శ్రీ లక్ష్మీప్రవేశానికి స్వర్ణ సూత్రాలు ?
శ్రీ లక్ష్మీ అమ్మవారి కటాక్షం తప్పకుండా కావాలని కోరుకునేవారు సరళమైన ఉపాయాలను, మార్గాలను అనుసరించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. పూజా విధానాన్ని అనుసరించే ముందు, శరీర శుభ్రతను పాటించినట్టు, మానసిక పవిత్రతను కూడా ఆచరించాలి. ఎందుకంటే ....
"మంత్రతీర్థే ద్విజే దేవె దైవజ్ఞే ఖైషజెగురౌ |
యదృశే భావనా యస్య సిద్ధర్భవతి తాదృశీ ||
అంటే మంత్రం, తీర్థం, బ్రాహ్మణుడు, దేవత, జ్యోతిష్కుడు, ఔషధము మరియు గురువుల పవిత్రతను కూడా ఆచరించాలి. ఎందుకంటే ...
"మంత్రతీర్థే ద్విజే దేవె దైవజ్ఞే ఖైషజెగురౌ |
యదృశే భావనా యస్య సిద్ధర్భవతి తాదృశీ ||
అంటే మంత్రం, తీర్థం, బ్రాహ్మణుడు, దేవత, జ్యోతిష్కుడు, ఔషధము మరియు గురువుల యందు ఎలాంటి భావాన్ని మనం ఆపాదిస్తామో అలాంటి సిద్ధినే పొందుతాము "యద్భావత్ తద్భవతి'' అన్నమాట.
శ్రీకృష్ణభగవానుడు కూడా అలాంటి భావననే 'గీత'లో ప్రకటించి ఉన్నాడు.
"యే యధామా ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహమ్ ''
అంటే ఎవరు నన్ను ఏ విధంగా భజిస్తారో అలాంటి ఫలాన్నే నేను అందిస్తాను అని అర్థం.
సాధనకు ముందు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మనం ఇళ్లలో చాలా పనుల్లో కూర్చోటానికి పీటల్ని ఉపయోగిస్తాము. మీరు స్వయంగా కూర్చునే ఆసనం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. భూమికి కొద్దిగా ఎత్తుగా ఉండటానికి వీలుగా ఆసనం ఎందుకు తయారుచేసుకుంటారో మీకు తెలుసా? జపం చేసుకునే మీలోంచి ఊర్జా (శక్తి) జనిస్తుంది. మీ శరీరం భూమికి దగ్గరగా ఉండటం చేత ఆ ఊర్జా అర్థింగ్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శక్తి కక్షీయాన్ని ఆపటానికి ఆసనం ప్రయోగిస్తారు. పద్మాసనం వల్ల బొటనవ్రేలిని భూమిని తాకకుండా ఎత్తులో ఉంచుతారు. ఆసనం రంగు ఎలా వుండాలో నిర్ణయించుకోవడానికి ముందు ఆ సాధన ఎటువంటిదోనన్న దాన్ని బట్టి వుంటుంది.
లక్ష్మీ, ఐశ్వర్యం, ధనసంబంధ ప్రయోగాలైతే - పసుపు ఆసనాన్ని తయారు చేసుకోవాలి.
సాత్వికమైన సాధనాలకు, కుశాణువుతో తయారైన ఆసనం మంచిది.
ఎరుపు, పసుపురంగు దారాన్ని సిద్ధం చేసుకోవాలి.
లక్ష్మీ సంబంధమైన పూజా ప్రయోగానికి పసుపురంగు నూలు వస్త్రాలను ధరించాలి. పైన శాలువా కప్పుకోవాలి.
అక్షతలను సిద్ధం చేసుకోవాలి.
సాధన చేసేటప్పుడు ఎటువైపు ముఖం పెట్టాలన్న సందేహం కలుగుతుంది. ప్రత్యేకమైన దిశానిర్దేశం లభించని ఎడల మీరు పశ్చిమాభిముఖంగా కూర్చుని సాధన సాగించాలి.
సాధనను బట్టి కొన్ని చిహ్నాలను సూచిస్తారు. ఆ చిహ్నాలు షట్ కోణం, అప దశమని, స్వస్తిక్ అని ఉంటాయి. భౌతిక సమృద్ధిని సూచించే శ్రీయంత్రం, దక్షిణామూర్తి శంఖం, పాదరస శివలింగం, పాదరస లక్ష్మీ, పాదరస వినాయకుడు మొదలైన వాటిని స్థాపించి సాధన చేసేయోగం అందరికీ లేకపోవచ్చు. దిగులు పడకండి. దిగువ కొన్ని మార్గాలను పేదవారు అనుసరించి సాధనం చేసుకోవచ్చు.
దీపావళి రోజు అఖండమైన రావిచెట్టు ఆకును త్రుంచుకుని రావాలి. ఆ ఆకును తమ పూజాస్థానంలో గానీ, పవిత్రమైన పరిశుభ్రమైన చోటులో ఉండాలి. తరువాత వచ్చే శనివారం రోజున ఒక క్రొత్త రావి ఆకును త్రుంచుకుని రావాలి. పాత ఆకుని పెట్టిన చోటులో దీన్ని కూడా ఉంచాలి. ప్రతి శనివారం ఇలాగే చేస్తూ పోవాలి. గమనిస్తూ ఉండండి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. లక్ష్మీకటాక్షం కలిగాక సాధన ఆపుచేసుకోవచ్చు. అమావాస్య నుండి మొదలుపెట్టి ఎన్ని శనివారాలు చేసుకోవాలని సంకల్పం చేసుకుంటారో, ఆ విధంగా సాధన కొనసాగించండి. ప్రాతః కాలం లేవగానే ఎవరినీ చూడకండి. కళ్ళు మూసుకునే మీ అరచేతుల్ని కళ్ళదగ్గరికి తెచ్చుకుని చూడండి. ముఖం మీద రెండు అరచేతుల్ని త్రిప్పుకోండి. భోజనానికి తయారుచేసే మొదటి రొట్టె లేదా ఎవరూ ముట్టుకోని కొద్ది అన్నాన్ని ఆవుకు తినిపించండి. శనివారం రోజు గోధుమల్ని పిండి పట్టించే నియమం పెట్టుకోండి. ఆ పిండిలో పదవభాగం నల్ల శెనగలు కలపండి. (చిన్న సైజు శెనగలు) మీ ఇంట్లో చీమలు ఉంటాయి కదా వాటికి చెక్కర కలిపినా పిండిని వేసి తినిపించండి. మీ ఇంట్లో గోడలకు లేదా పూజాగృహంలో ఉన్న చిత్రాలకు కుంకుమ, చందనం, పుష్పాలు అలంకృతం చేయండి. ప్రాతః కాలం ఇల్లు శుభ్రం చేయకుండా టిఫిన్ తినకండి.
సంధ్యాసమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేయకండి. సంధ్యా సమయానికి పూర్వమే దీపాన్ని వెలిగించాలి. విద్యుత్ దీపాలుకాదు, ఇంటి సౌభాగ్యవతులు ప్రసన్నవదనంతో దేవీ-దేవతలకు ధూప, దీప, హారతి ఇవ్వండి. ఏ పని కోసమైనా ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు, ఇంటికి చీపురుతో శుభ్రం చేసుకోవాలి. పరగడుపున కార్యార్థం బయటికి వెళ్ళకూడదు. కనీసం ఒక చెంచాడు తీయని పెరుగుని నోటిలో వేసుకునైనా వెళ్ళండి. శుభం జరుగుతుంది. గురువారం రోజు ఏ మహిళనైనా ఇలిచి మంగళకరమైనది ఏదైనా ఒకటి దానం చేయండి. దీన్ని క్రమబద్ధం చేసుకోండి. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ధన సంబంధమైన కార్యాలన్నిటికీ సోమవారం, బుధవారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్ధిక పనులమీద బయటికి వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను, తాంత్రిక వస్తువులను, శ్రీగణేశుడిని దర్శనం తప్పకుండా చేసుకుని బయట కాలు పెట్టండి. పుష్పదానం చేసి, అందులోని ఓ పువ్వును జేబులో వేసుకుని వెళ్ళండి, లేదా తమ దగ్గర ఉంచుకోండి.
క్రొత్త కార్యం కోసం, వ్యవసాయం, ఉద్యోగం తదితర శుభకార్యాల కోసం వెళ్ళేముందు ఇంటిలోని ఓ మహిళ పిడికెడు మినుములను పిడికిటిలో బంధించి, అతనికి దిష్టి తీసి పంపితే అతని పనుల్లో విజయం చేకూరుతుంది. బయటికి వెళ్ళినవారు ఇంటికి ఒట్టి చేతులతో రాకండి. కనీసం చెట్టు ఆకునైనా కోసుకుని ఇంటిలోకి ప్రవేశించండి. నల్ల పసుపుకొమ్ము లక్ష్మీ ప్రతీకం. శుభముహూర్తాన దాన్ని ఇంటిలో పూజాగృహంలో క్యాష్ బ్యాగ్ లో ఉంచుకుంటే మంచిది. కొన్ని తాంత్రిక దుర్లభ వస్తువులు ఉన్నాయి. వాటిలో నక్కకొమ్ము, పిల్లనాళము, ఎకముఖీరుద్రాక్ష, దక్షిణామూర్తి శంఖం, హత్తాజోడీ, ఎకాక్షీ నారికేళం, శ్రీయంత్రం, కనకధారా యంత్రం అలాంటి వాటిలో శ్రీమహాలక్ష్మీని తమ వైపు ఆకర్షించే గుణమున్నది. వీటిని సంస్కరించాలి. అంటే ప్రాణప్రతిష్ట చేయాలి. మంత్రసిద్ధం చేయాలి. ఇవి సామాన్యమైన వస్తువులు కావు. తగిన మర్యాదలు చేయగలిగితే తగిన ఫలితం దక్కుతుంది. దీపావళి రాత్రికి లేదా గ్రహణ సమయంలో ఒక లవంగం, ఒక ఇలాయిచీ కాల్చి భస్మాన్ని దేవీ, దేవతల చిత్రపటాలకు, యంత్రాలకు వ్రాయండి. ఏదో ఒక సూర్యనక్షత్రపు వేళ - గబ్బిలాలు నివశించే చెట్టు దగ్గరకి వెళ్ళండి. ఆ చెట్టు కొమ్మను ఒకదాన్ని త్రెంచుకుని మీ దిండు క్రింద పెట్టుకోండి. ఆ తరువాత పరిణామాలను పరీక్షించండి. బ్యాంక్ లో డబ్బులు జమ చేసేటప్పుడు మనఃస్ఫూర్తిగా క్రింద ఇవ్వబడిన ఏదో ఒక మంత్రాన్ని జపించండి.
"ఓం మహాలక్ష్మైనమః''
"ఓం శ్రీంహ్రీం క్లీం, హ్రీం, శ్రీం మహాలక్ష్మైనమః''
చెక్ బుక్, పాస్ బుక్ డబ్బుసంబంధమైన కాగితాలున్న చోట శ్రీయంత్రాన్ని కానీ, కుబేరయంత్రాన్ని గానీ దగ్గరలో ఉంచండి. క్రింద యివ్వబడిన రామరక్షా స్తోత్రం, శ్రీక్ష్మీ కృప సమన్వితం. ఈ మంత్రం ధనప్రాప్తికి ఎంతో ఉపకరిస్తుంది అంటారు.
"అవదామ్ అపహర్తారమ్ దాతారమ్ సర్వసంపదామ్ |
లోకాభిరామమ్ శ్రీరామమ్ భూయో భూయోనమావ్యహమ్ ||
మహాలక్ష్మీకి తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పువైపు ఉండాలి. పశ్చిమంవైపు అయినా ఉండవచ్చు. ప్రతి శనివారం ఇంటికి శుభ్రపరచుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువుల్ని సర్ది చెక్కబరచుకోవాలి. మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలివైపు, శ్రీగణేశుడిని ఉంచండి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్టు ఉండాలి. దిశను గురించి పట్టించుకోన అవసరం లేదు. ఆయనకు ప్రాతఃకాలమే పచ్చిగడ్డి పరకాలను సమర్పించుకోండి. ప్రతినిత్యం మీరు మీ మనస్సులో 11 సార్లు, నేను తప్పకుండా ధనవంతుడిని అవ్వాలని దృఢసంకల్పాన్ని పునరావృత్తం చేసుకుంటూ ఉండండి. తధాస్తుదేవతలు మీపట్ల ఏదో ఒక రోజు కరుణించక పోరు.