నవ గ్రహాలలో గురు గ్రహం అత్యంత పూజనీయం ఎందుకో తెలుసా!

నవగ్రహాలలో బృహస్పతి గ్రహం దేవస్థానాన్ని, గురువు స్థానాన్ని కలిగి ఉంటుంది. అందుకే బృహస్పతిని గురు గ్రహం అని కూడా పిలుస్తారు.  దేవతలకు కూడా గురువు బృహస్పతే.. సౌర వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన గ్రహం గురు గ్రహమే. గురువు ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం,  శ్రేయస్సు, జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే.. నవగ్రహాలలో  గురు గ్రహానికే ఇంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకు? గురు గ్రహానికి ఇంత ప్రాధాన్యత రావడం వెనుక పరమ శివుడి పాత్ర ఏముంది? పూర్తీగా తెలుసుకుంటే..

బృహస్పతి దేవ గురువు ఎలా అయ్యాడు?

శాస్త్రాలలో, గురు గ్రహాన్ని సురాచార్య, దేవాచార్య, వాచస్పతి వంటి ప్రసిద్ధ నామాలతో సంబోధించారు. పురాణాల ప్రకారం శివుని వరంగా, ఆయన దేవతలకు సంరక్షకుడిగా నియమించబడ్డాడు. గ్రహాలలో పూజనీయుడిగా పరిగణించబడ్డాడు. శాస్త్రీయ , జ్యోతిష్య పరంగా చూస్తే.. ఆయన ఆకాశ తత్వానికి అధిపతి. సూర్య సిద్ధాంతం ప్రకారం, సృష్టిలోని పంచభూతాలలో గురు గ్రహం ఆకాశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది విస్తరణకు , విశాలత్వానికి ప్రతీక.

శుభకార్యాలలో గురువు పాత్ర..

హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యాన్నైనా చేపట్టే ముందు ప్రతి ఒక్కరూ గురు గ్రహ స్థానాన్ని గమనించడం జరుగుతుంది. దేవతల గురువైన గురు గ్రహం బలంగా  ఉన్నప్పుడు వివాహం, తలనీలాలు సమర్పించడం, గృహప్రవేశం వంటి అన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే గురు గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు  సానుకూల శక్తి చాలా తక్కువగా ఉంటుందని భావించి శుభకార్యాలను నిలిపివేస్తారు.

బృహస్పతి రంగు, ప్రభావం..

ఆకాశంలో బృహస్పతి ప్రతిబింబం  రంగును గమనించడం ద్వారా భవిష్యత్తును అంచనా వేస్తారు. బృహస్పతి ప్రతిబింబం స్పష్టంగా, అందంగా , ప్రకాశవంతంగా కనిపిస్తే, అది భూలోకవాసులకు ఆనందాన్ని , శ్రేయస్సును సూచిస్తుందట. అయితే బృహస్పతి ప్రతిబింబం ఎరుపు, పసుపు, ముదురు రంగులో లేదా అగ్నిలా మసకగా కనిపిస్తే, అది  అశుభకరంగా పరిగణించబడుతుందట.

                          *రూపశ్రీ.


More Enduku-Emiti