మహా విష్ణువు అవతారాల రహస్యం.. దశావతారాలకు మించిన అద్బుతం ఇది.. !
![]()
విష్ణుమూర్తి అవతారాలు ఎన్ని అంటే.. టక్కున దశావతారాలు అంటారు అందరూ. పురాణాల ఆధారంగా తీసిన సినిమాలు అయినా, సీరియల్స్ అయినా, డాక్యుమెంటరీలు అయినా.. ఇలా ఏవైనా సరే.. దశావతారాలను హైలెట్ చేస్తూ చూపిస్తారు. అయితే విష్ణువు ఎత్తిన అవతారాల గురించి పురాణ గ్రంథాలలో వెతికితే చాలా చోట్ల చాలా రకాలుగా ఉంటుంది. కానీ భాగవతంలో మాత్రం శ్రీమహావిష్ణువు 24 ప్రధాన అవతారాలు ఎత్తాడని స్పష్టం చేస్తుంది. ఈ అవతారాలను చతుర్వింశతి అవతారాలు అని కూడా పిలుస్తారు. ఈ అవతారాల గురించి ధనుర్మాసం పూర్తయ్యేలోపు..మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి లోపు ఒక్కసారి తెలుసుకన్నా, ఆయా అవతారాలను తలచుకున్న ఎంతో గొప్ప పుణ్యం కలుగుతుందని చెబుతున్నారు పురాణ పండితులు. ఇంతకీ మహా విష్ణువు ఎత్తిన 24 అవతారాలు ఏంటి? తెలుసుకుంటే..
మహా విష్ణువు 24 అవతారాలు..
1. సనకాది కుమారులు..
బ్రహ్మ మానసపుత్రులు – జ్ఞానమార్గాన్ని బోధించారు.
2. వరాహ అవతారం
భూమిని రాక్షసుడి నుంచి రక్షించి పైకి తీసుకొచ్చాడు.
3. నారదుడు
భక్తిని లోకమంతా ప్రచారం చేసిన మహర్షి.
4. నరనారాయణులు
తపస్సు చేసి ధర్మాన్ని స్థాపించారు.
5. కపిల మహర్షి
సాంఖ్య తత్వాన్ని బోధించారు.
6. దత్తాత్రేయుడు
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపం – గురు తత్వానికి ప్రతీక.
7. యజ్ఞ అవతారం
దేవతలకు యజ్ఞాలను నిర్వహించి లోకాన్ని రక్షించారు.
8. ఋషభదేవుడు
భారత చక్రవర్తి, త్యాగ జీవనానికి ఆదర్శం.
9. పృథు మహారాజు
భూమిని సస్యశ్యామలం చేసిన రాజు.
10. మత్స్య అవతారం
ప్రళయ సమయంలో వేదాలను రక్షించాడు.
11. కూర్మ అవతారం
సముద్ర మథనంలో మంధర పర్వతాన్ని మోశాడు.
12. ధన్వంతరి
ఆయుర్వేద దైవం – అమృతాన్ని ఇచ్చాడు.
13. మోహిని అవతారం
దేవతలకు అమృతం అందించేందుకు ఎంతో అందమైన రూపం ధరించాడు.
14. నరసింహ అవతారం
భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించాడు.
15. వామన అవతారం
బలిచక్రవర్తి గర్వాన్ని తగ్గించాడు.
16. పరశురామ అవతారం
అధర్మ రాజులను సంహరించాడు.
17. వ్యాస అవతారం
వేదాలను విభజించి మహాభారతం రచించాడు.
18. శ్రీరామ అవతారం
మర్యాద పురుషోత్తముడు – ఆదర్శ రాజు.
19. బలరామ అవతారం
కృష్ణుడి అన్న, ధర్మబలానికి ప్రతీక.
20. కృష్ణ అవతారం
భగవద్గీత బోధించిన పరమాత్మ.
21. బుద్ధ అవతారం
కరుణ, అహింస బోధించిన మహానుభావుడు. ఈయన గౌతమ బుద్దుడు కాదు. పురాణాలలో పేర్కొన్న బుద్దుడు వేరు.
22. కల్కి అవతారం
కలియుగాంతంలో వచ్చి అధర్మాన్ని నశింపజేస్తాడు.
23. హయగ్రీవ అవతారం
వేదాలను రక్షించిన గురురూపం.
24. హంస అవతారం
ఆత్మజ్ఞానాన్ని బోధించిన దివ్య రూపం.
పైన పేర్కొన్న అవతారాలు అన్నీ విష్ణుమూర్తి ఎత్తినవే. వీటిలో కొన్ని మానవ రూపంతో భూమి మీదకు వచ్చి మానవులకు ఆదర్శంగా నిలిచి ఆ మార్గంలో నడిచేలా చేసి అవతార ముగింపు ఇచ్చాయి. మరికొన్ని దైవిక భావనలో జనించి అలాగే అవతార ముగింపు లేకుండానే పూజలు అందుకుంటున్నాయి. ఈ 24 మాత్రమే కాకుండా మరిన్నిఅవతారాలు కూడా విష్ణుమూర్తి తీసుకున్నారు. కానీ పైన పేర్కొన్న 24 అవతారాలే ప్రధానంగా పేర్కొంటున్నారు.
*రూపశ్రీ.


