ప‌ని - ప్ర‌య‌త్నం!

 

 

 

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః

ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః ।

విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః

ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి ॥


నీచులు ఏద‌న్నా ప‌నిని ప్రారంభించేందుకు కూడా సంశ‌యిస్తూ ఉంటారు. తాము త‌ల‌పెట్టే ప‌ని ఎక్క‌డ విఫ‌ల‌మ‌వుతుందో అన్న సంశ‌యంతో దానిని మొద‌లుపెట్ట‌నే పెట్ట‌రు. మ‌ధ్య‌ములు ప‌నిని ఎలాగొలా మొద‌లుపెడ‌టారు. కానీ ఏద‌న్నా విఘ్నం ఎదురుకాగానే అక్క‌డితో త‌మ ప్ర‌య‌త్నం నుంచి విర‌మించుకుంటారు. ఉత్త‌ములు అలా కాదు! ఎన్ని విఘ్నాలు ఎదురైనా, ఎన్ని క‌ష్టాలు ప‌ల‌క‌రించినా... అనుకున్న ప‌నిని పూర్తిచేసే వ‌ర‌కూ విశ్ర‌మించ‌రు.

 

 


More Good Word Of The Day