శని దేవుడికి నూనె సమర్పించే సరైన విధానం తెలుసా...
హిందూ పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దేవుడిని న్యాయ దేవుడిగా చెబుతారు. శనిదేవుడు ఒక వ్యక్తి చేసే తప్పులకు అయినా, మంచి పనులకు అయినా వాటికి తగిన కర్మలను ప్రసాదించేవాడు శనిదేవుడే. మనిషి చాలా చెడ్డ కర్మలు చేసి ఉంటే శని దేవుడి చూపు ఆ వ్యక్తిపై ఉంటుందని, జరిగే అనర్థాలు.. సడే సతి, శని దోషం, శని మహాదశ, అర్ధాష్టమ శని దశ వంవిటి అనుభవించాల్సి వస్తుందని అంటారు. మరోవైపు, ఒక వ్యక్తి మంచి పనులు చేస్తే అతనికి శని దేవుడి ఆశీస్సులు లభిస్తాయి. శని దేవుడికి సాధారణంగా శనివారం శ్రేష్టంగా చెప్పబడుతుంది. శనివారం సూర్యాస్తమయం తర్వాత శని దేవుడిని పూజించడం వల్ల ఆయన ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున శని దేవునికి ఆవాల నూనెను సమర్పించి, రావి చెట్టు కింద దీపం వెలిగించే సంప్రదాయం ఉంది. దీని గురించి తెలుసుకుంటే..
శని దేవుడిని పూజించేటప్పుడు నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో చేసే చిన్న తప్పు కూడా చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. శని దేవునికి ఇనుప పాత్ర నుండి మాత్రమే నూనెను సమర్పించాలని అంటారు.
శని దేవుడికి హనుమంతుడు ఈ నూనెను పూశాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. శనిదేవుడికి తైలాభిషేకం చేస్తారు. ఈ తైలాభిషేకం కోసం ఆవాలు లేదా నువ్వుల నూనెను మాత్రమే వాడాలి. నూనెను అర్పించేటప్పుడు దృష్టిని శని దేవుడి పాదాలపై మాత్రమే ఉంచాలి. ఎందుకంటే శని దేవుడి కళ్ళలోకి చూడకూడదు.
పూజ సమయంలో మనస్సులో ఎలాంటి సందేహం లేదా ప్రతికూల ఆలోచనలను ఉంచుకోకూడదు. అలాగే స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూనె సమర్పించేటప్పుడు "ఓం ప్రాం ప్రీం ప్రాం సః శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని జపించడం శుభప్రదంగా భావిస్తారు .
శనివారం నాడు శని దేవునికి ఆవాలు లేదా నల్ల నువ్వుల నూనె సమర్పించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. దీనితో పాటు సాడే సతి శని దోషం ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. శని దేవుడిని క్రమం తప్పకుండా పూజించే వ్యక్తికి విజయం, శ్రేయస్సు, శని దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయి.
*రూపశ్రీ.
