108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐశ్వర్యాలు వరిస్తాయి

 

జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషమయంగా సాగాలంటే ఆ లక్ష్మీ కటాక్షం ఉండాలి. లక్ష్మీ దేవి విశేష అనుగ్రం పొందాలంటే శుక్రవారం, ఏకాదశి రోజులలో తప్పక పూజించుకోవాలి. ప్రకృతిం వికృతిం విద్యాం అంటూ ప్రారంభమయ్యే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రతినిత్యం 3 పూటల ఇంద్రియ నియమంతో 6 నెలలు పారాయణ చేస్తే సకల విధములైన లేములు తొలిగిపోయతాయిం. అందుకే దీనిని దారిద్రయ్య విమోచన స్తోత్రం అంటారు. ఒక సంవత్సర కాలం పాటు నియమములతో ప్రతి శుక్రవారం 108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐస్వర్యాలు వరిస్తాయి. ఈ మంత్రం పార్వతికి శివుడు ఉపదేశించినది.

శ్రీ అష్టలక్ష్మీదేవాలయం -చినెరుకపాడు

ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున అష్టలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకుంటే మరీ శుభకరం.  అలాంటి ఆలయం కృష్ణజిల్లా, గుడివాడ మండలం, బిల్లపాడు సరిహద్దులోని చిన ఎరుకపాడులో శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం ఉన్నది. గుడివాడ నుండి పామర్రుకు వెళ్ళు రోడుమార్గం ప్రక్కన ఈ ఆలయం నిర్మితమై ఉన్నది. దత్తపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ క్షేత్రంలో దత్తపాదుకలను ప్రతిష్టించి, గురుదత్త పాదుకా క్షేత్రంగా దీనిని పిలిచారు. ఆ తరువాత ఇటీవల కాలంలో స్వామీజీ వారి పవిత్ర హస్తలతో, అష్టలక్ష్మీ ప్రతిష్ట, యంత్రస్థాపన, ధ్వజస్తంభస్థాపన, సిద్ధిబుద్ధి సమేత గణపతి ప్రతిష్ట, అనుఘాదేవి, దత్తాత్రేయ ప్రతిష్టలు జరిగాయి.


అమ్మవారి ఆలయ ప్రవేశద్వారం వినూత్నంగా నిర్మింపబడి ఉంది. రెండువైపులా ఆలయ ప్రవేశపు పడికట్లు లోహపు కడ్డీలతో అమర్చిన పార్శ్యభాగాలతో అందంగా ఉంటాయి. ఈ ప్రవేశద్వారానికి ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. గర్భాలయంలో శ్రీమహాలక్ష్మీదేవి చరణపద్మాలు, అభయ, వరద ముద్రలతో భక్తులకు దర్శనమిస్తాయి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉత్సవమూర్తులు, శ్రీచక్రయంత్రం, సుమేరువు అమ్మవారికి దిగువభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రధాన ఆలయానికి అనుబంధంగా అష్టగణపతుల మందిరం, శ్రీశ్రీ అనుఘాదేవి సమేత విష్ణుదత్తస్వామి, శ్రీమతి జయలక్ష్మీ మాత, గురుదత్తపీఠం మొదలైనవి ఉన్నవి. స్వామివారి మాతృమూర్తి శ్రీమతి విజయలక్ష్మీ మాత ఈ ఆలయానికి రక్షణదేవతగా సుందవిగ్రహ రూపంలో ఇచ్చట దర్శనమిస్తుంది.


Laxmidevi Puja Friday, Godess Lakshmi Devi Pooja Benefits Friday, Friday Importance Lakshmi Devi Puja For Wealth

 

ప్రతిరోజూ అమ్మవారికి సమప్రనామ, అష్టాత్తర పూజలు జరుగుతాయి. ఇంతే కాక శ్రావణమాసంలో శ్రీచక్రారార్చన, పౌర్ణమికి హోమం, పంచామృతాభిషేకాలతో అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. అష్టలక్ష్ములలో శక్తికి ప్రతిరూపమైన గజలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా ఈ ఆలయంలో పూజాదికాలు ఘనంగా నిర్వహిస్తారు.


More Lakshmi Devi