డబ్బుతో అన్నీ కష్టాలే!

 

 

అర్జనా మార్జనే దుఃఖం అర్జితానాం చ రక్షణే।

నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్థం దుఃఖభాజనమ్‌॥

డబ్బుని ఆర్జించాలన్నా బాధే; అలా ఆర్జించిన డబ్బుని రక్షించుకోవాలన్నా దుఃఖమే; రక్షించుకున్న డబ్బు నాశనం అయిపోయినా దుఃఖమే; నాశనం కాకుండా మనమే ఖర్చు చేసినా దుఃఖమే... మొత్తానికి డబ్బుకి సంబంధించి ఏ స్థితి అయినా చివరికి దుఃఖానికే దారితీస్తుంది.


More Good Word Of The Day