శ్రీసాయిసచ్చరిత్రము

పదమూడవ అధ్యాయము

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

మరికొన్ని సాయిలీలలు : జబ్బులు నయమవటం : 1 భీమాజీ పాటీలు 2 బాలాషింపి 3 బాపుసాహెబు 4 అళందిస్వామి 5 కాకా మహాజని 6 హర్థానివాసి దత్తోపంతు
మాయ యొక్క అనంత శక్తి
బాబా మాటలు క్లుప్తంగాను, భావగర్భితంగాను, అర్థపూర్వకంగాను, శక్తివంతంగాను, సమతూకంతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా, నిశ్చింతగా ఉండేవారు. బాబా యిలా అన్నారు "నేను ఫకీరును అయినప్పటికీ, ఇల్లూవాకిలీ, భార్యాబిడ్డలు, తదితర బాదరబందీ లేవీ లేకుండా, ఎక్కడికీ కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ, తప్పించుకోలేని మాయ నన్నూ బాధిస్తున్నది. నేను నన్ను మరిచినా ఆమెను మరవలేక పోతున్నాను. ఎప్పుడూ ఆమె నన్ను ఆవరించు ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాడులనే చిరాకు పరుస్తుండగా, నావంటి దుర్భలుడయిన ఫకీరంటే ఎంత? హరి ప్రసంన్నుడు అయినప్పుడే ఆ మాయ నుండి తప్పించుకోవటం సాధ్యం. నిరంతర హరిభజనే దానికి మార్గం'' మాయాశక్తిని గురించి బాబా ఆ విధంగా పలికారు.

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని ఉద్దవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలుకోసం బాబా యింకా ఏమి చెప్పారో వినండి : "ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించాయో, వారే నన్ను భజన చేసేదనిలో తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ 'సాయి సాయి' అని స్మరిస్తూ ఉంటే సప్తసముద్రాలు దాటిస్తాను. ఈ మాటలను విశ్వసించండి. తప్పక మేలు పొందుతావు. పూజా తంతులో నాకు పనిలేదు. షోడశోపచారాలు గాని అష్టాంగ యోగాలు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్నచోటే నా నివాసము'' ఇక, తమకు పూర్తిగా శరణాగతులైనవారి క్షేమము కోసం బాబా ఏమి చేశారో వినండి.

భీమాజీ పాటీలు :

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

పూనా జిల్లా, జున్నరు తాలూకా, నారాయణగాంవ్ వాస్తవ్యుడు భీమాపాటీలు. 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల అనారోగ్యానికి గురయ్యారు. చివరికి అది క్షయవ్యాదిగా పరిణమించింది. అన్నిరకాల ఔషధాలు వాడారు కానీ ప్రయోజనము లేకపోయింది. ఇక ఆశలన్నీ వదులుకొని "ఓ భగవంతుడా! ఇక నీవే నాకిక దిక్కు! నన్ను కాపాడు!'' అని ప్రార్థించారు. మన పరిస్థితులు బాగున్నంతవరకు మనం భగవంతున్ని తలచుకోము అనే సంగతి అందరికీ తెలిసిందే. కష్టాలు మనల్ని ఆవరించినప్పుడు భగవంతున్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటాను. అలాగే భీమాజీ కూడా భగవంతుణ్ణి స్మరించారు. ఆ తరువాత, తన అనారోగ్యం విషయమై బాబా భక్తుడైన నానాసాహెబు చాందోర్కరుతో సలహా సలహా తీసుకోవాలనే ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరాలన్నీ తెలుపుతూ ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగారు. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకోవటం ఒక్కటే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబు చాందోర్కరు జవాబు వ్రాశారు.

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

అతడు నానాసాహెబు సలహాపై ఆధారపడి షిరిడీకి వెళ్ళటానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చోబెట్టారు. నానాసాహెబు, శ్యామా కూడా అక్కడే ఉన్నారు. ఆ జబ్బు వాని గతజన్మలోని పాపకర్మల ఫలితమనీ, అతని విషయంలో తాను జోక్యము చేసుకో దలచుకోలేదని బాబా చెప్పారు. కాని రోగి తనకు వేరే దిక్కులేదనీ అందుకే చివరికి వారి పాదాలను ఆశ్రయించానని మొరపెట్టుకుని వారి కటాక్షం కోసం వేడుకున్నారు. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగింది. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు : "ఊరుకో! నీ ఆత్రుత పారద్రోలు; నీ కష్టాలన్నీ గట్తెక్కాయి. ఎంతటి పీడా, బాధలున్న వారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారి తీస్తాయి. ఇక్కడ ఫకీరు మిక్కిలి దయార్థ్రహృదయుడు. వారీ రోగాన్ని తప్పకుండా బాగు చేస్తారు. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోను, దయతోను కాపాడుతారు''

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

ప్రతి అయిదు నిమిషాలకు రక్తము కక్కుతున్న ఆ రోగి బాబా సమక్షంలో ఒక్కసారి కూడా రక్తము క్రక్కలేదు! బాబా వాణ్ని దయతో కాపాడుతానని అభయం యిచ్చిన వెంటనే నయమవటం ప్రారంభించింది. వాణ్ని భీమాబాయి ఇంటిలో అంత సదుపాయమైనదికాని, ఆరోగ్యకరమైనదికాని కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండేటప్పుడు బాబా అతనికి రెండు స్వప్న అనుభవాలను యిచ్చి, వారి రోగాన్ని కుదిర్చారు. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యాలు కంఠోపాయం చేయకపోవడంతో క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించారు. రెండవ స్వప్నంలో వారి ఛాతీపై పెద్ద బండను వేసి క్రిందకు మీదికి తోయటంతో అత్యంత బాధను అనుభవించారు. స్వప్నంలో పడిన ఈ బాధలతో వారి జబ్బు నయమై వారు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తరువాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చి వెళ్ళేవారు. బాబా తనకు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకొని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారాలు చేస్తుండేవారు. బాబా తన భక్తుల వద్దనుంచి ఏమీ కాంక్షించే వారు కాదు. వారికి కావలసింది ఏమిటంటే భక్తులు తాము పొందిన మేలును జ్ఞాపకం వుంచుకొని, అచంచలమైన నమ్మకాన్ని, భక్తినీ కలిగి ఉండటమే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కాని, పక్షానికి ఒకసారి కాని ఇళ్ళల్లో సత్యనారాయణ వ్రతం చేయటం సాంప్రదాయం. కానీ భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతానికి బదులుగా సాయి సత్యవ్రతాన్ని తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించారు.

బాలాగణపతి షింపీ :

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

బాలాగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతను మలేరియా జబ్బుతో బాధపడసాగాడు. అన్ని రకాల ఔషధాలు, కాషాయాలు తీసుకున్నారు. కాని నిష్ప్రయోజనం అయ్యాయి. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తాడు. బాబా పాదాలపై పడ్డాడు. బాబా వాడికి లక్ష్మీ మందిరం ముందున్న నల్లకుక్కకి పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పారు. ఈ వింత రోగ నివారణోపాయాన్ని ఎలా నెరవేర్చాలో బాలాకు తెలియకపోయింది. ఇంటికి వెళ్ళగా అక్కడ అన్నం, పెరుగు సిద్ధంగా ఉండటం చూశాడు. రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ ఒక నల్లని కుక్క తోక ఆడించుకుంటూ కనిపించింది. పెరుగన్నము కుక్క ముందర పెట్టాడు. కుక్క దాన్ని తినేసింది. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయింది.

బాపుసాహెబు బూటీ :

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

ఒకానొకప్పుడు బాపుసాహెబు బూటీ జిగట విరేచనాలతోనూ, వమనములతోనూ బాధపడుతూ ఉండేవాడు. అతని అలమార నిండా మంచి మంచి మందులు ఉండేవి. కానీ అవి ఏవీ గుణమివ్వలేదు. విరేచనాల వల్లను, వమనములతోనూ బాపుసాహెబు నీరసించిపోయాడు. అందుకే బాబా దర్శనం కోసం మసీదుకు కూడా వెళ్ళలేకపోయాడు. బాబా అతన్ని మసీదుకు రమ్మని కబురు పంపి, అతను రాగానే తమ ముందు కూర్చందబెట్టుకుని, తమ చూపుడు వ్రేలు ఆడిస్తూ "జాగ్రత్త! నీవిక విరేచనము చేయకూడదు! వమనము కూడా ఆగిపోవాలి!'' అన్నారు. బాబా మాటల సత్తువను గమనించండి. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాయి. బూటీ జబ్బు కుదిరింది.

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకింది. తీవ్రమైన దాహంతో బాధపడుతుండ్వాడు. డాక్టరు పిళ్ళై అనే వైద్యుడు అన్ని ఔషధాలను ప్రయత్నించారు. కాని రోగము కుదరలేదు. బాపుసాహెబు అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకుంటే తన దాహం తీరిపోయి, జబ్బు కుదురుతుందని సలహా అడిగారు. బాదంపప్పు, పిస్తా, అక్రోటు నానపెట్టి, పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకుంటే రోగం కుదురుతుందని బాబా చెప్పారు. ఇది జబ్బుని మరింత పెంచుతుందని, ఏ డాక్టరు అయినా చెప్తారు. కాని బాపుసాహెబు బాబా ఆజ్ఞని శిరసావహించారు. పాలతో తయారుచేసిన దాన్ని సేవించారు. విచిత్రంగా రోగము వెంటనే కుదిరిపోయింది.

అళంది స్వామి :

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనం కోసం షిరిడీకి వచ్చారు. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టలేదు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండేది. ఏమీ చేయడానికి తోచలేకుండా ఉండేది. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా దర్శనం కోసం వచ్చారు. అతని చెవిపోటు తగ్గటానికి ఏదైనా చేయమని షామా ఆ సన్యాసి తరపున బాబాను వేడుకున్నారు. బాబా అతన్ని ఇలా ఆశీర్వదించారు. "అల్లా అచ్చా కరేగా'' (భగవంతుడు నీకు మేలు చేస్తాడు). ఆ సన్యాసి పూనా చేరి, ఒక వారంరోజుల తరువాత షిరిడీకి ఉత్తరం వ్రాశారు. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిపోయిందని, కాని ఇంకా వాపు తగ్గలేదనీ వ్రాశారు. వాపు పోగొట్టుకోవడానికి శాస్త్ర చికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్ళారు. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరంలేదని చెప్పారు. బాబా వాక్కుకు ఉన్న శక్తి అంత అద్భుతమైంది.

కాకామహాజని :

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

కకామహాజని అనే ఇంకొక భక్తుడు ఉన్నాడు. అతను నీళ్ళ విరేచనాలతో బాధపడుతున్నాడు. బాబా సేవకి ఆటకం లేకుండా ఉండేలా ఒక చెంబు నిండా నీళ్ళు పోసుకుని, దాన్ని మసీదులో ఒక మూల పెట్టుకున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా వెళ్తున్నాడు. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పవలసిన అవసరంలేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూరుస్తారని కాకా నమ్మారు. మసీదు ముందు రాళ్ళు తాపన చేయటం కోసం బాబా సమ్మతించారు. కాబట్టి పని ప్రారంభమైంది. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరిచారు. అందరూ పరుగెత్తి పారిపోయారు. కాకా కూడా పరుగెత్తడం మొదలుపెట్టాడు. కాని బాబా అతన్ని పట్టుకుని అక్కడ కూర్చుండ బెట్టారు. ఈ సందడిలో ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచీని అక్కడ విడిచి పారిపోయారు. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి, చేతులతో నలిపి పొట్టును వూదేసి, శుభ్రమైన పప్పును కాకాకి ఇచ్చి తినమన్నారు. తిట్టడం శుభ్రపరచడం తినటం ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. బాబా కూడా కొంత పప్పుని తిన్నారు. సంచి ఖాళీ కాగానే నీళ్ళు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించారు. కాకా కుండతో నీళ్ళు తీసుకువచ్చాడు. బాబా కొన్ని నీళ్ళు త్రాగి, కాకాను కూడా త్రాగమన్నారు. అప్పుడు బాబా యిలా అన్నారు : "నీ నీళ్ళ విరేచనాలు ఆగిపోయాయి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేసే పనిని చూసుకోవచ్చు''. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరుకున్నారు. పని ప్రారంభింప బడింది. విరేచనాలు ఆగిపోవటంతో కాకా కూడా వారితో కలిశారు. నీళ్ళ విరేచనాలకు వేరుశెనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారం వేరుశెనగ పప్పు విరేచనాలను పెంచుతుంది కానీ తగ్గించలేదు. ఇందులో నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కే.

హార్థా నివాసి దత్తోపంతు :

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

దత్తోపంతు హార్థాగ్రామ నివాసి. అతడు కడుపునొప్పితో 14 సంవత్సరాలు బాధపడ్డాడు. ఏ ఔషధమూ వాడికి గుణం యివ్వలేదు. అతడు బాబా కీర్తి విన్నారు. వారు జబ్బులను దృష్టితోనే బాగు చేస్తారని తెలుసుకుని షిరిడీకి వెళ్ళి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించారు. బాబా అతని తలపై తన హస్తాన్ని వుంచి, ఊదీ ప్రసాదం యిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణం ఇచ్చింది. ఆ జబ్బువలన తిరిగి అతడు ఎప్పుడూ బాధపడలేదు.

ఇంకొక మూడు వ్యాధులు :

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

(1) మాధవరావు దేశపాండే మూలవ్యాధితో బాధపడ్డాడు. సోనాముఖి కషాయాన్ని బాబా వారికి యిచ్చారు. ఇది వారికి గుణం ఇచ్చింది. రెండు సంవత్సరాల తరువాత జబ్బు తిరగదోడింది. మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకున్నారు. కానీ వ్యాధి అధికం అయ్యింది. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయింది.

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

(2) కాకామహాజని అన్నగారైన గంగాధరపంతు అనేక సంవత్సరాలు కడుపునొప్పితో బాధపడ్డాడు. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాడు. కడుపునొప్పి బాగుచేయమని బాబాను వేడుకున్నాడు. బాబా వారి కడుపును తమ హస్తంతో స్పృశించి, భగవంతుడే బాగు చేయగలడని అన్నారు. అప్పటినుండి అతనికి కడుపునొప్పి తగ్గి, వ్యాధి పూర్తిగా నయమయింది.

Information about Shirdi Sai Baba Life History. Sri Shirdi Sai Baba is one of the greatest saints ever born in India and has millions of devotees all over the World.

(3) ఒకప్పుడు నానాసాహెబు చాందోర్కరు కడుపునొప్పితో బాగా బాధపడ్డాడు. ఒకరోజు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యారు. డాక్టర్లు మందులు ఇంజక్షన్లు యిచ్చారు, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతను బాబా దగ్గరికి వచ్చాడు. బాబా ఆశీర్వదించారు. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలిగిపోయింది.
ఈ కథలన్నీ నిరూపించేది ఏమిటంటే, అన్ని వ్యాధులు నయమవడానికి అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదాలు మాత్రమే కానీ ఔషధాలు కావు.

పదమూడవ అధ్యాయము సంపూర్ణం

More Saibaba