ్చి కలుగుతున్న వణుకు.
    "అదేంటలా వణుకుతున్నావ్ సురేష్!"అంది దీప.
    సురేష్ కుమార్ తేరుకున్నాడు. ప్రభ అయితే తనకు తెలియని అమ్మాయి కాబట్టి కామినీ పిశాచి అనుకోవచ్చు. కానీ దీప తనకు తెలిసిన అమ్మాయి . ఆమె కామీనీ పిశాచి కావడానికి అవకాశం లేదు. తను అనవసరంగా భయపడుతున్నాడు. అదీగాక ప్రభ అయితే తనను విజయ్ అని పిలిచేది. అది కామినీ పిశాచి కిష్టమైన పేరు. దీప తనను సురేష్ అనే పిలుస్తోంది. అతను నెమ్మదిగా ఆమెను సమీపించి దగ్గరగా లాక్కున్నాడు. ఒక్క క్షణంలో కౌగిలి బిగిసింది. కానీ వెంటనే దీప అతన్ని విడిపించుకుని "ఇక్కడ కాదు"అంది.
    "అంటే?"
    "నువ్వలా కూర్చో, కళ్ళు మూసుకో. నేను నిన్ను పిలుస్తాను. నా పిలుపు వినేవరకూ నువ్వు కళ్ళు తెరవకూడదు. తెలిసిందా" అంటూ అతడి పెదాలను మృదువుగా తన పెదాలతో చుంబించింది.
    సురేష్ కుమార్ తనువూ పులకరించింది. అతను కుర్చీలో చతుకిలపడి కళ్ళు మూసుకున్నాడు. మెత్తని అడుగుల చప్పుడు అతనికి క్రమంగా దూరమైంది. కొద్ది సేపటికి "సురేష్ త్వరగా రా" అని పిలుపు వినిపించింది. ఆ పిలుపు పడకగది లోంచి వస్తోంది.
    సురేష్ కుమార్ ఉత్సాహంగా లేచాడు. రెండు అంగల్లో బెడ్రూం సమీపించి గుమ్మం దగ్గర ఆగిపోయాడు.
    మంచం మీద దీప ప్రవరాఖ్యుల్ని కూడా రెచ్చగొట్టే పద్దతిలో పడుకుని వుంది.
    సురేష్ కుమార్ గదిలోకి ఉత్సాహంగా ముందడుగు వేసి ఆగిపోయాడు. చటుక్కున గదిలో దీపం ఆరిపోయింది.
    "వాటీజ్ దిస్ దీపా!" అన్నాడతను చిరాగ్గా.
    "నేను కోరేది చీకటి. నా చీకటికి వెలుగునివ్వాల్సింది దీపం కాదు నువ్వు. త్వరగా రా సురేష్!" అంది దీప.
    సురేష్ కుమార్ తడుముకుంటూ నెమ్మదిగా మంచాన్ని సమీపించాడు. మంచం చేతికి అందగానే దీప కోసం తడిమాడు. అతడి చేతికి ఆమె కాలు తగిలింది.
    "నీ స్పర్శకు నా వళ్ళు పులకరిస్తోంది విజయ్!" అందామె.
    విజయ్ అన్న పిలుపు వినడం తోనే సురేష్ కుమార్ శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అప్పుడే సరిగ్గా గదిలో దీపం వెలిగింది.
    సురేష్ కుమార్ కళ్ళు మూసుకున్నాడు.
    మంచం మీద దీపలేదు. కామినీ పిశాచి వుంది.
    "కెవ్వు" ఆని అరిచి వేను తిరిగాడతను. కానీ ప్రయోజనం లేదు. తలుపులు వేసి వున్నాయి. ఈలోగా కామినీ పిశాచి అతణ్ణి అందుకొనే అందుకుంది.
    "ప్లీజ్ వద్దు, నేనది భరించలేను. నన్ను వదిలిపెట్టు" దీనంగా రెండు చేతులు జోడించి వేడుకున్నాడతడామెను.
    అందవికారమైన ముఖంతో అత్యంత భయంకరంగా నవ్విందామే. అతణ్ణి బలంగా దగ్గరకు తీసుకుని పెనుగులాడుతున్న అతడి చేతుల్ని నొక్కిపెట్టి అతడి ముఖం మీద ముద్దులు కురిపిస్తోందామె.
    "హి భగవాన్ -- ఏమిటీ నాకీ శిక్ష!" అంటూ వాపోయాడు సురేష్ కుమార్.
    కామిని పిశాచి బారి నుంచి భగవంతుడు కూడా అతన్ని రక్షించలేదు.

                                     9
    "వెంకన్న గారూ - దాన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు" అన్నాడు సురేష్ కుమార్. అతడి ముఖం పాలిపోయి వుంది. మనిషి నిస్త్రాణంగా వున్నాడు.
    "నీసంగతే నీకు తెలియదు. నా సంగతి నీకేం తెలుస్తుంది?" అన్నాడు వెంకన్న.
    "నా సంగతి నాకు తెలియదని కూడా ఒప్పుకోక తప్పదు. అది నిన్న స్వయంగా నా ఇంటికే వచ్చి నన్ను రేప్ చేసింది" అన్నాడు సురేష్ కుమార్.
    వెంకన్న ఆశ్చర్యంగా "జరిగిందేమిటో వివరంగా చెప్పు" అన్నాడు.
    "ఆ వివరాలన్నీ చెప్పాలంటే అదంతా మళ్ళీ నేను గుర్తు చేసుకోవాలి. ఆ పని చేయలేను. అదొక అత్యంత భయంకరమైన అనుభవం" అన్నాడు సురేష్ కుమార్.
    'అలా అంటే నాకు కధ ఎలా తెలుస్తుంది!" అన్నాడు వెంకన్న.
    'ఆ కామినీ పిశాచి ఓ బంగళా లో వుంటుందే మోననుకున్నాను. కాని అది మేజస్టిక్ హోటల్లో వెలసింది. ఆఖరికి నిన్న నా ఇంట్లో కూడా వెలసింది. అది రాలేని చోటు లేదు"అన్నాడు సురేష్ కుమార్.
    "అసలది నీ యింట్లో కేలా వచ్చింది ?"
    "అది దరించ గల రూపం ప్రభది మాత్రమే అనుకున్నాను. ఆ వేషంలో అది నన్ను రెండు సార్లు మోసం చేసింది. ఇంక ప్రలోభపడననుకుందో ఏమో - ఈసారి అది వేషం మార్చి దీప అనే నా పాత స్నేహితురాలి వేషంలో వచ్చింది. అది యిన్ని వేషాలు మార్చగలదని నాకేం తెలుసు? నిజంగా దీపే అనుకుని మా యింటికి తీసుకువెళ్ళాను."
    "దీప ఎవరు?"
    "దీప గురించి చెప్పాడు సురేష్ కుమార్. అదంతా విని 'అయినా నీకిదేం బుద్దయ్యా- కామినీ పిశాచి నీ మీద పగ బట్టిందని తెలిసి కూడా , రెండనుభావాలయ్యుండి కూడా ఇంకా ఆడపిల్ల కనబడగానే కక్కుర్తి పడతావ్!'అన్నాడు వెంకన్న.
    "బుద్ది వచ్చిందండీ- ఇప్పుడు నాభార్య పుట్టిట్నించి తిరిగొచ్చినా ముట్టుకోవలంటే భయమేనేలా వుంది. ఆ కామినీ పిశాచి యెవరో నా మీద యింతలా ఎందుకు పగబట్టిందో నాకు అర్ధం కాకుండా వుంది" అన్నాడు సురేష్ కుమార్.
    "నువ్వు నాకో రెండొందల రూపాయల ఫీజుగా యిచ్చుకుంటే నీకో చిన్న క్లూ యివ్వగలను" అన్నాడు వెంకన్న.
    "క్లూ అంటే!"
    "కామినీ పిశాచి నిన్నెందుకు పట్టుకుందో నాకు తెలియదు. కానీ నీకు తెలుసుకునే అవకాశం వుంది. అది నీకు కలిగించేదే నీ క్లూ " అన్నాడు వెంకన్న.
    సురేష్ కుమార్ జేబులోంచి డబ్బు తీసి డబ్బు లెక్క పెట్టాడు. అందులో మూడొందల యాభై చిల్లర వుంది. అందులోంచి రెండు వందలు తీసి వెంకన్న కిచ్చి "ఆ క్లూ ఏమిటో చెప్పండి!" అన్నాడు.
    "నిన్ను మొట్టమొదట కామినీ పిశాచి ఏ బంగళా లో అయితే బలవంతం చేసిందో ఆ బంగళాను కొద్ది కాలం క్రితమే జనార్ధనరావు అనే అతను కొనుక్కున్నాడు. జనార్ధనరావు నీకు తెలుసా?'




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.