Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 10


                                   4

    "రాజా! నా భర్త పై ప్రేమ పెంచుకుందామని నేను చేసిన ఆఖరు ప్రయత్నం కూడా విఫలమయింది. అతన్ని నేను ప్రేమించలేను. నాకు జరిగే అన్యాయంతో అతనికి నిమిత్తం లేదన్నాడు. కాబట్టి అతనికి అన్యాయం జరిగితే నాకు బాధలేదు. సమాజాన్నేదిరించే ధైర్యం కలిగే దాకా  అతని నీడలోనే వుంటూ నీతో సుఖపడదల్చుకున్నాను- అంతకుమించి ప్రస్తుతానికి నీకు సహకరించలేను" అన్నాను.
    రాజశేఖరం ఆరాధనా పూర్వకంగా నా వంక చూసి 'ఆరోజు లభించిన తొలిముద్దు ఇప్పటికీ నాకు గుర్తుండి పోయింది మోహనా! నువ్వు నన్ను పూర్తిగా కరుణిస్తానంటే అంతకంటే అదృష్టమేముంది? త్వరలోనే నీలో పూర్తిగా మార్పు రాగలదని ఆశిస్తున్నాను. అయితే మనం ఎప్పుడు కల్సుకుందాం?" అన్నాడు.
    "ఇప్పుడు టైము పదకొండయింది. సాయంత్రం అయిదు వరకూ నాకు స్వేచ్చ. అయితే మూడింటి నుంచి ఇంటి పనులు ప్రారంభించుకోవాలి " అన్నాను. అప్పుడే నా మనసులో ఏదో థ్రిల్ బయల్దేరింది.
    రాజశేఖరం ఉత్సాహంగా "మా ఇంటికి పోదామా?" అన్నాడు.
    "మీ ఇంట్లో ఎవరున్నారు?"
    "ప్రస్తుతం ఎవ్వరూ లేరు!"
    "నాకోసం ఈ ఊరు వచ్చి ఓ ఇల్లు తీసుకుని అందులో మకాం పెట్టిన రాజశేఖరం ఇంట్లో వేరే ఎవ్వరుంటారు? నా ప్రశ్నకు నేనే నవ్వుకుని "ఎవరూ అనుమానించరు కదా?" అని అడిగాను.
    "నేనున్న వీధి పట్టపగలే నిర్మానుష్యంగా వుంటుంది. ఏ ప్రమాదమూ వుండదు" అన్నాడు రాజశేఖరం. ఇద్దరం పార్కు లోంచి కదిలి రిక్షా ఎక్కి అతనింటికి వెళ్ళాం. అదృష్టవశాత్తు ఎవ్వరి కంటా పడలేదు.
    రాజశేఖరం ఇల్లు అన్ని హంగులతో చాలా బాగుంది. మా ఇద్దరికీ ఏకాంతం లభించగానే అతను విపరీతంగా ఆవేశపడి పోయాడు. ఆ ఆవేశం నాకు నచ్చినా తొలి నాటిలా అతని ముందు సిగ్గుపడ్డాను. అయితే ఒక్క క్షణం కూడా తప్పు చేస్తున్నానన్న ఆలోచన నాలో రాలేదు. ఇన్నాళ్ళుగా ఏంతో సుఖానికి దూరంయ్యానన్న దిగులు నన్ను ఆవహించింది. లోపం వీర్రాజు దో, నా మనస్తత్వానిదో తెలియలేదు.
    టైము మూడయ్యేసరికి నాకు చాలా కంగారు పుట్టింది. ఇంత త్వరగా కాలం గడవడం ఈ మధ్య కాలంలో నేనెరుగను. ఇంటికి వెళ్ళి చేసుకోవలసిన పనులు చాలా వున్నాయి. ఇప్పుడు బయల్దేరి ఇల్లు చేరి పనులు మొదలు పెట్టాలి. అయిదయ్యే సరికి వీర్రాజు కు టిఫిన్ రెడీ చేయాలి. అందులోనూ టిఫిన్ దోసెలు.
    రాజశేఖరం నా సమస్య విని "ఈ రోజుకు హోటల్లో కోనేసేయ్" అన్నాడు.
    'అలా అయన ఒప్పుకోరు" అన్నాను.
    "వంట్లో బాగోలేదని పడుకో" అన్నాడు రాజశేఖరం ,
    "వెంటనే డాక్టర్ని పిలుస్తాడు."
    "వళ్ళు నెప్పులను, అదేవ్వరూ కనుక్కోలేని రోగం . తిండి కూడా మానక్కర్లేదు."
    "ఒళ్ళు నెప్పులైనా సరే పని చేసి తీరాలి. అలాంటి రోగాలకు అడ్వాన్సు నోటిసివ్వాలి."
    "ఇలాంటి వాడు దొరికాడె,మిటి మోహనా నీకు!" అంటూ రాజశేఖరం ఆలోచనలో పడి ఓ ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం హోటల్లో దోసెలకు బదులు పిండి కొనుక్కోవాలి.
    సాధారణంగా హోటలు వాళ్ళు దోసెల పిండి అమ్మరు కానీ రాజశేఖరం సంపాదించగలిగాడు. అతనికి ధన్యవాదాలు చెప్పుకుని ఇల్లు చేరేసరికి పావు తక్కువ నాలుగయ్యింది. వెళ్ళి వెళ్ళగానే బట్టలు తికేశాను. రోజూ కంటే చలాకీగా పని చేశాను. వీర్రాజు వచ్చేసిరికి టిఫిన్ సిద్దం అయింది.
    అతను రావడం, కుర్చీలో కూర్చోవడం నేను వెళ్ళి బూట్సు, సాక్సు విప్పడం, ఇద్దరం కలిసి టిఫిన్ తినడం అన్నీ యాంత్రికంగా జరిగిపోయాయి. ఈ పనులన్నీ రాజశేఖరం తో అయితే ఎలా జరిగుండేదా అని ఆలోచిస్తుంటే వీరాజు పట్ల నా జుగుప్స పెరిగింది, అయితే అంతరాంతరాలలో నాలోని స్త్రీ హృదయం వీర్రాజు పట్ల జాలిని ప్రదర్శించడానికి కూడా ప్రయత్నిస్తోంది.
    "విశేషాలేమైనా వున్నాయా?" అన్నాడు వీర్రాజు.
    "విశేషాలు మనుషులకు గానీ యంత్రాలకెందుకు వుంటాయి?" అన్నాను.
    "ఇలాంటి మాటలు నా కిష్టముండదు. చేతనైతే మృదువుగా మాట్లాడు. లేకపోతే నోర్మూసుకుని కూర్చో!" అన్నాడు వీర్రాజు.
    నేనింక మాట్లాడలేదు. బూడిదలో పన్నీరు పోయడమూ వీర్రాజు తో మృదువుగా మాట్లాడడమూ నాకు బాగుండదు.
    ఇప్పుడు నాకు క్షణం యుగంలా గడుస్తోంది. మళ్ళీ  రేపు రాజశేఖరం తో నిన్నూహించుకుంటూ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను.

                                     5

    ఒకటి కాదు రెండు కాదు -- వరుసగా వారం రోజులు రాజశేఖరాన్ని కలుసుకున్నాను.
    అతనిప్పుడు నాకు వ్యసనంగా పరిణమించాడు. అతని ఆకర్షణకు నేను పూర్తిగా లొంగిపోయాను. వీర్రాజుతో అన్ని రకాల బంధాలూ తెంచుకుని రాజశేఖరం తో వెళ్ళి పోవాలని నాకు అప్పుడప్పుడు అనిపించినా వివేకం హెచ్చరిస్తోంది. వీర్రాజు నీడను వదలకుండానే అన్ని సుఖాలు అనుభవించమంటోంది. ఆవిధంగా వీర్రాజు మీద నాకు గల కసి, కోపం పరోక్షంగా తీరుతాయని భావిస్తున్నానేమో!
    ఎనిమిదవ రోజు మధ్యాహ్నం రాజశేఖరం నా గుండెల మీద నిద్రపోతున్నాడు. ఆ సమయంలో నేనేదో ఆలోచిస్తున్నాను. నిద్ర రావడం లేదు. అప్పుడు సమయం ఒంటిగంట అయుంటుంది. గుమ్మంలో ఏదో నీడలా తోచి ఉలిక్కి పడ్డాను. అటు చూసేసరికి మరింత ఉలిక్కి పడ్డాను.
    సుమారు పాతికేళ్ళ యువకుడు నావంక చూస్తున్నాడు. అతనక్కడికి ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నేను తడబడి మంచం మీంచి లేవబోయాను. దురదృష్టవశాత్తూ నా వంటి మీద బట్టలు సరిగా లేవు. చటుక్కున కదలలేకపోయాను. రాజశేఖరాన్ని లేపడానికి ప్రయత్నించాను. అతనికి గాడ నిద్ర పట్టేసింది.
    రాజశేఖరాన్ని నిద్ర లేపవద్దన్నట్టుగా ఆ యువకుడు నన్ను వారించాడు. ఆ పరిస్థితు లో ఏం చేయాలో తోచలేదు. ఎలాగో అలా సర్దుకుని లేచాను. అతను నన్ను రమ్మని పిలుస్తున్నాడు. నేను బట్టలు సరిచేసుకుని అతన్ని సమీపించాను.
    "రాజశేఖరం నా స్నేహితుడు. ఈ ఇల్లు నాది. కొంత కాలం పాటు కావాలంటే ఉపయోగించుకొమన్నాను. కానీ ఇలాంటి పనికని తెలియదు. ఎవర్నువ్వు?" అనడిగాడతడు.
    "నా గురించి నేను చెప్పులోలేను" అన్నాను. నాకు చాలా అవమానకరంగా వుంది. ఇంట్లోకి ఎవరూ రారని రాజశేఖరం కచ్చితంగా చెప్పడం వల్ల తలుపులు దగ్గరగా మాత్రం వేసుకున్నాం. ఇంతలో ఇలా ప్రమాదం ముంచుకొచ్చింది.
    "చూడ్డానికి మద్యదస్తురాలిలాగున్నావు -- నువ్వు చేసే పని గౌరవమైనది కాదు . అయినా నేనిక్కడికి నీకు నీతులు చెప్పడానికి రాలేదు. నేను చేసే అనేక మంచి పనులలో మహిళా సంక్షేమం ఒక్కటి! నువ్వు డబ్బు కోసం రాజశేఖరాన్ని పట్టి వుండవచ్చు. అందుకు నీ మనస్తత్వం కూడా కొంతవరకూ కారణం కావచ్చు. నీ కెవ్వరూ లేని పక్షంలో మా మహిళా మండలి సభ్యురాలివి కావచ్చు. నీలాంటి అభాగ్యురాండ్రు చాలామంది వున్నారక్కడ." అన్నాడతను సీరియస్ గా.
    నవ్వాలో ఏడవాలో తెలియలేదు నాకు -- 'అలాంటి అవసరం లేదు నాకు" అన్నాను. ఎదుటి మనిషికి లోకువయ్యే పరిస్థితుల్లో నన్ను నేనుంచుకున్నందుకు నాకు చాలా బాధ కలిగింది.
    అతను వదిలి పెట్టలేదు. ఆడదానికి శీలం ఎంత ముఖ్యమో వివరిస్తూ -- చేదిపోయినంత మాత్రాన భయపడనవసరం లేదనీ మహిళా మండలి సభ్యురాండ్రకు చాలామంది కి పెళ్ళిళ్ళు తనే జరిపించాననీ చెప్పాడు.
    నాకు విసుగువచ్చి "నేనూ రాజశేఖరం ప్రేమించుకున్నాం. త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నాం " అని చెప్పేశాను. ఆవిధంగా నైనా అతడి బెడత వదలవచ్చునని నాకు అనిపించింది.
    అయితే అతనింకా నన్ను వదల్లేదు. "అబద్ద్దాలు చెప్పవద్దు. రాజశేఖరం గురించి నాకు బాగా తెలుసు. వాడోకర్ని మోసగించే మనిషి కాడు" అన్నాడు.
    'అవును, ఆ సంగతి తెలుసు కాబట్టే నన్నతనికి అర్పించుకోగలిగాను."
    "కానీ వాడికి ఎనార్ధం క్రితమే పెళ్ళయింది" అన్నాడతను.
    "సో వాట్! నాకూ రెండేళ్ళ క్రితం పెళ్లయింది. అతడికి భార్య నచ్చలేదు. నాకు భర్త నచ్చలేదు. అదీ సంగతి!" అన్నాను.
    ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతయింది. "నీకు పెళ్ళయిందా? అయితే భర్త ను మోసం చేసి " అని ఆగిపోయాడు.
    అప్పుడే రాజశేఖరం లేచాడు -" అవున్రా- ఈమె మోసెస్ వీర్రాజు !"
    ఆ యువకుడు నోరు తెరచి "ఈజిట్!" అన్నాడు.
    రాజశేఖరం అలా చటుక్కున నా భర్త వివరాలను ఆ యువకుడికి చెప్పడం నాకు నచ్చలేదు "మిస్టర్ రాజశేఖరం ! నిన్ను నమ్మి వచ్చినందుకు నా బ్రతుకు వీధిలో పెడేస్తావా? ఇదేనా నువ్వు నాకు చేయబోయే ప్రత్యుపకారం !" అన్నాను.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.