Home » D Kameshwari » Madhupam
సునాయాస మరణం
రాత్రి ,మంచి నిద్రలో ఉండగా ఎవరో తట్టి లేపినట్లయి కళ్ళు తెరిచాను. ఎదురుగా కళ్ళు చెదిరే వెలుగు! ఆ వెలుగులోంచి ఓ దివ్య మంగళ రూపం క్రమంగా దగ్గిరగా వచ్చింది. ఆ రూపం దేముడా! దేముడిలాగే వున్నాడు మరి. పీతాంబరాలు, మెడలో మెరిసే వజ్రాల హారాలు - చేతులకి కంకణాలు నెత్తిన కిరీటం, వెనకాతల వెలుగు చక్రం, నిజంగా దేముడే - అమ్మో నాకు దేముడు ప్రత్యక్షమయ్యాడు. 'దేముడూ.... నువ్వేనా. దేముడివేనా, నమ్మకం కుదరక అడిగాను. చిరునవ్వు నవ్వి అవును' అన్నాడు దేముడు.
"యే దేముడిని స్వామి, మెడలో పాము, నెత్తిన గంగ, త్రినేత్రం అవి లేవు కనక శివుడివి కావు - మురళి, ఫించం అవి లేవు కనుక కృష్ణుడివి కావు. నామాలు లేవు. కనుక వెంకన్నవి కావు. సుదర్శన చక్రం లేదు విష్ణు నవ్వి కావు. మరే దేముడిని స్వామి"
"నువ్వెవరు అనుకుంటే ఆ దేముడినే- భక్తులు ఏ రూపం తల్చుకుంటే ఆ రూపం కనిపిస్తుంది" చిరునవ్వి నవ్వి అన్నాడు. ఉబ్బితబ్బిబ్బు అయిపోతూ "నేనేం పుణ్యం చేశానని నాకు ప్రత్యక్షమయ్యావు దేముడూ" అనందం పట్టలేక అడిగా . "నీకు వరం ఇద్దామని ఇచ్చాను. ఓ వరం కోరుకో ప్రసాదిస్తాను " నవ్వుతూ అన్నాడు.
అమ్మో వరమే! వరలిచ్చేటంత పుణ్యం ఏం చేశాను దేముడూ, నేనేం తీర్దాయత్రలు చెయ్యలేదు. గుళ్ళూ గోపురాల చుట్టూ తిరగలేదు. నోములు, వ్రతాలు, యాగాలు , యజ్ఞాలు, ఉపవాసాలు యేమీ చెయ్యలేదు. మొక్కులు మొక్కి నోట్లకట్టలు హుండీలో వేయలేదు. దీపం పెట్టి రెండు నిమిషాలు దేముడికి దండం పెట్టుకోవడం తప్ప నేనేం పూజలు చెయ్యలేదే స్వామీ" ఆశ్చర్యంగా అన్నా. "పూజలు వ్రతాలు చెయ్యనక్కరలేదు. ఈ మధ్య మంచి మనసుతో కాస్త దానాలు ధర్మాలు చేశావుగా అందుకని.... 'తెల్లబోతూ చూశాను' ఏమిటి ఆ కాస్తకే మీ దేముళ్ళు వరాలిచ్చేస్తారా? తిరగేసి బోర్లేసి లెక్కేసినా ఓ ముప్పై వేలన్నాలేవు. అంతకే వరాలిచ్చేయడానికి వచ్చావా? ఆశ్చర్యానందాలతో అన్నాను.
'అంతేగా మరి. నీవే ఓ కవితలో రాశావుగా. 'చేసింది, యిచ్చింది ఊరికే పోదు, తిరిగి నీకే చెందుతుందని, మరి నీవిచ్చింది మళ్ళీ నీకే దక్కాలి గదా' యిద్దామని వచ్చా." అన్నాడు నవ్వుతూ.
"అంటే, ఓ ముప్పై వేల వరం యివ్వడానికి ప్రత్యేకం పనిగట్టుకి వచ్చావా ఆ మాత్రం నే సంపాదించుకోలేనా" కినుకగా అన్నాను. దేముడు చిరునవ్వు నవ్వి అయింది." 'సారీ, సారీ దేముడూ , శివుడాజ్ఞాలేనిదే చీమైనా కుట్టదు గదా, నీదయ లేకపోతే ఓ రూపాయన్న సంపాదించలేం. ఏదో పత్రిక వాళ్ళిచ్చే వందో రెండొందలో కూడా రాకుండా చెయ్యకు. కాగితం , పోస్టు ఖర్చుకైనా వస్తుంది. అది సరే గాని , నేచేసిన యీ కాస్త దానం, ధర్మంకే వరం యిస్తానంటూ వచ్చావు. మరి లక్షలు లక్షలు కట్టలు కట్టి హుండీల్లో వేస్తుంటాయి. కిలోల కొద్ది బంగారాలు, నగలు, హారాలు, కిరీటాలు యిచ్చేస్తుంటారు. యాగాలు, అన్నదానాలు, చేసేస్తుంటారు. మరి వాళ్ళందరికీ ఎన్ని వరాలిచ్చేస్తుంటావు స్వామీ....." సందేహంగా అన్నాను. "కట్టలు కట్టలు డబ్బులిచ్చే వాళ్ళకెందుకు ఇస్తాను. నిజాయితీగా,మ్ న్యాయంగా కష్టపడి సంపాదించిన దానిలో కాస్త యితరుల కిస్తే అది దానం. ఎన్ని కట్టలయినా నల్ల డబ్బు నే ముట్టుకోను....' దర్పంగా అన్నాడు.
"కబుర్లు చెప్పకు దేముడూ. ఆ డబ్బుతో చక్కగా పైనించి కిందవరకు వజ్రాల కిరీటాలు, రత్నాల హారాలు, బంగారు తొడుగులు ..... నిలువంతా బంగారం రత్నాలే కదా - ఆ డబ్బు నే ముట్టనని గొప్పలు చెప్తున్నావు - నిలేశాను.
"పెట్టుకోక ఏం చెయ్యమంటావు. రాతి విగ్రహాన్ని కదా, చేత్తో తీసి పారేయలేను గదా భరించాలి. అక్కడికీ అప్పుడప్పుడు ఏదో వంకతో, కొన్ని అరిష్టాలని, ఇది అది వంకలు పూజారుల చేత చెప్పించి పెట్టుకోను. 'మొన్న 'గాలి' గారిచ్చిన నలభై కోట్ల కిరీటం ముట్టుకున్నానా, అలాగే కొన్ని నగలు, ఏదో భక్తుల సరదా. రాతి విగ్రహాన్ని నగలతో అలంకరించి భక్తీ చూపించి ,ముక్తి పొందాలనుకునే వారిని వారించి ప్రయోజనం లేదు. ఆ డబ్బు అన్నదానాలు, భక్తుల అవసరాలు తీరడానికి ఉపయోగపడ్తోంది కదా. నేనెందుకు కలిపించుకోడం - నిజాయితీగా భక్తిగా ఫలం, పుష్పం , తోయం చాలు మాకు. వారి వారి పాపాలు కడుగుకోడానికి ఏదో చేస్తుంటారు. అలాంటి వారి జోలికి నేను వెళ్ళను. వివరణ యిచ్చాడు. ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాను" అయితే నిజంగా నాకు వరం యిస్తావా" ఇంకా నమ్మకం కలగలేదు నాకు.
"మరి అందుకే గదా వచ్చాను . వరం కోరుకో. "ఒక్కటే సుమా."
"ఏం వరం యిస్తావు. ఏం కోరుకోను.....' సన్ద౪ఎహమ్గా అడిగాను.
"నీ ఇష్టం వచ్చింది అడుగు, కాని ఒక చిన్న షరతు. ఏం కోరుకున్నా అది కేవలం నీకే ఉపయోగపడ్తుంది. నీకే వర్తిస్తుంది. మరెవరికి దక్కదు."
"మళ్ళీ అదేం మెలిక "ప్రతి ప్రాణంబు దక్క' అని సావిత్రికి యముడు వరం యిచ్చినట్టు - మళ్ళీ ఈ షరతేమిటి-'
"మరంతే - ఎవరెవరి ఖర్మ ఫలాలని బట్టి మంచైనా చెడ్డైనా వారే అనుభవించాలి. ఏదన్నా వాళ్ళు పొందగలిగిందే దక్కుతుంది. అప్పనంగా వచ్చేది కాదు.'
"ఏం వరం కోరుకును?" అర్ధం కాక ఆలోచించసాగాను.
"డబ్బు , బంగారం, యిల్లు..... నీ యిష్టం..."
"సరే, అయితే.... ఓ పదికోట్లు .... ఛా.... ఛా.... కోరుకునే దాకా వస్తే పది కొట్లేంటి ఓ వందకోట్లు ఇచ్చేయి. పిల్లలకి, మనవలకి అందరికి తలో పదికోట్లు యిచ్చి మిగతావి నాక్కావలసినవి కొనుక్కుని - కాస్త దానం ధర్మం ...."
"ఇదిగో అమ్మా నీకేం చెప్పాను. ఈ వరంలో కోరుకున్నది నీకు మాత్రమె ఉపయోగిపడ్తుంది అని."
'అంటే, నా తదనంతర'మైనా పిల్లలకి దక్కదా - "నిరాశగా అన్నా' మరి అలాంటప్పుడు ఇంత డబ్బు ఈ వయసులో ఏం చేసుకోను?"
"చూడు తల్లీ, పిల్లలకి కోట్లు కూడబెట్టి యిచ్చిన వాళ్ళ గతి యే,మవుతుందోచూస్తున్నావుగా. పెన్షన్ మీద బతుకుతున్న నీకు వందకొట్ల్రెక్కడివి? దొంగ నోట్ల వ్యాపారమా అని నిన్ను నీ పిల్లలని పోలీసు స్టేషన్లు, కోర్టులు పేరు చెప్పి లాకప్ లో చిప్పకూడు తినిపిస్తే అది నీకు ఇష్టమా? అక్రమ సంపాదనల వాళ్ళు పడుతున్న అవస్థలు చూసి కూడా అడుగుతున్నావా అంత డబ్బు."





