శ్రీసాయిసచ్చరిత్రము


ఇరువయ్యవ అధ్యాయము

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 

 

కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగణు సమస్య పరిష్కరించుట
ఈ అధ్యాయముంలో దాసగణుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబు ఇంటిలోని పనిపిల్ల ఎలా పరిష్కరించిందో హేమాడ్ పంతు చెప్పారు.
మౌలికంగా సాయి నిరాకారుడు. భక్తులకోసం ఆ ఆకారాన్ని ధరించారు. ఈ మహాజగన్నాటకంలో మాయ నటి సాయంతో వారు నటుడి పాత్ర ధరించారు. సాయిని స్మరించి, ధ్యానించుదాము. శిరిడీకి వెళ్ళిపోయి అక్కడి మధ్యాహ్నహారతి తరువాత జరిగే కార్యక్రమాన్ని జాగ్రత్తగా గమనిద్దాము హారాయి అయిన తరువాత సాయి మసీదు బయటకు వచ్చి, గోడ ప్రక్కన నిలబడి ప్రేమతోను,దయతోను భక్తులకు ఊదీ ప్రసాదాన్ని పంచిపెడుతుండేవారు. భక్తులు కూడా సమానమైన ఉత్సాహంతో వారి సమక్షంలో నిలబడి వారి పాదాలకు నమస్కరించి, వారి వైపు చూస్తూ ఊదీ ప్రసాదపు జల్లులను అనుభవిస్తూ ఉండేవారు. బాబా భక్తుల చేతులలో పిడికిళ్ళకొద్దీ ఊదీ పోస్తూ, వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెడుతుండేవారు. వారి హృదయంలో భక్తుల పట్ల అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధంగా పలుకుతూ ఉండేవారు. "అన్నా, మధ్యాహ్న భోజనానికి వెళ్ళు, బాబా,నీ బసకి వెళ్ళు, బాపూ! భోజనము చెయ్యి'' ఈ విధంగా ప్రతిభాక్తుని పలుకరించి యింటికి సాగనంపుతూ ఉండేవారు. ఇప్పటికి అది అంతా ఊహించుకుంటే ఆ దృశ్యాలను తిరిగి చూసినంత ఆనందం కలుగుతుంది. మనోఫలకంపై సాయిని నిలిపి, వారిని ఆపాదమస్తకం ధ్యానిద్దాము. వారి పాదములపై పడి సగౌరవంగా ప్రేమతో వినయంగా సాష్టాంగనమస్కారం చేస్తూ ఈ అధ్యాయంలోని కథను చెపుతాను.
ఈశావాస్యోపనిషత్తు :

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 


ఒకప్పుడు దాసగణు ఈశావాస్యాపనిషత్తుపై మరాఠీభాషలో వ్యాఖ్య రాయడం మొదలుపెట్టారు. ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా చెపుతాను.
వేదసంహితలోని మంత్రాలు ఉండడంచేత దీన్ని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. ఇందులో యజుర్వేదంలోని 40వ అధ్యాయమైన వాజసనేయ సంహిత ఉండటంతో దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలు ఉండటంతో దీనిని తర ఉపనిషత్తులకన్నా శ్రేష్ఠమైనదని భావిస్తుంటారు. దీనికొక ఉదాహరణ. ఉపనిషత్తులు అన్నిటిలో పెద్దదైన బృహదారణ్య కోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్ పై వ్యాఖ్య అని పండితుడైన సాత్వలేకర్ గారు భావిస్తున్నారు.

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 


ప్రొఫెసరు రానడేగారు ఇలా అంటున్నారు : "ఈశావాస్యోపనిషత్తు అత్యంత చిన్నదైనప్పటికీ దాంట్లో అంతర్ దృష్టిని కలిగించే అనేక అంశాలు ఉన్నాయి. 18 శ్లోకాలలో ఆత్మ గురించి విలువైన, అపురూపమైన వర్ణన, అనేక ఆకర్షణలకు, దుఃఖాలను తట్టుకొనే స్థైర్యం గల ఆదర్శయోగీశ్వరుని వర్ణనలు ఇందులో ఉన్నాయి. తరువాతి కాలంలో సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతాల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు చివరికి జ్ఞానానికి కర్మలకు సమన్వయంగా ఉన్న సంగతులు చెప్పబడ్డాయి. జ్ఞానమార్గంలో కర్మయోగాన్ని సమన్వయంచేసి చెప్పడం ఈ ఉపనిషత్తులోని సారాంశం'' ఇంకొక చోట వారు ఇలా అన్నారు : "ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వం నీటి, నిగూఢతత్త్వం, వేదాంతాల మిశ్రమం''
పై వర్ణననుబట్టి ఈ ఉపనిషత్తును మరాఠీలోకి అనువాదం చేయటం ఎంత కష్టమో ఊహించవచ్చు. దాసగణు దీన్ని మరాఠీ ఓవీ ఛందంలో వ్రాసారు. దానిలోని సారాంశాన్ని గ్రహించలేక పోవటంతో తానూ వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు.అతడు కొందరు పండితులను అడిగారు. వారితో చర్చించారు. కాని వారు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. కాబట్టి దాసగణు కొంతవరకు వికల మనస్కుడయ్యాడు.
సద్గురువే బోధించుటకు యోగ్యత, సమర్థత గలవారు :

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 


ఈ ఉపనిషత్తు వేదాల యొక్క సారాంశం. ఇది ఆత్మా సాక్షాత్కారానికి సంబంధించిన శాస్త్రము. ఇది జననమరణాలు అనే బంధాలను తెగగొట్టే ఆయుధం, ఎల్దా కత్తి. ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఎవరయితే ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారో అలాంటివారే ఈ ఉపహ్నిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించాడు. ఎవరూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసగణు సాయిబాబా సలహా పొందాలని నిశ్చయించుకున్నారు. అవకాశం దొరగ్గానే షిరిడీకి వెళ్ళి, సాయిబాబాను దర్శించి, వారి పాదాలకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకోవడంలో తన కష్టాలు చెప్పి, సరియైన అర్థాన్ని బోధించమని వేడుకున్నారు. సాయిబాబా ఆశీర్వదించి ఇలా అన్నారు : "తొందర పడవద్దు. ఈ విషయంలో ఎలాంటి కష్టం లేదు. తిరుగు ప్రయానమో విలేపార్లేలోని కాకాసాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహం తీరుస్తుంది'' అప్పుడక్కడ వున్నవారు ఏ మాటలు విని, బాబా తమాషా చేస్తున్నారని అనుకున్నారు. భాషాజ్ఞానం లేని పనిపిల్ల ఈ విషయాన్ని ఎలా చెప్పగలదని అన్నారు. కాని దాసగణు అలా అనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులు అనుకున్నారు.
కాకాయొక్క పనిపిల్ల :

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 


బాబా మాటల్లో పూర్తి విశ్వాసం ఉంచి, దాసగణు షిరిడీ విడిచి విలేపార్లే చేరి, కాకాసాహెబు దీక్షితు ఇంట్లో బసచేశారు. ఆ మరుసటి రోజున ఉదయాన్న దాసగణు నిద్రనుంచి లేవగానే, ఒక బీదపిల్ల చక్కని పాటను అత్యంత మనోహరంగా పాడుతూ ఉంది. ఆ పాటలోని విషయం ఎర్రచీర వర్ణన, అది చాలా బాగున్నదనీ, దాని కుట్టుపని చక్కగా ఉన్నదనీ,దాని అంచుల చివరలు చాలా సుందరంగా ఉన్నాయనీ ఆమె పాడుతూ ఉంది. ఆ పాట నచ్చటంతో దాసగణు బయటకు వచ్చి విన్నారు. అది కాకా పనిమనిషి నామ్యా చెల్లెలు పాడుతూ ఉంది. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకొని పత్రాలు తోముతూ ఉంది. ఆమె పేదరికం, ఆమె సంతోష భావాన్ని చూసి,దాసగణు ఆమెపై జాలిపడ్డారు. ఆ మరుసటి రోజు రావుబహద్దూర్ యమ్.వి.ప్రధాన్ తనకి దోవరుల చాపు యివ్వగా, ఆ పెదపిల్లకు చిన్న చీరని ఇమ్మని చెప్పారు. రావుబహద్దూర్ ఒకమంచి చిన్న చీరని కొని ఆమెకు బహుకరించారు. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందుభోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలైంది. ఆ మరునాడు ఆమె ఆ కొత్త చీరను ధరించింది. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుతూ నాట్యం చేసింది. అందరికంటే తానే బాగా ఆది పాడింది. మరుసటి రోజు చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకొని పనిచేయడానికి వచ్చింది. కాని ఆమె ఆనందానికి లోటు లేకపోయింది.

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 

ఇదంతా చూసి దాసగణు జాలిభావం మెచ్చుకోలుగా మారింది. పిల్ల నిరుపేద కాబట్టి చింకిబట్టలు కట్టుకుంది. ఇప్పుడు ఆమెకి కొత్త చీర ఉంది. కాని దాన్ని పెట్టెలో దాచుకుంది. అయినప్పటికీ విచారమనేది గాని, నిరాశ అనేది గాని లేక ఆడుతూ పాడుతూ ఉంది. కాబట్టి కష్టసుఖాలనే భావాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని అతను గ్రహించాడు. ఈ విషయం గురించి దీర్ఘాలోచన చేసాడు. భగవంతుడు ఇచ్చిన దానితో మనం సంతోషించాలి.భగవంతుడు మనల్ని అన్ని దిశలనుండి కాపాడి మనకు కావలసింది ఇస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుడు ప్రసాదించినది అంతా మన మేలుకోసమే అని గ్రహించాడు. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికం, ఆమె చినిగినచీర, క్రొత్తచీర, దాన్ని ఇచ్చిన దాత, దాన్ని పుచ్చుకున్న గ్రహీత, దానభావం ఇవి అన్నీ భగవంతుని అంశలే. భగవంతుడు ఈ అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ దాసగణు ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృప్తి చెందటం, ఏది మనకు సంభవిస్తూ వుందో అది అంతా భగవంతుని ఆజ్ఞచే జరుగుతున్నదని, చివరికది మన మేలుకోసమే అని గ్రహించాడు.
విశిష్టమైన బోధన విధానము :

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 


పై కథను బట్టి బాబా మార్గం అత్యంత విశిష్టమైనదనీ, అపూర్వమైనదనీ పాఠకులు గ్రహించే ఉంటారు. బాబా షిరిడీని వదలనప్పటికీ, కొందరిని మచ్చీంద్రగడ్ కి, కొందరికి కొల్హాపూర్ కి గాని, షోలాపూర్ కి గాని సాధన నిమిత్తం పంపుతూ ఉండేవారు. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రిగాని, పగలుగాని, కనిపించి కోరికలు నెరవేరుస్తూ ఉండేవారు. భక్తులు బాబా బోధించే మార్గాలు వర్ణించలేనటువంటివి. ఈ ప్రస్తుత విషయంలో దాసగణును విలేపార్లే పంపి, పనిపిల్లద్వారా అతని సమస్యను పరిష్కరించారు. కాని విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చు. కానీ బాబా అవలంభించిందే సరైన మార్గం. కాకపొతే పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుడి సంకల్ప రూపాలే అని దాసగణు ఎలా నేర్చుకుని ఉండేవాడు?
ఈశావాస్యోపనిషత్తులోని నీతి :

 

 

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

 


ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్యవిషయం అది బోధించే నీతిమార్గమే. ఈ ఉపనిషత్తులో వున్నా నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయాలపై ఆధారపడి ఉంది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యాలే భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతున్నాయి. దేన్నీ బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే మానవుడు భగవంతుడు యిచ్చిన దానితో సంతృప్తి చెందాలని. ఎలాగంటే భగవంతుడు అన్నింటిలోనూ ఉన్నాడు.కాబట్టి భగవంతుడు ఏది యిస్తాడో అది అంతా తన మేలుకోసమే అని గ్రహించాలి. దీన్ని బట్టి యితరుల సొత్తు కోసం ఆశించరాదనీ, ఉన్నదాంతో సంతృప్తి చెందాలనీ, భగవంతుడు మన మేలుకోసమే దాన్ని యిచ్చాడనీ కాబట్టి అది మనకు మేలు కలుగచేసేదని గ్రహించాలి. దీనిలోని ఇంకొక నీతి ఏమిటంటే మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేస్తూనే ఉండాలి.శాస్త్రాలలో చెప్పిన కర్మలు నెరవేర్చాలి. భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చడం మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండటం ఆత్మా నాశనానికి కారణం. మానవుడు శాస్త్రాలలో విధింపబడిన కర్మలు నెరవేర్చటంతో నైష్కర్మ్యాదర్శం పొందుతాడు. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూస్తాడో, ఆత్మ అన్నింటిలో ఉన్నట్లు చూస్తాడో, వెయ్యేల సమస్త జీవరాశీ, సకలవస్తువులు ఆత్మగా భావిస్తాడో, అలాంటివాడు ఎందుకు మొహాన్ని పొందుతాడు? వాడెందుకు కోసం విచారిస్తాడు? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటంతో మనము మొహం, అసహ్యం, విచారం కలుగుతున్నాయి. ఎవరైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావిస్తాడో, ఎవరికయితే సమస్తం ఆత్మా అవుతుందో, అతడు మానవులు పడే సామాన్య బాధలకు, దుఃఖవికారాలకు లోను కాడు.

 

ఇరవయ్యవ అధ్యాయం సమాప్తం 


More Saibaba