Home » Dr S V S Kishore Kumar » Nari Nari Naduma Murari
ఏదన్నా కాంఫిడెన్టియాలిటీ మైంటైన్ చెయ్యండి ఆ అకౌంట్ లో. ఎవ్వరికీ అనుమానం రాకూడదు అన్నాడు జోనల్ మేనేజర్.
ఓకే సర్. థాంక్యూ అని చెప్పి లేచాడు కృష్ణ కుమార్.
ఎప్పుడు ఏ అవసరమున్నా నాకు చెప్పండి. డోంట్ హెసిటేట్ అన్నాడు.
గ్రేట్ సర్. నైస్ అఫ్ యు అని బయటికొచ్చాడు.
ఈ బ్యాంకింగ్ సెక్టార్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.
పై లెవెల్ లో అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ తో కోట్లు కోట్లు లోన్స్ ఇస్తారు. వాటి రికవర్ బ్రాంచ్ హెడ్స్ మీద పడుతుంది. వాటిలో ఏవి తేడా వచ్చినా బ్రాంచ్ హెడ్స్ మీద ఎంక్వయిరీ లు , సస్పెన్షన్ లు, డిస్మిస్ లు జరుగుతుంటాయి.
ఆ అవమానాలు భరించలేక కొంత మంది సూసైడ్ కూడా చేసుకున్నారు.
కృష్ణకుమార్ ప్రిన్సిపల్ మొదటినుంచి ఒకటే. ముక్కుసూటిగా వెళ్లడం అలవాటు చేసుకున్నాడు.
ప్రమోషన్స్ కోసం పెద్ద లోన్స్ ఇచ్చినవాళ్లు చాలా మంది ఇంటికి వెళ్లారు ఊస్టింగ్ తో. అందువల్ల ఆ జోలికి వెళ్ళడు.
ప్రమోషన్ కంటే జీవితం ముఖ్యం అన్నది అతని సిద్ధాంతం.
తమ బ్యాంకు లో కూడా నిప్పు అని టైటిల్ ఇచ్చారు తనకి.
అయితే అన్నారు నాకేంటి అని కేర్ చెయ్యడు ఎవరిని.
తన లైఫ్ తనకి హ్యాపీగా ఉంది. అడ్డదారులలో సంపాదించి, పై వాళ్ళ మెప్పు కోసం లేని పోనీ లోన్స్ ఇస్తే జీవితం ఉండదు.
అటువంటి అవమానాలు తను ఎదుర్కోలేడు కూడా.
ఇప్పుడు హాయి గానే ఉంది.
ఇంకొన్నేళ్లు ఇలాగే జాగ్రత్తగా ఉంటె హ్యాపీ గా రిటైర్ అవొచ్చు అని అతని భావన.
బ్రాంచ్ కి వచ్చేప్పటికి లంచ్ టైం అయ్యింది.
లంచ్ కాగానే బ్యాంకింగ్ అవర్స్ ఉంటాయి కాబట్టి కొంతమంది కస్టమర్స్ బయట వెయిట్ చేస్తున్నారు.
తనని చూసి సెక్యూరిటీ గార్డ్ కొలాప్స్ గెట్ ఓపెన్ చేసాడు.
డ్రైవర్ కారేజ్ తెచ్చి కేబిన్ లో టేబుల్ పై పెట్టాడు.
సబ్ మేనేజర్ టిఫిన్ బాక్స్ ఓపెన్ చెయ్యబోతూ తనని చూసి కేబిన్ లోకి వచ్చాడు.
శాంతారాం గారు టిఫిన్ చేసి రండి అంటూ నొచ్చుకున్నాడు కృష్ణకుమార్.
ఫరవాలేదు సర్ అంటూ పొద్దున్ననుంచి జరిగినవి ఎక్స్ప్లెయిన్ చేసాడు.
ఓకే థాంక్యూ అన్నాడు.
ఇవాళ మీరు కొత్తగా కనపడుతున్నారు అన్నాడు శాంతారాం వేసుకున్న కొత్త షర్ట్, ప్యాంటు చూసి.
ఇవాళ నా బర్త్ డే సర్ అన్నాడు. ఇది మా అమ్మాయి పంపింది.
తాను అమెరికా లో ఉంటుంది. అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసింది.
కృష్ణకుమార్ లేచి శాంతారాం చేయి పట్టుకుని హార్టీ కంగ్రాట్స్ అన్నాడు సంతోషం వెలిబుచ్చుతూ. నాకు ఒక అలవాటు ఉంది శాంతారాం గారు. నేనెక్కడికి వెళ్లినా బర్త్ డేస్ లిస్ట్ మెయింటేన్ చేసి సెలెబ్రేట్ చేస్తాను. అది చాలా ముఖ్యంగా భావిస్తాను. ఆ అలవాటు మీతోనే స్టార్ట్ చేస్తాను. కేక్ ఆర్డర్ చెయ్యండి బ్రాంచ్ తరపున. ఈవెనింగ్ కేక్ కట్ చేద్దురు గాని అన్నాడు.
అయ్యో వద్దు సర్ అంటూ మొహమాటపడ్డాడు శాంతారాం.
ప్లీజ్ సర్. మీరు అలా అనకండి. ఇదొక సరదా మాత్రమే. మీరు ఏమీ ఫీల్ అవ్వకండి. జస్ట్ ఎంజాయ్ చేద్దాం అందరం అని చెప్పాడు. మీరు వెళ్లి మీ శ్రీమతి గారు పంపిన స్పెషల్స్ తినండి ప్లీజ్ అన్నాడు.
థాంక్యూ సర్ అన్నాడు శాంతారాం.
అతను వెళ్ళగానే విద్యావతి వచ్చింది.
రండి మేడం. భోజనం అయ్యిందా అని అడిగాడు.
ఇప్పుడే అయ్యింది. మీరు జోనల్ ఆఫీస్ కి వెళ్లారు అని చెప్పారు.
అవును. నిన్న మనం విజిట్ చేసిన యూనిట్ గురించి జోనల్ మేనేజర్ కొన్నికీలక విషయాలు చెప్పారు. మీరు కూర్చోండి అవి చెప్తాను అన్నాడు.
మీరు లంచ్ చెయ్యండి. నేను మళ్ళీ వస్తాను అంది.
ఆకలి లేదు. జస్ట్ టెన్ మినిట్స్ అని మొత్తం వివరించి చెప్పాడు. కొంచెం కాషన్ గా ఉండాలి ఆ అకౌంట్ లో అని మరీ మరీ చెప్పారు. నేను ఆల్రెడీ కొంత రాసాను నాకున్న డౌట్స్ గురించి. అవి మీకు ఇస్తాను. మీరు కూడా స్టడీ చెయ్యండి అన్నాడు.
సరే సర్ అంది.
ఏంటి ఇవాళ మీ లంచ్ స్పెషల్స్ అని అడిగాడు.
ఉప్మా కాదు లెండి. ఇవాళ దోశ తెచ్చుకున్నాను అంది.
ఓహ్ వెరైటీ అన్నమాట. మా ఆవిడ వంటలు కూడా టేస్ట్ చెయ్యండి అని క్యారేజ్ ఓపెన్ చేసాడు.
ఒక స్వీట్, కొంచెం పులిహోర, కొంచెం కర్డు రైస్, దొండకాయ కూర, వడియాలు ఉన్నాయి. అన్నీ కొంచెం కొంచెం పెట్టున్నాయి.
అదేంటి మరీ అంత కొంచెం తింటారా అంది
ఇవే ఎక్కువ. నా ఇష్టానికి తగ్గట్టు కరెక్ట్ గా అమరుస్తుంది మా రేణు అన్నాడు.
ఓహ్ మీ డైటింగ్ ఆవిడ మానిటర్ చేస్తోందన్నమాట అంది నవ్వుతూ.
ఎప్పుడూ కొంటె మాటలే. మామూలుగా ఉండవు మీ మాటలు అన్నాడు నవ్వుతూ. మన బ్రాంచ్ లో ఐ పి మెసెంజర్ ఉందికదా అన్నాడు.
ఎస్ సర్. మీ సిస్టం లో కూడా ఉంది అని ఓపెన్ చేసి చూపించింది.
మీరు కేబిన్ నుంచి బయటకు రాకుండా అన్ని సీట్స్ కి కనెక్ట్ అవ్వొచ్చు. మీ మెసేజ్ చెప్పొచ్చు. అది మీకు చాలా ఈజీ అవుతుంది.
అవును. చాలా అవసరం అది. అట్టాచ్మెంట్స్ కూడా పంపొచ్చు కదా అన్నాడు.
ఎస్ సర్ అంటూ మీరు ప్రశాంతంగా మీ మినీ మీల్స్ తినండి అంటూ లేచింది విద్యావతి.
****
గబ గబా లంచ్ కంప్లీట్ చేసి ఆ రోజు ఫిగర్స్ చూసాడు కృష్ణకుమార్. డిపాజిట్స్ ఐదు కోట్లు పెరిగాయి. ఎవరో తమ ఎస్ బి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు నెఫ్ట్ లో.
అన్నీ ట్రాన్సక్షన్స్ వెరిఫై చేస్తుంటే మొబైల్ మోగింది.
ఎవరిదబ్బా కొత్త నెంబర్ అనుకుంటూ ఆన్సర్ చేసాడు.
సర్ నేను ఏ జి ఎం, ఐ బి బ్యాంకు కోటి బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. మీ విరాజ్ స్పిన్ టెక్స్ లో మా కన్సార్టియం కూడా ఉంది. మీరు కొత్తగా జాయిన్ అయ్యారని తెలిసింది. ఆ లోన్ గురించి మీతో డిస్కస్ చెయ్యాలి. ఎప్పుడు రమ్మంటారు అని అడిగాడు.
ఇప్పుడు రాగలరా అని అడిగాడు.
సరే సర్. నాకు మీ బ్రాంచ్ దగ్గరే. అరగంటలో అక్కడ ఉంటాను అన్నాడు.
అనుకున్నట్లే ఐ బి బ్యాంకు కోటి బ్రాంచ్ ఏ జి ఎం అరగంటలోపే వచ్చాడు.
హ్యాపీ టు మీట్ యూ అంటూ పరస్పర కరచాలనాలు అయ్యాయి.
ఒక గంట సేపు ఏకబిగిన డిస్కషన్స్ జరిగాయి. చాలా పాయింట్స్ డిస్కస్ చేశారు.
బిస్కట్స్, టీ వచ్చాయి. అప్పటికే అఫీషయల్ డిస్కషన్ అయ్యి పర్సనల్ డిస్కషన్ లోకి దిగారు ఇద్దరు.
ఐ బి బ్యాంకు ఏ జి ఎం అడిగాడు మీ బ్రాంచ్ లో మా స్టాఫ్ వైఫ్ ఉండాలి అని.
పేరేమిటి అని అడిగాడు కృష్ణకుమార్.
విద్యావతి. నా దగ్గర వర్క్ చేసిన మూర్తి గారి భార్య. అతను సీనియర్ మేనేజర్ప్రమోషన్ మీద లాస్ట్ మంత్ కరీంనగర్ వెళ్ళాడు.
ఓహ్ ఎస్. విద్యావతి ఈ కన్సార్టియం ప్రాజెక్ట్ లోనే మానిటోరింగ్ సెక్షన్ లో ఉన్నారు అన్నాడు కృష్ణకుమార్.
ఆవిడ చాలా నైస్ లేడీ సర్. అతను చాలా ఇబ్బంది పెడతాడు ఆమెని. మూర్తి కి అన్నీ వ్యసనాలు ఉన్నాయి. మందు,లేడీస్ ఒకటేమిటి అంటూ చెప్పుకొచ్చాడు అవతలి బ్యాంకు ఏ జి ఎం. చాలా హింసిస్తాడు ఆమెని. పెళ్లయినప్పటినుంచి తిట్టడం, కొట్టడం, చాలా వరస్ట్ గా ప్రవర్తిస్తాడు తనతో . అతనికేమో తన జీతం డబ్బులు చాలవు. ఆవిడ శాలరీ లో కూడా సగం వాడేస్తాడు ప్రతి నెలా. ఆవిడకి నరకం చూపిస్తాడు. పిల్లల్ని కూడా హింసిస్తాడు. వాళ్ళ చదువులుకు కూడా విద్యావతి అక్క చాలా వరకు డబ్బులు ఇచ్చేది. రాత్రిపూట తప్పతాగి ఇంటిముందు అసహ్యంగా తిడుతూ నానా రభస చేస్తాడు. ఈ భాదలు భరించలేక సంవత్సరం క్రితం విద్యావతి అతనికి విడాకులు నోటీసు పంపింది. ఆ రోజు నాకాళ్ళు పట్టుకుని ఎలాగైనా భార్య చేత అవి వాపస్ తీసుకోమని చెప్పించాడు. ఆవిడకి ఎంతో నచ్చ చెపితే కానీ ఆ నోటీసు వాపసు తీసుకోలేదు. నాకే చాలా బాధ వేసింది. ఈ సారి ప్రమోషన్స్లో నేనే గట్టిగా ప్రయత్నించి ప్రమోషన్ ఇప్పించి కరీంనగర్ వేయించాను. కొంతవరకన్నా ఆమెకు ఊరట ఉంటుందని. మా బ్రాంచ్ లో కూడా అతను లేడీ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని మీద నాలుగు ఛార్జ్ షీట్ లు కూడా ఉన్నాయి బ్యాంక్లో . ఒక దశలో సస్పెండ్ కూడా చేయిద్దామని ట్రై చేసాను. ఆలా చేసేప్పుడు సిగ్గులేకుండా కాళ్ళు పట్టుకుంటాడు. క్షమించమంటాడు. ఇంకెప్పుడూ చెయ్యనంటాడు. కుక్క తోక వంకర అన్నట్లు మళ్ళీ కొద్దీ రోజులకు మామూలే. నాకు కూడా తలనొప్పి పుట్టి మెల్లగా ఇక్కడ నుంచి తప్పించాను అని పెద్ద స్టోరీ చెప్పాడు అతను.
ఆశ్చర్యపోయాడు కృష్ణకుమార్. అయ్యో ఇంత ఇబ్బంది ఉందా విద్యావతికి అనుకున్నాడు.
అతను లేచేందుకు ఉద్యుక్తుడయి మీరు కన్సార్టియం హెడ్ కాబట్టి మీరు అన్ని బ్యాంకుల తో ఒక మీటింగ్ ప్లాన్ చెయ్యండి సర్ అందరం కలిసి మోడాలిటీస్ డిసైడ్ చేద్దాం అని ఇక నేను వెళతాను అని కృష్ణ కుమార్ కి చెప్పి అతను వెళ్ళిపోయాడు.
క్లర్క్ రంగారావు వచ్చాడు. కేక్ తెప్పించాము సర్. అందరూ మీ కోసం వెయిటింగ్. మీరు వస్తే శాంతారాం గారి చేత కేక్ కట్ చేయిద్దాము అన్నాడు.
ఆ బ్రాంచ్ కి గ్రౌండ్ ఫ్లోర్ లో డిపాజిట్స్ , కాష్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మొదటి అంతస్థులో లోన్స్, మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి.
కస్టమర్స్ సౌకర్యం కోసం అని అలా పెట్టారు.
హాల్ లో అందరూ వెయిటింగ్. కృష్ణకుమార్ అందరినీ ఒకమారు విష్ చేసి పేరు పేరునా పలకరించాడు.
శాంతారాం గారిని ముందుకు రమ్మన్నాడు. శాంతారాం గురించి అందరూ సరదాగా మాట్లాడారు. తమ బ్రాంచ్ లో ఫస్ట్ టైం ఇలా అందరూ కలిసి బర్త్ డే సెలెబ్రేట్ చేస్తున్నాం సర్. ఈ క్రెడిట్ మీదే అన్నారు అందరూ.
కృష్ణకుమార్ కూడా శాంతారాం గురించి మాట్లాడాడు.
ఈ సెలెబ్రేషన్స్ ఇకనుంచి అందరి పుట్టిన రోజులకు చేద్దాం అని చెప్పాడు. అందరి చప్పట్ల మధ్య శాంతారాం కేక్ కట్ చేసాడు.
ఒక ముక్క తీసి కృష్ణ కుమార్ అతనికి తినిపించాడు.
ఇంకొక సంవత్సరంలో శాంతారాం రిటైర్ అవుతున్నాడు.





