• Prev
  • Next
  • హలో... రాంగ్ నెంబర్.! - 61

    Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

     

    హలో... రాంగ్ నెంబర్.! - 61

     

    ముచ్చర్ల రజనీ శకుంతల

     

    భర్తను ఓరకంటితో గమనిస్తూనే వుంది. శ్రీకర్ బెడ్ రూమ్ లోకి రావడం, బ్రీఫ్ కేస్ మంచం మీద గిరాటేసి, బాత్రూంలోకి వెళ్ళడం, ఇరవై నిమిషాల్లో ఫ్రెషప్ అయి బయటకు రావడం...మంచం మీద అడ్డంగా పడుకోవడం..అన్నీ గమనిస్తూనే వుంది.

    "కాఫీ తాగుతారా?" అడిగింది ప్రియంవద మొగుడ్నీ.

    "వద్దు"

    "ఏం...ఎక్కడైనా తాగేసి వచ్చారా?"

    "తాగి వచ్చారా అంటే కొంత బావుటుంది. తాగేసి వచ్చారా? అంటే మందుకొట్టి వచ్చారా అన్న మీనింగొస్తుంది" శ్రీకర్ అన్నాడు.

    "మీ అంత యిదిగా నాకు తెలుగు రాదులెండి.

    ఈ మధ్య టీవీలో 'తెలుగువారందరం..తెలుగే మాట్లాడుదాం'అ ని సగం ఇంగ్లీష్ లో చెబుతుండగా విన్నాన్లెండి" రిట్టార్టిచ్చింది ప్రియంవద.

    మరో టైంలో అయితే శ్రీకర్ మాటకు మాట సెటైర్ వేసేవాడు. ఇప్పుడతని మూడ్ బాగాలేదు.

    "ఎక్కడికి వెళ్ళొస్తున్నారు?" అడిగింది ప్రియంవద.

    ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఓ కథ అల్లి చెబుతాడు. తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. లక్ష రూపాయలు ఖచ్చితంగా షాలినికే యిచ్చాడు. అందుకు బదులుగా షాలిని...?

    ఆమె అలా ఆలోచిస్తూ వుండగానే శ్రీకర్ అడిగాడు. "ఆ డిటైల్స్ అంత అవసరమా?"

    "అవును..మన పందెం మొదలైంది. మీరు ఓడిపోయారేమోనని చిన్న అనుమానం"

    శ్రీకర్ ప్రియంవద వంక చూసి చెప్పాడు.

    "షాలిని యింటికి వెళ్ళొస్తున్నాను"

    ఆమె భర్త నుంచి ఆ సమాధానం ఎక్స్ పెక్ట్ చేయలేదు.

    "షాలిని యింటికా?"

    "అవును"

    "ఎ...ఎందుకు?"

    "లక్ష రూపాయలు యిచ్చి రావడానికి"

    "ల..క్ష..రూ..పా...య...లా?"

    "అవును"

    "లక్ష రూపాయల బదులు ఆమె ఏం యిచ్చిందో....లక్షంగా ఆమెనే యిచ్చుకొని వుంటుంది" అంది మొగుడి వంక చూస్తూ.

    "ఏమీ ఇవ్వలేదు"

    "అంటే లక్ష రూపాయలు ఉత్తిపుణ్యానికే ఇచ్చారా? అంత డబ్బు బూడిదలో పోసిన పన్నీరేనా?" ప్రియంవద అడిగింది.

    ఒక్కసారిగా షాకింగ్ భార్య వంక చూసాడు.

    "అంటే నీకు లక్షరూపాయలు పోయాయన్న బాధకన్నా, ఆమెను వుపయోగించుకోలేదన్న బాధే ఎక్కువగా వున్నట్టుంది."

    "మీరు ఫ్రీగా అంత డబ్బులెందుకిస్తారు?"

    "ఫ్రీగా యివ్వలేదు. ఆమెను ఎక్స్ పెక్ట్ చేసే యిచ్చాను"

    "మరి..."

    "నాకే నచ్చక వచ్చేసాను..మరీ అంత మణీ మైండెడ్ ని ఏ మైండ్ తో ట్యూన్ చేసుకోనూ.."

    భర్త వంక చూసింది. అతని నిజాయితీకి సంతోషించాలో, అతను లక్షరూపాయలు ఆయాచితంగా వదులుకున్నందుకు బాధపడాలో అర్థంకాలేదు.

    "లక్షరూపాయలు అలా నీళ్ళలో వదిలేస్తారా?" అంది ప్రియంవద.

    "అబ్బ..ఇక ఆ టాపిక్ వదిలేయ్" అన్నాడు కళ్ళు మూసుకుంటూ. అతను ఫిజికల్ గా, మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాడు.

    *              *           *

     

     

  • Prev
  • Next