అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా ఈ వస్తువులు కొనకూడదు!

హిందూ మతంలో అక్షయ తృతీయను అత్యంత పవిత్రమైన , పుణ్యమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే పనుల వల్ల కలిగే పుణ్యం సాధారణ రోజుల కంటే ఎక్కువ లభిస్తుందని చెబుతారు. అంతేకాకుండా, లక్ష్మీదేవి ఆశీర్వాదాలు కూడా అక్షయ తృతీయ రోజు లభిస్తాయని చెబుతారు.. శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ నాడు చేసే ఏ పుణ్యకార్యానికైనా ఫలాలు అనంతమైనవిగా ఉంటాయని చెబుతారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి, భూమి, వాహనాలు , ఇతర విలువైన వస్తువులను ఇంటికి తీసుకువస్తారు. ఈ కొనుగోళ్లు అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. అయితే అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా కొనకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి, ఒక వేళ అవి కొంటే ఇంట్లో ప్రతికూల శక్తిని పెరుగుతుందట. అక్షయ తృతీయ రోజున కొనకూడని వస్తువులు ఏంటో తెలుసుకుంటే..
నలుపు రంగు..
నలుపు రంగును శని గ్రహానికి , నెగిటివ్ ఎనర్జీకి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన సందర్భంలో నల్లని దుస్తులు లేదా ఇతర నల్లని వస్తువులను కొనడం అశుభంగా పరిగణించబడుతుంది.
అక్షయ తృతీయ నాడు ఇనుము, ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి సంతోషాన్ని, ఇంట్లో ఉండే సానుకూల శక్తి పైన ప్రభావం చూపుతుందట. అందుకే అక్షయ తృతీయ రోజు ఇనుము, ఉక్కు వంటి వస్తువులు కొనకూడదు.
నేటి కాలంలో ఇంట్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం చాలా ఎక్కువగా ఉంటోంది. అయితే అక్షయ తృతీయ నాడు ప్లాస్టిక్ వస్తువులు కొనడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఇంటి శ్రేయస్సును, సౌభాగ్యాన్ని ప్రభావితం చేస్తుందట.
అక్షయ తృతీయ నాడు కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను కొనడం అశుభంగా పరిగణించబడుతుంది. దీనివల్ల సంబంధాలలో మనస్పర్థలు, కలహాలు పెరగవచ్చు.
అక్షయ తృతీయ రోజున ముళ్ల మొక్కలను ఇంటిలోకి తీసుకురావడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది జీవితంలో అడ్డంకులను, ప్రతికూలతను తీసుకురాగలదని, శ్రేయస్సుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతారు.
*రూపశ్రీ.



