Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
చెరగి
నేను పుట్టిన పురిటి నొప్పుల చీకటి బాధ
చెరగి
నేను నశించి చావు సంజెల నెత్తుటిచార
చెరపికొని నీ మధ్య నా మధ్య గల దూరపు రేఖ
తెలిసికొని
నీ మధ్య నా మధ్య
వంగిన తారకల శాఖ
రేఖగా
పొలిమేరగా
కరిగి నిల్చిన నేను
నిర్వాత దీప ని
శ్చలముగా నిలువగా
నిర్హేతు కానంద
నీరవగళాన పిలువగా
వెండిచుక్కల మీట
పవడంపు దారాల భావాల నల్లుకొను
కలలొత్తి అలలొత్తి
కడలిలా పరుచుకొను
నాలోన
లోలోన
ఒక శ్రుతి
ఒక గతి
* * *
---1959



