మేష రాశి - (2018-2019)
మేషరాశి - అశ్విని 1,2,3,4 (చూ,చే,చో,లా)
భరణి 1,2,3,4 (లీ,లూ,లే,లో)- కృత్తిక 1వ పాదము (అ)
ఆదాయము 2 వ్యయం 14 రాజపూజ్యం 5 అవమానం 7
ఈ రాశి వారికి గురువు వత్సరాది 11-10-2018 వరకు 7వ స్థానంలో తదుపరి 29-03-2019 వరకు 8వ స్థానంలో తదుపరి వత్సరాంతం 9వ స్థానంలో ఉండును. శని సంవత్సరం అంతా 9వ స్థానంలో ఉండును. రాహు, కేతువులు 4,10 స్థానాల్లో 7-03-2019 వరకు ఉండును. తదుపరి వత్సరాంతం 3,9 రాశులలో ఉండును.
మీ ఆత్మ స్థైర్యము మీకు శ్రీరారక్షయని తెలుసుకొనండి. మీలో ఉన్న సృజనాత్మకత సమయోచిత నిర్ణయాలు అనేక నిర్ణయాలలో మీకు సహాయపడవచ్చు పంచమ బృహస్పతిచే ఇష్టకామ్యార్థ సిద్ధి ఏర్పడుతుంది. ఇష్ట దేవతా అనుగ్రహము, కుల విద్యపై ఆసక్తి పెరగుతుంది. విద్యావిషయంలో అనేక క్రొత్త నిర్ణయాలకు శ్రీకారము. ధనప్రాప్తి అనూహ్య ధనాగమము సూచన కనిపించుచున్నది. కార్యానుకూలత బంధువర్గములో మీ పేరు ప్రతిష్ఠ పెరుగవచ్చును. శారీరక సౌఖ్యము కలుగవచ్చును. మీయొక్క స్థాయి కూడా పెరుగవచ్చును. మీరు పనిచేయు సంస్థలో కొంత మందిపైన అధిపత్యము వహిస్తారు. అవివాహితులకు వివాహప్రాప్తి, సంతానప్రాప్తి. వస్త్ర భూషణప్రాప్తి, సమాజములో గౌరవము పెరుగుతుంది. ఉద్యోగములో ప్రమోషన్లు లభించవచ్చును. వ్యాపారములో నూతన మార్గాన్వేషణ, అందులో సఫలమవుతారు. గతంలో ఇచ్చిన ధనం తిరిగి చేతికి అందుతుంది. కాని అంచెలంచెలుగా అందవచ్చును. నూతన గృహ నిర్మాణానికై బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయము లభించగలదు. సమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారి పరిచయాలు కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. సజ్జనసాంగత్యం మీరు చేసిన పనికి తగిన సత్కారము, పురస్కారము లభించ వచ్చును. మీ యొక్క వ్యక్తిగత గౌరవమునకై చేయ ప్రయత్నాలు ఫలిస్తాయి.
అయితే ప్రతి విషయములోను మితి మీరిన ఆత్మవిశ్వాసము మాత్రము పనికిరాదు. ఎదుటివారు ఎంత తక్కువస్థాయిలో ఉన్న మీరు ఏమాత్రం వారిని తక్కువ అంచనా వేయకండి. బృహస్పతి బలము సంవత్సర మధ్య కాలమునుండి అనుకూలముగా ఉన్ననూ, ప్రతి ప్రయత్నమునకు ఏ మాత్రము జాడ్యము చూపించక పట్టుదల అవసరము. ప్రతి విషయమున ఎక్కువగా కృషి చేయాలి. ఉద్యోగస్థులకు తీవ్రమైన పని ఒత్తిడి ఏర్పడవచ్చును. అదే విధంగా బాధ్యతలు కూడా పెరుగుతాయి. అనవసర, అప్రస్తుత మధ్యవర్తిత్వము చేసి మీకై మీరు అరిష్టాలకు స్వాగతం పలకకండి. కోర్టు వివాదములు కొంత బాధించగలవు.
విదేశీ ప్రయత్నాలు 2వ ప్రయత్నంగా ఫలించగలవు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కూడా కొంత ప్రయత్ననంతరము కలుగగలదు. పశ్చిమ దిక్కుకు ప్రయాణములు చేయవలసిన అవసరాలు. ఋణబాధల నుండి ఒక అమృతహస్తం వల్ల బయటపడతారు. రోగ నివృత్త కలుగుతుంది. మేనమామ గారి ఆరోగ్యము విషయంలో జాగ్రత్తలు అవసరం ఇతర సంప్రదాయస్థులతో స్నేహాలు, సంతానము యొక్క ఆరోగ్య విషయమై ధనం ఖర్చు చేయ వలసిన స్థితి, స్త్రీలు ముఖ్యముగా గర్భవతులు తమ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ పనికిరాదు. కొన్ని పరిస్థితులలో అర్థంకాని మానసిక స్థితి ఎదురుకుంటారు. ముఖ్యముగా వివాహ నిశ్చయ విషయంలో (వధూవరులు) నిర్ణయం తీసుకోవడం సమస్యగా మారుతుంది. స్త్రీ మూలక భయము, గర్భధారణ మేరకు వైద్యుణ్ణి సంప్రదించడం ఔషధసేవనము, నేత్రబాధ ఎదురుకావచ్చును. సరియైన వైద్యుడిని సంప్రదించుట ఉత్తమము. అశ్రద్ధ పనికిరాదు. అగ్ని, విద్యుత్తుతో జాగ్రత్తగా ఉండాలి. మాటలు వాడిగా, వేడిగా రాకుండా జాగ్రత్త పడండి. వైరాగ్యభావాలు రావచ్చును. వత్సరాంతములో విదేశీ ప్రయత్నాలు లాభించవచ్చును. సఫలము కావచ్చును. పురాతన సంప్రదాయ విషయాలు, పురాణాలు ఇతిహాసాలపై ఆసక్తి, పుస్తక పఠనము, షేర్‌మార్కెట్‌లో కొంత సత్ఫలితము. వ్యవసాయ క్షేత్ర లాభము, ఉద్యోగములో స్థాయి పెరుగుట ఫలితము ఈ సంవత్సరము కపడుతుంది. విద్యార్థులకు పూర్వార్థము కన్నా ఉత్తరార్థము బాగుంటుంది. పోటీ పరీక్షలలో సత్ఫలితాలు సాధిస్తారు. ఈ సం||ము ఈ రాశివారలు ఒకనెల అయినా గోసేవకు సహాయము చేయండి. ఒక వృక్షాన్ని పెంచండి. వృద్ధులకు, అంధులకు పేద విద్యార్థులకు వికలాంగులకు వీలయినంత సహాయము చేస్తూ సదాచారము సజ్జన సాంగత్యము శాస్త్రహితమైన పరిహారాలు చేస్తూ నిత్యం ప్రత్యేక శనిస్తోత్రం రామ, కుజ, గురు, రవి, ధ్యాన శ్లోకాలను పఠించండి. హనుమాన్ చాలీసా మరువవద్దు.
జన్మ స్థలాన్ని విడచి దూరప్రాంతములలో నివసించే అవకాశము. నూతన కార్యములు ఆరంభించే ముందు శ్రేయోభిలాషుల సలహామేరకు నడుచుకునుట మంచిది. ఎలక్ట్రానిక్ మొదలైన సాంకేతిక రంగములో ఉన్న వారికి తమ ప్రతిభకు తగిన వ్రతఫలం లభించును. ఉపాధ్యాయ వృత్తి ప్రభుత్వ రంగములో ఉద్యోగము చేయువారికి అనుకూలము. చాలాకాలంగా మీకు రావలసిన బకాయిలు లేదా స్థాయి పెరిగే ఉత్తర్వుల అందుకుంటారు. సంతానము యొక్క ఆరోగ్య విషయంలో ఒకింత జాగ్రత్త అవసరం. ఒక సమయంలో వైద్యుణ్ణి సంప్రదించుట, ఔషధ సేవనం తప్పకపోవచ్చును. ఒకానొక సందర్భంలో విద్యావిఘ్నము కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. అయిననూ తమ సమయస్పూర్తి అచంచల దీక్ష. ఒక శ్రేయోభిలాషి సహకారము సలహాచేత ముందడుగు వేస్తారు. వాహనాలు నడుపునపుడు ఒకింత జాగ్రత్త అవసరం. సంవత్సర ఉత్తరార్థంలో అనూహ్యంగా ధనము చేతికందుతుంది. వివాహప్రాప్తి కోరిన వారితో వివాహము. గతంలో ఉన్న వివాహపరమైన వివాదాలు తీరుతాయి. తమ లక్ష్యాలను చేరుకుంటారు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనము లభిస్తుంది. బంధు వర్గమువారి సహాయ సహకారాలు అందుకుంటారు. తమ సోదరుల విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విద్యా విషయమై తమ ప్రయత్నాలు సఫలమవుతాయి. ముద్రణ, ప్రమాణాలు మొదలైన వాటిలో లాభాలు చూస్తారు.ధైర్యము పెరుగుతుంది. సంప్రదాయేతర స్నేహాలు, స్త్రీ పురుషుల విషయంలో తమ ధర్మాన్ని కాదని ఇతర ధర్మాలు స్నేహాలు చేస్తారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు అశ్రద్ధ చేయడం చెల్లించండి. వృత్తిలో కొంత అసంతృప్తి కేతువు స్థితి వల్ల ఏర్పడును. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అదాయ సూచనలు కలవు. తమ కులము లేదా మతము వారితో వివాదాలు అకారణ ఆవేశాలకు లోనుకాండి. అహంభావి అనే ముద్రపడే అవకాశం గలదు. విషజంతు ప్రమాదము, విదేశాలలో ఉన్నవారు అచట చట్టపరమైన వివాదాలు ఎదుర్కొనుట సంభవించవచ్చు. తండ్రిగారి ఆరోగ్య విషయంలో అజాగ్రత్త పనికిరాదు. అగ్ని, జల సంబంధ విషయాలలో ఒకింత జాగ్రత్త అవసరం మొత్తం మీద ఈ రాశివారలకు శుభాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్దిగా కొన్ని విషయాలలో జాగ్రత్త వహించినా ఇంకా ఉత్తమ ఫలితాలు పొందుతారు. శ్రీరామ రక్షా స్తోత్రం పారాయణం సర్వదారక్ష. రాహు, కేతు, గురు జపధ్యానం చేయుట గోసేవ వికలాంగులకు సహాయము, వృద్ధులకు సహకారం నిత్యం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రదక్షిణ మేలు చేయును.
మీ జీవితానికి ఒక స్థిరమైన దిశ, దశ ఏర్పడే అవకాశం గలదు. భవిష్యత్తుకై శాశ్వత స్ధిర నివాసంగాని, శాశ్వత పథకాలుగాని రూపొందించుకుంటారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న స్థాయి, గౌరవం లభిస్తాయి. సంతానం యొక్క విద్యా విషయమై స్థిరమైన కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చే విధంగా ఉంటుంది. ద్వితీయ సంతానం ఆరోగ్య విషయంలోగాని, విద్యా విషయంలోగాని స్వల్పమైన చికాకు ఏర్పడవచ్చును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న విధి నిర్వహణతో బాటు అదనపు బాధ్యత కూడా నిర్వర్తించ వలసి వస్తుంది. ధనము మాత్రం అంచనాలకు మించి ఖర్చుఅయ్యె అవకాశములు గలవు. స్థిరాస్థులు కొనుగోలు చేయునపుడు సంబంధించిన కాగితాలు పునః పరిశీలించివలసినది నూతన వ్యాపారములలో ప్రవేశించుట, అనూహ్యంగా ధనము చేతికందుతుంది. గతంలో ఋణంగా ఇచ్చిన ధనం మిశ్రమ ఫలంగా చేతికందుతుంది. శతృవులు మిత్రులుగా మారే అవకాశం గలదు.
నూతన వాహనయోగము కలదు. లాభము వ్యయము సమానముగా ఉండే అవకాశము గలదు. ఎక్కువగా ఆలోచించకూడదు. ఏదో తెలియని అభద్రత వల్ల ఆరోగ్యమునకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలి. ధనము మాత్రము అనాలోచితముగా ఖర్చు చేయకూడదు. కోర్టు తగాదాలు, కోర్టు వ్యవహారాలు వీలయినంత వరకు దూరంగా ఉండుట మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు చేయునపుడు అతి జాగ్రత్త అవసరము. పర్వత ప్రాంత సందర్శన, దివ్య క్షేత్ర సందర్శన ప్రాప్తి గలదు. ప్రయాణాలు మాటి మాటికి చేయవలసిన స్థితి ఏర్పడవచ్చును. అతి మంచితనము వల్ల కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చును. తద్వారా తమ దాంపత్య చికాకులు తగ్గించుకునే అవకాశము గలదు. ఉద్యోగస్తులు పనివత్తిడి సకాలంలో చేయవలసిన పని పూర్తి చేయక పై అధికారులతో సమస్యలు ఉత్పన్నము కావచ్చును.కొందరికి ఉద్యోగ స్థిరత్వము ఏర్పడుతుంది. అదనపు బాధ్యతలను మోయవలసిన పరిస్థితి రావచ్చును. నిరుద్యోగులకు అధిక శ్రమచే ఉద్యోగము లభించును.కళాకారులకు శ్రమచే, అతి ప్రయాసచే ఫలితము ఉండవచ్చును. కొత్త అవకాశాల కొరకు సహనము, ఓర్పు అవసరము. మనస్సు ఉత్సాహంగా ఉన్నా శరీరము అందుకు సహకరించక పోవడం వలన వచ్చిన అవకాశాలతోనే సంతృప్తి చెందవలసి ఉంటుంది. సంతానము యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులు జాఢ్యము వదలి ఒక క్రమ పద్ధతిలో శ్రమించండి. కీర్తి ప్రతిష్టలు పెరుగవచ్చును. అదనపు బాధ్యతల వలన భావ సంఘర్షణ ఏర్పడుతుంది. విదేశీ ప్రయాణాలు అంతగా అనుకూలించక పోవచ్చును. తమ సంతానానికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. శుభకార్యాచరణ గలదు. ఆర్థిక పరమైన వ్యాపారం చేసేవారు. అత్యుత్సాహాన్ని నియంత్రించుకొని ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో పదోన్నతి కలుగవచ్చును. నూతన విద్యలలో ప్రవేశిస్తారు. ప్రస్తుతమున్న వ్యాపారంగాని, ఉద్యోగం కాని మరొక ఆదాయం సమాంతరంగా ఏర్పడగలదు. మౌనేన కలహం నాస్తి అని తెలుసుకోవాలి. మీ వంశము కొరకు, వంశ పరువు ప్రతిష్ఠల కొరకు కొంత ధనవ్యయం చేస్తారు. వాస్తవము తెలుసుకునే ప్రయత్నము చేయండి. భవిష్యత్తు గురించి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. క్రమ శిక్షణతో కూడుకున్న జీవితానికి శ్రీకారం చుడతారు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా అనూహ్యముగా స్థానచలనము కలుగవచ్చును. అకాల భోజనము వలన కొంత చికాకు ఏర్పడవచ్చును. తమ సంతానము తనను నిర్లక్ష్యము చేస్తున్నారనే అపోహ, అనుమానము కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులకై ఇతరులు చేసిన చాడీలను నమ్మె స్థితిలో ఉంటారు. ప్రస్తుతమున్న ఉద్యోగముతో పాటు మరేదైనా ఆదాయం కొరకు మార్గాన్వేషణ చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారలకు మిశ్రమ ఫలము ఉన్నది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. చట్ట పరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. శని, గురు, రాహు, రవి జపాలు, ధ్యానము చేయాలి. గోసేవ, మూగ ప్రాణలకు ఆహారము ఇచ్చుట వల్ల సమస్యల నుండి బయటపడవచ్చును.



_medium.png)