వినాయకుడి రూపాలు ఎన్ని .. వాటిలో ఉన్న వినాయకుడు ఎలా ఉంటాడు!

 

విఘ్నాలు తొలగించే వినాయకుడు ఒకటి రెండు కాదు.. మొత్తం 32 రూపాలలో పూజించబడతాడు.  సాధారణంగా అందరికీ షోడశ గణపతి గురించి మాత్రమే తెలిసి ఉంటుంది. అంటే 32 వినాయక రూపాలలో 16 రూపాలను ప్రధానంగా పేర్కొన్నారు. ఈ షోడష గణపతులు చాలా ప్రాముఖ్యత చెందినవి. ఈ షోడష గణపతులలో పదమూడవ రూపం మహా గణపతి. ఈ మహాగణపతి రూపాన్నే ఎక్కువగా పూజిస్తారు.


వినాయక రూపాలు..

బాల గణేశుడు.. పిల్లల రూపంలో ఉంటాడు.

తరుణ గణపతి.. యవ్వన రూపంలో ఉంటాడు.


భక్త గణేశుడు.. భక్తులను అనుగ్రహించే రూపంలో ఉంటాడు.


వీర గణపతి.. పన్నెండు చేతులతో, పన్నెండు ఆయుధములతో వీర గణపతి ఉంటాడు.

శక్తి గణపతి.. నాలుగు చేతులతో శక్తివంతమైన రూపం శక్తి గణపతిది.

ద్విజ గణపతి.. ఈయనకు నాలుగు చేతులు,  నాలుగు తలలు ఉంటాయి.

సిద్ధి గణపతి .. కోరిన కోర్కెలు తీర్చే గణపతిగా భావిస్తారు.  


ఉచ్ఛిష్ట గణపతి.. ఈ రూపంలో వినాయకుడు అమ్మవారిని ఆలింగనము చేసుకుని ఉంటాడు.


విఘ్న గణపతి.. అవరోధాలకు అధిపతి.


క్షిప్ర గణపతి సులభంగా శాంతింపజేసే వినాయకుడు ఈయన.


హేరంబ గణపతి.. తల్లికి చాలా ఇష్టమైన  కుమారుడు ఈయన.


లక్ష్మీ గణపతి.. ఎనిమిది చేతులతో సిద్ది, బుద్ధి దేవేరులను ఆలింగనం చేసుకుని ఉంటాడు.

మహా గణపతి.. ఏకదంతంతో, ఎనిమిది చేతులతో ఉంటాడు.  ఎక్కువగా పూజలు అందుకునేవాడు ఈయనే.


విజయ గణపతి.. విజయాలను చేకూర్చే గణపతి ఈయన.


నృత్య గణపతి.. నృత్యం చేస్తున్న రూపంలో ఉంటాడు ఈయన.

ఊర్ధ్వ గణపతి...  ఎనిమిది చేతులు,  ఏకదంతంతో.. ఒక చేతిలో గద, మరొక చేతితో అమ్మవారిని ఆలింగనము చేసుకుని ఉంటాడు.


ఏకాక్షర గణపతి.. నాలుగు చేతులు, ఏకదంతంతో ఉంటాడు. తల మీద చంద్రవంక ఉంటుంది.  


వర/ వరద గణపతి.. వరాలను ప్రసాదించే వాడు.


త్రయక్షర గణపతి..  బంగారు రంగులో  ఉంటాడు ఈయన.


క్షిప్ర ప్రసాద గణపతి  అరుణ వర్ణంలో ఉంటాడు. త్వరగా ప్రతిఫలం ఇచ్చేవాడు.


హరిద్ర గణపతి..పసుపు  రంగు గణపతి.


ఏకదంత గణపతి..  శ్యామ వర్ణంలో ఉండే గణపతికి ఏక దంత ఉంటుంది.


సృష్టి గణపతి.. రక్తవర్ణములో పెద్ద ఎలుకపై తిరుగుతూ ఉంటాడు.  

ఉద్దండ గణపతి.. ఎరుపు వర్ణంలో ఉంటాడు. ధర్మం/న్యాయాన్ని అమలు చేసేవాడు.


ఋణమోచన గణపతి.. అప్పుల నుండి విముక్తి కలిగించేవాడు.


దుండి గణపతి..  రక్తవర్ణంలో ఉంటాడు.  వెంటనే కోరికలు తీర్చేవాడని నమ్మకం.


ద్విముఖ గణపతి.. హరినీల వర్ణములో ఉంటాడు. రెండు తలలతో కూడిన రూపం.


త్రిముఖ గణపతి.. గణపతి యొక్క మూడు ముఖాల రూపం.


సింహ గణపతి..  తెలుపు రంగులో ఉంటాడు.  సింహ ముఖము, ఏనుగు తొండముతో  సింహ రూపంలో ఉంటాడు.


యోగ గణపతి.. చేతిలో యోగ దండంతో.. యోగ భంగిమలో ఉన్నవాడు.


దుర్గా గణపతి.. బంగారు రంగులో ఉంటాడు.  అజేయుడు, దుర్గాదేవిని పోలినవాడు)


సంకటహర గణపతి...  సమస్యలను తొలగించేవాడు.

                                      *రూపశ్రీ.


More Vinayakudu