• Prev
  • Next
  • Sweet home

    " రాము – ఏమిటిరా, మీ ఇంటి నిండా ఇన్ని చీమలున్నాయి?" అని హరి నవ్వి ఊరుకున్నాడు.

    హరి భార్య కల్పించుకుని “చీమలే కదన్నయ్యా, చిరుత పులులు కాదుగా” అంది.

    రాము విడ్డూరంగా చూశాడు.

    అంతలోనే సర్దుకుని “అది కాదమ్మా, కాస్త గమాక్సన్ అయినా వేయొచ్చు కదా” అన్నాడు.

    “అవేం మాటలన్నయ్యా, చూడగానే మాది స్వీట్ హోమ్ అని గ్రహించొద్దా ఏం?!” అంటూ మూతి తిప్పింది హరి భార్య.

    ఆశ్చర్యపోవడం రాము వంతయింది.


  • Prev
  • Next