Home » Dr S V S Kishore Kumar » Prema Pelli Vidakulu
రోజూ ఐదు గంటలకు అలారమ్ పెట్టుకుంటాను లేచేందుకు.
యోగ, ప్రాణాయామంతో నా దినచర్య మొదలవుతుంది.
అంటే అప్పుడే తెల్లారిందన్నమాట.
భోజనాలప్పుడు శ్రీమతితో మొదలుపెట్టిన సంజయ్, మంజరిల పెళ్లి సంభాషణ ఇప్పటికయ్యిందా అంటూ ఆశ్చర్య పోయాను.
గతం అంతా ఒక మారు కళ్ళముందు మెదిలింది.
శశి, ప్రవల్లికతో జరిగిన సంభాషణ మొత్తం చెప్తూ ఉంటె, ఆ మాటలు వింటూ సంజయ్ మంజరి ల పెళ్లి దృశ్యాలు కళ్ళముందు కదులుతుంటే అవన్నీ క్రోడీకరించుకుంటూ న్యాయపరంగా వాటిలోని విషయాలని విశ్లేషించుకుంటూ గతంలోనుంచి ప్రస్తుత స్థితికొచ్చాను.
ఎలాగూ ఐదయిందిగా ఇక నాకు నిద్ర పట్టదు.
శశిని పడుకోమని చెప్పి నేను నా ఆఫీస్ రూమ్ లోకి వచ్చి కూర్చున్నాను.
ఇక ఈ సమస్యకు విడాకులే పరిష్కారం.
కాకుంటే ఎలా అన్నది ఆలోచించాలి.
ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటె సంజయ్ నుంచి వాట్సాప్ కాల్ హలొ అంకుల్ అంటూ.
చెప్పు సంజయ్. ఏంటి సంగతులు అన్నాను.
అంకుల్. మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యట్లేదు కదా అన్నాడు.
లేదు సంజయ్ చెప్పు. నీ గురించే ఆలోచిస్తున్నాను.
ఇప్పుడే మంజరి ని ఫ్లైట్ ఎక్కించాను అంకుల్. స్ట్రెయిట్ ఫ్లైట్ దొరకలేదు. అందువల్ల టైం ఎక్కువపడుతుంది. రేపు ఉదయం పది గంటలకు హైదరాబాద్ చేరుతుంది. దారిలో ఖర్చులకు కరెన్సీ ఇచ్చాను.
మీరు చెప్పినట్లు తన మాటలు రికార్డు చేసాను. తన ఇష్టానుసారమే ఇండియా కి వెళుతున్నట్లు, నా బలవంతమేమీ లేనట్లు, నా వలన కానీ, నా పేరెంట్స్ వలన కానీ తనకేమీ సమస్య లేనట్లు, కేవలం తల్లితండ్రుల బలవంతం మీద పెళ్లి చేసుకుని, నాతో పెళ్లి ఇష్టం లేక, కాపురం చేయలేక వెళుతున్నట్లు చెప్పింది. ఇది సరిపోతుందా అంకుల్ అని అడిగాడు సంజయ్.
వెరీ గుడ్ సంజయ్. ఆ సంభాషణ సరిపోతుంది ఇప్పటికి.
నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అదే తన ఇమెయిల్, ఫేస్ బుక్ ఓపెన్ చేసి చూసావా. అందులో ఏమన్నా ఉన్నాయా అని అడిగాను.
అవి చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయి అంకుల్.
అందులో ఇద్దరి మధ్య రోజువారీ జరిగిన సంభాషణ, వాళ్ళు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి.
మీకు ఇమెయిల్, ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ పంపిస్తాను. న్యాయపరంగా మీకు ఎలా అనుకూలమైతే అలా తీసుకోండి అని చెప్పాడు.
సరే సంజయ్. నాకు వాట్సాప్ చెయ్యి. నేను మొత్తం చూసి అందులో ఏవి అవసరమైతే అవి చూస్తాను. ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం కదా. విడాకులు పరిష్కారమైనా తనకు, తన జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి అన్నాను.
యూ ఆర్ రైట్ అంకుల్. ఇక మీ ఇష్టం. తనతో నా జీవన ప్రయాణం ముగిసినట్లే. ఎందుకంటే తను ప్రియుడితో చేసిన ముచ్చట్లు, వారిరువురు ఉన్న ఫొటోలు చూస్తే ఇక మేము కలిసి జీవించడం అసాధ్యం అని ఎవరికైనా అర్ధమవుతుంది. నా అదృష్టం ఏమంటే నా జీవితానికి తను హాని తలపెట్టినా మీ అందరి బ్లెస్సింగ్స్ వలన నేను సేవ్ అయ్యాను.
సంజయ్ గొంతులో కొంచెం ఆవేశం, కొంచెం ఉద్విగ్నత చోటు చేసుకున్నాయి.
అవును సంజయ్. నేను మీ డాడీ అదే అనుకున్నాము. రెప్పపాటులో నీకు ప్రమాదం తప్పింది. ఆ విధంగా నీకు ఎంతో మేలు జరిగింది. కాకుంటే నాదొక్క మనవి అన్నాను.
అయ్యో అదేంటంకుల్ . మీరు ఎలా చెప్తే అలా. చెప్పండి ప్లీజ్ అన్నాడు.
ఈ విషయం గురించి నీవు ఎటువంటి ఆలోచన చేయకుండా, మనసులో బాధ అలాంటివేమీ పెట్టుకోకుండా కూల్ గా ఉండు. అదొక్కటే నాసైడ్ నుంచి నీకు రిక్వెస్ట్ అన్నాను.
తప్పకుండా అంకుల్. ఇందులో నా తప్పేమీ లేదు. అందువల్ల నేను ఇక దీని గురించి ఆలోచించను. తన జీవితం తన ఇష్టం అన్నాడు సంజయ్.
అతని మాటల్లో ఎంతో పరిణితి కనిపించింది నాకు.
మళ్ళీ తనే అన్నాడు సంజయ్. తనకు ఏ ఇబ్బంది లేకుండా విడాకులు వచ్చేట్లు చూడండి అంకుల్. నా వైపు నుంచి అదే స్పెషల్ రిక్వెస్ట్ అని.
సరే సంజయ్. రేపు మంజరి పేరెంట్స్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాము. వీలుంటే వాళ్ళ తరపు వాళ్ళని కూడా తెమ్మన్నాము. ఎమోషనల్లో ముకుందరావు కూతురి మీద ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు కదా అందుకని.
మంజరిని తన పేరెంట్స్ కి అప్పగిస్తాము. నేను మీ డాడీ కూడా ఎయిర్పోర్ట్ కి వెళుతున్నాము. నీ స్పెషల్ రిక్వెస్ట్ ప్రకారమే అంతా చేస్తాను. ఆ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా మీ ఇద్దరికీ విడాకులు మంజూరు అయ్యేట్లు ప్రయత్నిస్తాను. ఇది నా హామీ అని చెప్పాను.
మెనీ మెనీ థాంక్స్ అంకుల్ అని చెప్పాడు సంజయ్.
ఓకే రా సంజయ్ అని ఫోన్ పెట్టేసాను.
ఇమెయిల్, ఫేస్బుక్ లాగిన్స్, పాస్వర్డ్స్ వాట్సాప్ లో పంపాడు సంజయ్.
సరే అవన్నీ మళ్ళీ చూద్దాం తీరిగ్గా అనుకుని యోగ, ప్రాణాయామం చేసేందుకు లేచాను.
****
స్నానం చేసి, టిఫిన్ తిని తొమ్మిదింటికి ఆఫీస్ రూమ్ కి వచ్చాను.
నాది గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీస్, ఫస్టు ఫ్లోర్ లో రెసిడెన్స్ పెట్టుకున్నాను అనుకూలంగా ఉంటుందని.
అప్పటికే ఆఫీస్ రూమ్ లో జూనియర్స్ బిజీ గా ఆరోజు కోర్ట్ ఫైల్స్ చెక్ చేస్తున్నారు.
ఎవరి కోర్ట్ మేటర్స్ వాళ్ళు చూసుకుంటున్నారు.
కేసులన్నీ డిస్కస్ చేసి ఏవి ఎలా చెయ్యాలో అందరికి వివరించి చెప్పాను.
మా వాళ్లకి చెప్పాను ఇవాళ రేపు పర్సనల్ గా బిజీ, కోర్ట్ కి రాను అని.
పది గంటలయింది. అందరూ కోర్ట్ కి బయలుదేరి వెళ్లారు.
ఆఫీస్ రూమ్ లో ఒక్కడినే ఉన్నాను. కంప్యూటర్ ఆన్ చేసి సంజయ్ పంపిన ఇమెయిల్ ఓపెన్ చేసాను.
ఇమెయిల్ మంజరి పేరు మీద కాక అపూర్వ పేరు మీద క్రియేట్ చేసి ఉంది. అంటే ఫేక్ ఇమెయిల్ అన్నమాట.
ఎవరికీ అనుమానం రాకుండా అలా చేశారు.
ఇమెయిల్ హాంగ్ ఔట్స్ లో చూస్తే చాలా మేటర్ కనిపించింది.
ఇరువురి నడుమ జరిగిన సంభాషణ అది.
ఇంకొక సైడ్ ఇమెయిల్ బావ అనే పేరుతో ఉంది.
అంటే అపూర్వ (మంజరి) కి , బావ (మంజరి ప్రియుడు) కి మధ్య జరిగిన చాటింగ్ అన్నమాట.
మాట్లాడుకునే తెలుగు భాష నే ఇంగ్లీష్ లో టైపు చేసి ఉంచారు పాపం తెలుగు టైపింగ్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అందుకని.
ఆ సంభాషణ ఊహించలేనంత అసహ్యంగా ఉంది చదువుతుంటే.
పడకగది లో చేసే శృంగారమంతా వర్ణించ అలవికాని రీతిలో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది.
న్యాయస్థానంలో కేసు గట్టిగా నిలబడాలంటే అడ్వకేట్ ఇలాంటివి పూర్తిగా చదివి వాటిల్లో ఆధారాలు సేకరించి కోర్ట్ ముందుకు తేవాలి.
జుగుప్సాకరంగా ఉన్నా చాలావరకు చదివాను.
ఒక రోజు సంభాషణ ప్రింట్ కూడా చేసాను.
పది పేజీలు వచ్చింది.
అలా నాలుగు సంవత్సరాలనుంచి సంభాషణ జరుగుతోంది.
అవి మొత్తం ప్రింట్ చెయ్యాలంటే కొన్ని వేల పేజీలు కావాలి.
ఎవిడెన్స్ కు అంత అవసరం లేదు.
మరీ అసహ్యమైన సంభాషణను ఎంచుకుని ఓ ముప్పై పేజీలు ప్రింట్ చేసాను ముందుగా మంజరి తల్లి తండ్రులకు చూపించేందుకు.
ఆ సంభాషణలో ప్రియుడి అసలు పేరు మురళీకృష్ణ గా కంఫర్మ్ అయ్యింది. అంటే నేను మొదటినుంచి అనుమానిస్తున్న వ్యక్తి ఇతనేనన్నమాట.
నాకు ఎన్నోసార్లు తారసపడ్డ వ్యక్తి కూడా అతనే.
మంజరి, మురళీకృష్ణ సంభాషణలో చాలా వివరాలే ఉన్నాయి.
మురళీకృష్ణ, మంజరి విజయవాడ లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లో చదువుకున్నారు.
మురళీకృష్ణ మంజరి కంటే ఒక సంవత్సరం జూనియర్.
మంజరి రెండో సంవత్సరం బి టెక్ చదివేప్పుడు ఒక రోజు కాలేజీలో మెట్లు దిగుతుంటే మురళీకృష్ణ ఆమెకు ఎదురుగా మెట్లు ఎక్కుతూ మెరుపు వేగంతో ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు.
అక్కడనుంచి మొదలయ్యింది మంజరి మురళీకృష్ణ ల ప్రేమ గాథ.
మురళీకృష్ణ ప్రేమలో వేగం పెంచుతుంటే మంజరి అంతకంటే వేగంగా తమ ప్రేమలో ఫస్ట్ గా గెలిచి కప్ తానే గెలిచి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యింది.
అలా అని మంజరి డల్ స్టూడెంట్ కాదు సుమా.
చదువులో అందరికంటే ఫస్ట్ గానే ఉంది. మంచి మార్కులు కూడా తెచ్చుకుంది.
డిగ్రీ అయిపోయినా తన బావ అదే మురళీకృష్ణ కోసం ఎం టెక్ లో చేరింది క్యాంపస్ సెలెక్షన్ వచ్చినా కూడా.
కుటుంబపరంగా చూస్తే మురళీకృష్ణ వాళ్ళది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం.
మంజరి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం.
మంజరి తండ్రి ముకుందరావుకి తాతల ఆస్తులు కొంచెం వచ్చాయి ఆర్ధికంగా ఫరవాలేదు అన్నట్లుగా.
మంజరి తల్లి వాణి అదే కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉన్నా ఆవిడ ఇవన్నీ గమనించలేక పోయింది.
అంత రహస్యంగా మంజరి మురళీకృష్ణ ప్రేమించుకున్నారన్నమాట.
అంతా బాగానే ఉంది.
ఇంతకీ మంజరి మురళీకృష్ణకి తొలి ప్రేమికురాలా లేక ఒకే ఒక ప్రేమికురాలా అంటే ఆబ్బె, కాదు.





