సమ్మక  సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందు వేములవాడ రాజనన్ను ఎందుకు దర్శించుకుంటారో తెలుసా!


వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తారు భక్తులు. ఇలా ఎందుకు వెళ్తారో మీకు తెలుసా?

దక్షిణ కాశీగా ప్రముఖ శైవ క్షేత్రంగా ప్రసిద్ధిచెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే భక్తులు సమ్మక్క సారలమ్మ జాతరకు తరలి వెళ్తారు. అనంతరం వనదేవతల సేవల తరిస్తారు. గత కొన్నేళ్లుగా  ఆనవాయితీగా వస్తుంది.పూర్వకాలంలో శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రాన్ని దర్శించిన తర్వాతే గ్రామదేవతలను దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేసే విధానానికి చాలా విశేషం ఉంది. అదే ఆచార వ్యవహారంగా జరుగుతుంది. వన దేవతలైన సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లి అమ్మవారి సేవలో తరించే కంటే ముందే భక్తులు కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని సేవలో తరలించడం ఆనవాయితీగా వస్తుంది.

అమ్మవార్ల అనుగ్రహం పొంది సకల జనులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటారు. ఈసారి సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న నేపథ్యంలో తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లేందుకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న తరుణంలో ఆలయం అనునిత్యం భక్తులతో కిక్కిరిసిపోయి కనువిందు చేస్తుంది.


 


More Sammakka Sarakka