TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.
Konte Questions-Tuntari Javabulu-6
******************************************************************
బి.లక్ష్మీ ప్రసాద్,విశాఖపట్నం.
కొంటె కొశ్శెన్ : ఆవులిస్తే పెగుల్లెక్క పెట్టేస్తాను నేను.నా నుంచి మరి మీరెలా
తప్పించుకోగలరు?
తుంటరి జవాబు :ఎద్దులిచ్చి
*******************************************************************
జె.శ్రీకాంత్,రాజమండ్రి.
కొంటె కొశ్శెన్ : అసలుసిసలైన భాగ్యనగరపు ఇల్లాలు ఎవరు ?
తుంటరి జవాబు : 'పిల్లల ఉత్సహం మీద నీళ్ళు జల్లకండి' అని ఎవరైనా
చెబితే,'స్నానంకి బదులు ఒంటిమీద జల్లుకోవదానికీ నీళ్ళు రావటం లేదు.ఇంక
ఉత్సాహం మీద ఎక్కడ జల్లగలను'అని జవాబిచ్చేది.
*******************************************************************
కూర్మాన వెంకట సుబ్బారావు,విశాఖపట్నం.
కొంటె కొశ్శెన్ : వాతావరణం కేంద్రంలో పనిచేసే వ్యక్తిని 'జీవితం ఎలా వుందంటే'ఏం
చెబుతాడు.?
తుంటరి జవాబు :మూడు లోన్లు ఆరు సైకోన్లు గా ఉందంటాడు.
*******************************************************************
ఎస్.శివనారాయణ,కొత్తపేట.
కొంటె కొశ్శెన్ :బాగా పొద్దుపోయిన తరువాత వచ్చిన వాళ్లనేమనుకోవాలి ?
తుంటరి జవాబు :పొద్దుపోక వచ్చారనుకోవాలి.
*******************************************************************
రమణ శాస్త్రి,సంగారెడ్డి.
కొంటె కొశ్శెన్ :హాస్పటల్ ఆదాయం ఎప్పుడు బాగుంటుంది.మంచి సెంటర్లో
ఉన్నప్పుడా?మంచి డాక్టర్లున్నప్పుడా ?
తుంటరి జవాబు :రెండూ కాదు!మంచి నర్సులున్నప్పుడు.
*******************************************************************
కొంటె కొశ్శెన్ : ఆడవాళ్ళు తమ అందం మీద ఎప్పుడు శ్రద్ధ వహించాలి ?
తుంటరి జవాబు :సిటీ బస లో తన పక్క సీటు ఖాళీగా ఉన్నా,ఏ మగాడూ
కూర్చోవడానికి ముందుకు రానప్పుడు.
*******************************************************************
కొంటె కొశ్శెన్ : మొండి బాకీలు వసూలు అవ్వాలంటే అప్పిచ్చినవాళ్ళు ఏం
చెయ్యాలి ?
తుంటరి జవాబు : వసూళ్ళ పనిని అంటువ్యాధిలా రోగులకప్పచెప్తే సరి.
*******************************************************************
(హాసం సౌజన్యంతో)