నగలు అంటే ఇష్టపడని ఆడవాళ్ళు ఉండరు. ఇది ఒకప్పటి మాట. కానీ నేటి కాలం యువతులు నగలు వేసుకోవడమే మానేస్తున్నారు. ఇపుడు సింపుల్ గా ఉండే సన్నని చైన్స్ వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. మార్కెట్లో రకరకాల బీడ్స్, స్టోన్స్, పూసలతో కూడిన కొత్త కొత్త డిజైన్ పెండెంట్లను ధరిస్తున్నారు. ఇవి కూడా ఎలాంటి దుస్తులపై నైనా కూడా అందంగా కనిపించడం వల్ల యువతులు వీటిపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కూడా 100 రూపాయల నుండి మొదలుకొని వేల రూపాయల ఖరీదు చేసే రకం మోడల్స్ లభిస్తున్నాయి.

 

 


More Fashion