బతికితే అలా బతకాలి

 

 

జాతః కూర్మః స ఏకః పృథుభువనభరా యార్పితం యేన పృష్ఠం

శ్లాఘ్యం జన్మధ్రువస్య భ్రమతి నియమితం యత్ర తేజస్విచక్రమ్‌ ।

సంజాతప్యర్థపక్షాః పరహితకరణే నోపరిష్టా న్న చాథో

బ్రహ్మాండోదుంబరాంత ర్మశకవ దపరే జంతవో జాతనష్టాః ॥

తన వీపు మీద పధ్నాలుగు భువనభవనాలను మోస్తున్న ఆ కూర్మరాజుది జీవితమే జీవితం. తన తేజస్సుతో ఆకాశంలో స్థిరంగా నిలిచిపోయి ఉన్న ధృవునిదీ తల్చుకోవాల్సిన జీవితమే! పాతాళంలో ఇటు కూర్మంలాగానో, ఆకాశంలో అటు ధృవునిలాగానో ఉన్నతంగా జీవించక... మిగతా జీవులంతా పుడుతూ గిడుతూ తమ జీవితాలను వృధా చేసుకుంటున్నారు.


More Good Word Of The Day