జగమంత కుటుంబం
వీడు పరులవాడు వాడు నావాడని
అల్పబుద్ధి తలచు నాత్మయందు
సాధుపుంగవులకు జగమే కుటుంబంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
అల్పబుద్ధి ఉండేవారికే ఫలానావాడు నా వాడు, ఫలానా వాడు పరాయివాడు అన్న బేధాల ఉంటాయి. సజ్జనులకు జగమంతా ఒకటే కుటుంబం. సంకుచిత భావాలు ఉంటేనే తరతమ బేధాలు ఉంటాయని సూచిస్తున్నాడు శతకకారుడు.
...Nirjara



