నమ్మలేని నిజాలు Mysteries & Miracles

తాజ్ మహల్ రహస్యం

(Secret of Tajmahal)

 

ప్రపంచంలో తాజ్ మహల్ అంత అందమైన కట్టడం ఇంకోటి లేదనడంలో సందేహం లేదు. తాజ్ మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక, అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది. తాజ్ మహల్ ను మొఘల్ చక్రవర్తి షాజహాన్, తన భార్య ముంతాజ్ జ్ఞాపక చిహ్నంగా కట్టించాడని చెప్పుకుంటాం. ముంతాజ్ మహల్ షాజహాన్ మూడో భార్య. ఆమె తన14వ సంతానం అయిన గౌహరా బేగంకు జన్మనిస్తూ నరకయాతన అనుభవిస్తున్న ఆఖరి దశలో షాజహాన్ను "ప్రపంచంలో ఇంతకంటే అందమైన భవనం ఇంకేదీ లేదు అనిపించేలా అద్భుతమైన సమాధిని తనకోసం కట్టించమని" అడిగిందని, ఆమె చివరి కోరిక తీర్చేందుకు, షాజహాన్ తాజ్ మహల్ కట్టిండనే కధనం ప్రచారంలో ఉంది.

తాజ్ మహల్ గురించిన ఈ కధ అందరికీ తెలిసిందే. కానీ, ఎక్కువమందికి తెలీని మరో నమ్మలేని నిజం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముస్లింలు తమ పాలనలో వందలాది హిందూ దేవాలయాలను కూలగొట్టారు. కొన్నిటిని నామరూపాల్లేకుండా చేసి, ఇంకొన్ని భవనాలను మసీదులుగా, ఇస్లామిక్ నిర్మాణాలుగా మార్చేశారు. అందుకు అయోధ్య లోని రామజన్మభూమి, మధురలోని కృష్ణాలయం రెండు ఉదాహరణలు మాత్రమే. నిజానికి అలాంటివి ఇంకెన్నో ఉన్నాయని, తాజ్ మహల్ కూడా అలా మార్చి కట్టినదే అని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయి.

షాజహాన్ కు భార్య ముంతాజ్ మీద అంతులేని ప్రేమ అనడాన్ని నమ్మలేం. ఎందుకంటే, ఒక వ్యక్తికి ఒకరి మీద మాత్రమే ప్రేమ కలిగితే అది నిజాయితీతో కూడింది. పవిత్రమైంది. అపురూపమైంది. అంతే తప్ప అనేకమందిమీద ఏకకాలంలో ప్రేమ అంటే... అంతకంటే బూటకం ఉండదు. పైగా షాజహాన్ కుడజనుకు పైగా భార్యలే కాకుండా 500 మంది స్త్రీలతో సంబంధం ఉండేదని, ఆఖరికి సొంత కూతురితో కూడా రిలేషన్ పెట్టుకున్నాడని, పైగా దాన్ని సమర్ధించుకుంటూ "తోటమాలికీ తాను నాటిన ప్రతి చెట్టు కాయనూ రుచి చూసే హక్కు ఉంటుందని" వాదించేవాడని అంటారు. ఇంత చంచల మనస్కుడు ముంతాజ్ కోసం పనిమాలా తాజ్ మహల్ ను కట్టించాడు అనేది నమ్మశక్యం కాని సంగతి.

షాజహాన్ వ్యక్తిగత తీరు సంగతి అలా ఉంచితే, ప్రసిద్ధ చరిత్రకారుడు పీ.ఎన్. ఓక్ ''తాజ్ మహల్'' నిజానికి హిందూ శివాలయం అని, దాని అసలు పేరు ''తేజో మహాలియా'' అని చాటుతూ అనేక ఆధారాలతో ''Taj Mahal - The True Story” పేరుతో ఎప్పుడో 1965లోనే గ్రంధం రాశారు.

తాజ్ మహల్ మొదట "తేజో మహాలియా" అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. ఔరంగజేబు పర్షియన్ భాషలో షాజహాన్ కు రాసిన ఒక లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్ మహల్ గా మార్చినట్లు రాశాడంటూ పీ. ఎన్. ఓక్ http://rbhatnagar.ececs.uc.edu:8080/hindu_history/modern/taj_oak.html ఉటంకించారు.

కానీ అప్పట్లో ప్రభుత్వం ''Taj Mahal - The True Story” పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవరికీ తెలీకుండా పోయింది. మత కలహాలు చెలరేగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు. కానీ, నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా!

ఏమైతేనేం, భారతీయ, ఇస్లాం, పర్షియన్ వాస్తు సమ్మిశ్రితంగా నిర్మించిన తాజ్ మహల్, 400 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది. తాజ్ మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేలమంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్ళు పాల్గొన్నారు. ప్రపంచ వింతల్లో ఇదొకటి. భారతమాతకు ఇదో సుందర కళాభరణం. 1983లో యునెస్కో "ప్రపంచ పూర్వా సంస్కృతి ప్రదేశం"గా తాజ్ మహల్ ను గుర్తించింది.

ఈ అంశంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి.


More Mysteries - Miracles