• Prev
  • Next
  • Jandhyala Jokes

    Jandhyla Jokes

    ********************************

    పెళ్లి అర్హతలు

    "మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న అర్హతలేమిటి ?" అడిగాడు కాంతారావు.

    " వంటలు బాగా చేస్తాను, బట్టలు బాగా ఉతుకుతాను. ఇంతకంటే ఏం అర్హతలు కావాలి సార్

    " అన్నాడు ప్రభాకర్.

    ********************************************

    మిడ్ నైట్ కార్యక్రమాలు

    రిపోర్టర్ : మన టి.వి. కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయని స్కూల్ పిల్లల దగ్గర్నుంచి

    ఉత్తరాలు వస్తున్నాయి సార్.

    మేనేజర్: ఏ కార్యక్రమాలు బాగున్నాయంటున్నారు ?

    రిపోర్టర్: మిడ్ నైట్ కార్యక్రమాలట సార్.

    **************************************

    స్కూల్ వాస్తు

    " ఏరా విజయ్...ఈ మార్కులేంటి? వందకు ఐదు మార్కులే వచ్చాయి " అని అడిగాడు

    తండ్రి.

    " మరేం చేయమంటావు నాన్నా! మా స్కూల్ వాస్తు బాగోలేదు " అని చెప్పాడు విజయ్.

    ********************************

    పిల్లల్ని కనడం

    శివుడు : పార్వతి...మనకు ఇద్దరు పిల్లలు చాలు. ఇక పిల్లల్ని కనడం నావల్ల

    కాదు.ఆపరేషన్ చేయించేసుకుందాం.

    పార్వతి : ఆ ఆపరేషనేదో మీరే చేయించుకోండి. నాకింకా పిల్లల్ని కనాలని ఉంది.

    ************************************

    ఆడవాళ్ళూ - మగవాళ్ళూ

    "ఆడవాళ్ళూ, మగవాళ్ళూ కాస్త తెలివితేటలతో ప్రవర్తిస్తే కాపురాల్లో అసలు కలతలే

    ఉండవు. విడాకులు అసలే ఉండవు" అని అన్నాడు అప్పలస్వామి.

    " ఇంకాస్త తెలివిగా ప్రవర్తిస్తే అసలు పెళ్లిళ్ళే ఉండవు " అని గబుక్కున అన్నాడు

    చింతలనాయుడు.

    ****************************

    భార్య కోసం

    “ ఇదేమిటండీ...ప్లేటు,కత్తి తీసుకుని మేడెక్కుతున్నారు..”అడిగింది భార్య.

    “ నీకోసం పండు వెన్నెలను కోసి తెద్దామని " వెటకారంగా అన్నాడు భర్త.

    ******************************************

    ఇంటార్వ్యూ 

    ఇంటర్వ్యూ సాగుతుంది.

    "ఆమెరికా నాల్గో ప్రెసిడెంట్ ఎవరు ?"

    " చైనా మొదటి చక్రవర్తి ఎవరు ?"

    " జపాన్లో తొలి భూకంపం ఎప్పుడొచ్చింది ?"

    " హిమాలయాలలో ఎన్ని పర్వతాలున్నాయి ?"

    అభ్యర్థికి విసుగెత్తింది.

    " సార్..మీరిన్ని ప్రశ్నలడిగారు. వాటి సమాధానాలు మీక్కూడా తెలియవని నాకు తెలుసు.

    మీకు జవాబు తెలిసిన ఒక ప్రశ్న నేను వేస్తాను. మీ ఐదుగురికి కలిపి లంచం ఎంత కావాలి

    ?" అని అడిగాడు.

    **********************************************


  • Prev
  • Next