Home » Dr Dasaradhi Rangacharya » Shrimadbhagwatgeeta
మా ఆన్నయ్య (1925-87) విద్వత్కవి - ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి. వారు 40 కవితా సంపుటాలు వెలువరించారు.
వారు సినీకవి. "నా కంటిపాపలో నిలిచిపోరా...." "దివి నుండి భువికి దిగివచ్చిన పారిజాతమో"
నేను 1700ల అచ్చుపుటలు గల 73 రచనలు చేశాను.
పూజకు
పూజకై
వెళ్ళాను.
పూలన్నీ
పూజలోనే
ఉన్నాయి.
మా పిల్లలకు సాహిత్యంలో అభిరుచి లేదు. అంత మాత్రంతో దాశరథి వంశంలో సాహిత్యం అంతరించినట్లు కాదు. వేయేళ్ళ వంశచరిత్రలో ఎన్ని శూన్యాలు వచ్చాయో?
దాశరథి నుండి 'దా' - తొలగిస్తే
శరథి.... సముద్రం
శరథి నుండి 'శ' తొలగించండి
రథి..... రథము గలవాడు
రథి నుండి 'ర' తొలగించండి
థి...... ధీమంతుడు
వ్యాసుని ఆవిర్భావం
పరాశరుడు తీర్ధయాత్రలకు బయలుదేరినాడు. అతడు యమునాతీరమునకు వచ్చినాడు. అనాది దాటవలసి ఉన్నది. మత్స్య గ్రంథియను నావ దాటించు కార్యమున, నావలో ఉన్నది.
ఆమె దాశరాజు కూతురు సత్యవతి. అందాలరాణి పరాశరుడు మత్స్య గంగిని చూశాడు. నావ ఎక్కినాడు. నావ కదిలినది. నది మధ్యకు వచ్చినది. పరాశరునకు మత్స్యగంథి మీద మనసయినది. అతని మనసులోని మాట ఆ చిన్నదానికి తెలిపినాడు. చిన్నది సిగ్గుపడలేదు. తాను కన్యను - తన కన్యాత్వము చెడును అన్నది. పరాశరునకు మనసయినది. ఆమె కన్యాత్వము వికలము కాకుండునట్లు వరమిచ్చినాడు. అంత ఆ చిన్నది మరొక నెపము చెప్పినది. తాను చేప కడుపున పుట్టినందున తన ఒంటినిండ చేప వాసన కలదు అన్నది. పరాశరునాకు మనసయినది. అతడు ఆమెను యోజనగంథఙని చేసినాడు. ఆమె తనువు పరిమళము ఒక యోజనము వరకు వ్యాపించునట్లు వరమిచ్చినాడు. ఆమె ఆ నాటినుంచి యోజనగంథి అయినది. ఆమె అసలు పేరు సత్యవతి. ఆమె పరాశరుని చూచినది అప్పటికి మిట్టమధ్యాహ్నమయినది. వెలుగు వెదజల్లుచున్నది. సత్యవతి వెలుగులో తనకు సిగ్గు అగుచున్నది అన్నది. పరాశరునకు మనసయినది. అతడు మంచుతెర కల్పించినాడు. చీకటి సృష్టించినాడు. ఇరువురు కృష్ణ దీప్పమునకు చేరినారు. పరాశరుడు సత్యవతితో రమించినాడు.
సత్యవతికి సద్యోగర్భమయినది. ఆమె ఆ ద్వీపమున వ్యాసుని కన్నది. ఈ వ్యాసుడు కృష్ణద్వీపమున జన్మించినాడు. అందువలన అతని పేరు కృష్ణద్వైపాయన వ్యాసుడు అయినది. వ్యాసుడు పరమ తేజస్వి, జ్ఞాని, లోకకళ్యాణకారుడు.
పరాశరుడు సత్యవతిని చూచినాడు. ఆనందించినాడు. వ్యాసుని చూచినాడు. మురిసినాడు. ఉభయులను ఆశీర్వదించినాడు. తనతోవ తాను వెళ్ళినాడు.
"కృష్ణద్వైపాయనుండు కృష్ణాజిన పరిధాన కపిలజటామండల దండకమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకుంబనిగల యప్పుడ నన్నుందలంచునది యాక్షణంబవత్తునని సకలలోక పావను డఖిలలోక హితర్ధంబుగా దపోవనంబున కుంజనియందు మహాఘోరతపంబు చేసె" సత్యవతీ నందన వ్యాసుడు అరణ్యమున ప్రవేశించినాడు. లోక కళ్యాణమునకై తపమాచరించినాడు. అతడు వేదములను వ్యాస మొనరించినాడు. వేదవ్యాసుడు అయినాడు. ఆనాటికి వేదములు ఈ రూపమున లేకుండెను. సకలము వేదమనుచుండిరి. ఏది వేదమగునో ఏదికాదో తెలుసుకొనుట దుస్తరముగా ఉండెను. వ్యాస మహర్షి వేదములన్నింటిని సేకరించినాడు. వానిని నాలుగు భాగములుగా విభజించినాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనువానిని నిర్మించినాడు. వేదములను క్రోడీకరించినాడు. మానవాళికి గొప్ప ఉపకారము చేసినాడు. వేద ప్రమాణములను గ్రహించుటకు ఒక మార్గము ఏర్పరచినాడు. ఒక మహత్కార్యమును, బృహత్కార్యమును సాధించినాడు.
వేదవ్యాసుడు మహాత్కార్యము సాధించినాడు. కాని ఆయనకు సంతృప్తి కలుగలేదు. వేదము కొందరికే ఉపకరించును. అందరికీ ఉపకరించుదాని కొఱకు అన్వేషించినాడు. భారత సంహిత కల్పనకు పూనుకున్నాడు. భారతమును గురించి ఆలోచించినాడు. దానికి రూపకల్పన చేసినాడు.
ఇదం హి వేదైః సమితం పవిత్ర మపిచోత్తమమ్
శ్రవ్యాణాముత్తమం చైదమ్ పురాణమృషి సంస్తుతమ్
ఇది వేదములతో సమానమయినది. పవిత్రమైనది. అత్యుత్తమమైనది. శ్రవ్యములలో ఉత్తమము, పురాణమును అయినది. దీనిని ఋషులు సంస్తుతించినారు.
వేదవ్యాసుడు భారత కావ్యమును కల్పించినాడు. అప్పుడు అతనికి మరింత వ్యధ మొదలయినది. కావ్యకల్పన జరిగినది. దీనికి అక్షర నిర్మాణము కావలెను. అదెట్లు అని విచారమున పరితపించినాడు. అప్పుడు అతనికి బ్రహ్మ ప్రత్యక్షమయినాడు. వ్యాసుడు బ్రహ్మకు అంజలి ఘటించినాడు. ఆదరించినాడు అన్నాడు:-
"దేవా! నేను మనసులో మహాభారతమును సంకల్పించినాను. అందు వేదసారమును చేర్చినాను. ఉపనిషత్తులను కూర్చినాను. పురాణములను చెప్పినాను. భూత భవిష్యద్వర్త మానములను వర్ణించినాను. బాల్య, యవ్వన, జరామరణములను గురించి వివరించినాను. రాగ ద్వేషాదులను, భయము, భ్రమ వీటిని గురించి సూచించినాను. ఆశ్రమములను గురించి చెప్పినాను. యుగములను గురించి చెప్పినాను. గ్రహ, నక్షత్రాదులను గురించి వివరించినాను. భగవానుని అవతారములు వర్ణించినాను. పవిత్ర స్థలములను, నదీనదములను వివరించినాను.
యథా సముద్రో భగవాన్ యథామేరుర్మహాగిరిః
ఉభౌఖ్యాతౌ రత్ననిధి తథా భారతముచ్చతే.
సముద్రము, మేరు పర్వతము రత్నములకు నిలయములు, భారతము సహితము అటువంటిదే. అది సహితము రత్నములకు నిధి.
అట్టి భారతమును కల్పించినాను. దానికి అక్షరరూపము ఈయవలసి ఉన్నది. అక్షరాకృతి కాకున్న లోకమునకు, లోకులకు ఉపకరించదు. వారికి ఉపకరించని కల్పన వ్యర్ధము. కావున దేవా! దీనికి అక్షరరూపమునిచ్చు ఉపాయము ప్రసాదించుము. "బ్రహ్మదేవుడు ప్రసన్నుడయినాడు వ్యాసుని ప్రశంసించినాడు అన్నాడు:-
"మహర్షీ! నీవు లోక కళ్యాణము కొఱకు ఒక సంహితను సంకల్పించినావు. దానికి అక్షరరూప మిచ్చుట వినాయకునికి మాత్రమే సాధ్యపడును. కాబట్టి గణపతిని ప్రార్దించుము".
బ్రహ్మ అంతర్ధానుడయినాడు. వ్యాసమహర్షి గణపతిని గురించి తప మాచరించినాడు. వినాయకుడు ప్రత్యక్ష మయినాడు. వ్యాసుడు తన కార్యమును గురించి వినాయకునికి విన్నవించినాడు. గణపతి భారత సంహితను అక్షరబద్దము చేయుటకు అంగీకరించినాడు. అందుకు ఒక నియమము ఏర్పరచినాడు. వ్యాసుడు నిరంతరము చెప్పుచుండవలెను. క్షణమయినను జాప్యము రాకూడదు. అట్లు వచ్చిన వ్రాత నిలిపివేతును అన్నాడు గణపతి. వ్యాసుడు ఆలోచించినాడు. అతడు ఒక షరతు విధించినాడు. గణపతి వ్రాయునపుడు అర్ధము చేసుకుని వ్రాయవలెను. అర్ధముకాకున్న ఆగవలెను. అందుకు గణపతి అంగీకరించినాడు.
భారత రచనా యజ్ఞము ఆరంభమయినది. మహర్షి వ్యాసుడు చెప్పుచున్నాడు. వినాయక భగవానుడు వ్రాయుచున్నాడు. వ్యాసునకు సమయము కావలసినపుడు ఒక క్లిష్టమైన శ్లోకము చెప్పినాడు. గణపతి అర్ధము చేసుకొనుటకు కొంత సమయము పట్టినది. ఆ విధముగా సర్వజనోపయోగమయిన మహాభారత సంహిత మానవాళికి అందించబడింది. వ్యాస భగవానుడు మహాభారతమును అరువది లక్షల శ్లోకములలో రచించినాడు. అందు ముప్పది లక్షలు స్వర్గలోకమందు, పదిహేను లక్షలు పితృలోకమందు, పద్నాలుగు లక్షలు గంధర్వ లోకమందు, ఒక లక్షమానవ లోకమందు ప్రతిష్ఠించబడినవి. వానిలో ఎనిమిదివేల ఎనిమిది వందల శ్లోకములు, అతిక్లిష్టములయినవి మధ్య మధ్య వ్రాయించి నారు వ్యాసమహర్షి వానిని గురించి వ్యాసుడు:-