జీవితం...!

(జీవితం అంటే ప్రతివారూ తెలుసుకోవాలి. కాబట్టి ఇది చదవండి అందరూ...)

 

ఒక వ్యక్తి చనిపోయాడు. ఇది అతడు తెలుసుకున్నపుడు దేవుడుచేత్తో ఒక సూట్ కేసు పట్టుకొని తన దగ్గరకు రావటం గమనించాడు. అది చూచిన వ్యక్తికి, దేవుడికి మధ్యజరిగిన సంభాషణే ఇది. ఇక చదవండి..

దేవుడు:—సరే నయ్యా ! ఇంక బయలుదేరి వెళ్ళే సమయం అయింది.

అతడు:— ఇంత త్వరగానా ? నాకు చాలా ప్లాన్లున్నాయి ఇప్పుడే అంటే ఎలా ?

దేవుడు:— క్షమించాలి. ఇప్పుడిక వెళ్ళాపోల్సిందే !

అతడు:— ఔనూ.. ఆసూట్ కేసులో ఏముంది?

దేవుడు:— నీ తాలూకు వస్తువులే! నీకు సంబంధించినవే !

అతడు:— నావా ? అంటే నావస్తువులా ?...బట్టలూ... డబ్బూ..వగైరానా ?

దేవుడు:— అవి నీవేవీ కావు. అవన్నీ యీభూమికి చెందినవి .

అతడు:— మరి నా జ్ఞాపకాలా ... ?

దేవుడు:— కాదు కాదు .అవి.. కాలానికి సంబంధించినవి కదా !

అతడు:— మరి నా టేలంటా ?

దేవుడు:—కాదులే ! అది పరిస్థితులకు సంబంధించింది కదా !

అతడు:—ఐతే.. మరి నా ఫ్రెండ్సూ .. ఫ్యామిలీ అయ్యుండొచ్చు. ఔనుకదా ?

దేవుడు :—కాదు బాబూ కాదు .అవన్నీ నీవు ప్రయాణించే మార్గానివీ..యాత్రలవీను..

అతడు:—మరైతే.. నా భార్యా పిల్లలూనా ?

దేవుడు :—కాదు నాయనా కాదు . అవి నీ హృదయానికి సంబంధించినవౌతాయి .

అతడు:—సరే !ఐతే..అది నా శరీరం కావొచ్చు ఔనా ?

దేవుడు:— అదీ కాదు. అది ధూళికి సంబంధించిందికదా ! అదెలా ఔతుంది ?

అతడు:— అదీ కాకుంటే... తప్పకుండా నా ఆత్మైవుంటుంది. ఔనా ?

దేవుడు:— ఓహో !నీవు చాలా బాగా అర్ధంచేసుకున్నావే ? అదేంకాదు. 

నీ ఆత్మ నాకు సంబంధధించింది. నీకు సంబంధించిది మాత్రం కాదని తెల్సుకో .అన్నాడు. సూట్ కేసునిచ్చి కావాలంటే తెరిచి చూసుకో మన్నాడు .అప్పుడా మనిషి కన్నీళ్ళు కారుస్తూ ఎంతో భయంతో పెట్టె తెరిచి చూస్తాడు. అంతే ఏముందందులో ? ఏమీ లేదు. ఖాళీగావుంది పెట్టె ! పగిలిన హృదయంతో కన్నీళ్ళు కారుస్తూ దేవుణ్ణి అడిగాడు ఏమిటీ ఘోరంఅని.

అతడు:—ఔను స్వామీ ! నా దనేది ఏమీ లేనేలేదా ? నే నేమీ సంపాదించనే లేదా ? అన్నాడు.

దేవుడు:—ఔనోయి ! నీవ్వేమీ సంపాదించలేదు. అన్నాడు.

అతడు :—మరి నాదేముంది ?

దేవుడు:—జీవించిన కొన్ని మధుర క్షణాలు మాత్రమే నీవి. నీవుబ్రతికిన ప్రతి క్షణమూ నీదే !  జీవిత మంటే జీవించిన కొన్ని మధుర క్షణాలు మాత్రమే ! ఆ క్షణాలను పరహితానికై ఉపయోగించటమే అసలైన జీవితం. దాన్ని ప్రేమించు !  దాన్ని కాంక్షించు ! దాన్ని జీవించు !

॥ "పరోపకారాయ ఫలంతి వృక్షః

పరోపకారాయ దుహంతి గావః

పరోపకారాయ వహంతి నద్యః

పరోపకారార్థ మిదం శరీరమ్ "॥

అనగా వృక్షాలు ఫలాలను , ఆవులుపాలను , నదులు జలాలను పరోపకారంగా యిస్తూ వుంటే మానవులు మాత్రం తమ శరీరాలను పరోపకారానికి యెందుకుపయో గించరాదు ? అని భావం ! కాబట్టి జీవించినంత కాలం యితరుల కుపయోగపడుతూ మంచిని సంపాదించి దేవుని దగ్గరవున్న ఆ పెట్టెలో దాచుకుందాం !

హితకర్త:- నల్లాన్ చక్రవర్తుల వేంకట రంగనాథ్


More Good Word Of The Day