చూడామణి-సూర్య గ్రహణము

 

🌗 ది.21-06-2020 శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతువు, జ్యేష్ఠ అమావాస్య, ఆదివారం మృగశిరా నక్షత్రం, మిధున రాశి యందు రాహుగ్రస్త చూడామణి నామ సూర్య గ్రహణం. 

స్పర్శకాలం ఉ. 10-21. ని లకు, 

మధ్యకాలం ప.12:03, 

మోక్షకాలం ప.1:49.ని లకు.

పూర్తిగా 3 గంటల 28 నిమిషములు....

🌗 సూర్యోదయ కాలం నుండి గ్రహణం పూర్తి అయ్యే వరకు భోజనాదులు నిషేదం. ప్రత్యాబ్ధికములకు గ్రహణానంతరమే కాలము చెప్పబడినది.

🌗 దేవాలయములు సూర్యోదయ కాలంలో ప్రాతఃకాల పూజచేసి మూసివేయవలెను. యితరులు గోత్ర ప్రవరలతో దేవాలయ పూజ ఈరోజు నిషేధము. గ్రహణానంతరం దేవాలయం సంప్రోక్షణం చేసి సూర్యాస్తమానంతరం భక్తులకు దర్శనార్థం తెరువవలెను.

🌗 మిథున రాశివారు శాంతి చేయించుకోవలెను. ప్రధానంగా మృగశిరా నక్షత్రము వారు. 

🌗 గ్రహణ సమయంలో ఇంటిలో అన్ని వస్తువుల మీద దర్భలువుంచడం మన భారతీయ సంస్కృతి. గ్రహణ ఆరంభంలో స్నానం చేసి అందరూ కూడా మీ యిష్ట దైవాన్ని స్మరిస్తూ గ్రహణకాలం అంతా కాలక్షేపం చేసి, గ్రహణానంతరం స్నానం చేసి గృహము, దేవతామందిరము శుద్ధి చేసుకోవలెను.


More Festivals