• Prev
  • Next
  • హలో... రాంగ్ నెంబర్.! - 57

    Get latest telugu famous comedy serials Hello Wrong Number, telugu serial comics and latest jokes online

     

    హలో... రాంగ్ నెంబర్.! - 56

     

    ముచ్చర్ల రజనీ శకుంతల

     

    లూసీని చూడగానే చిన్నపాటి ఉద్వేగం కలిగింది శ్రీకర్ లో. తన ఫీలింగ్స్ ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ, లూసీకి ఎదురెళ్ళి.

    "కమాన్ లూసీ...వెల్ కమ్" అంటూ ఆప్యాయంగా ఆహ్వానించాడు.

    "థాంక్యూ సార్. ఈ లూసీని మరిచిపోయావేమో అనుకున్నాను" అంది లూసీ.

    శ్రీకర్ లూసీ వంక పరిశీలనగా చూసాడు. బ్లూజీన్ మీద బ్లాక్ కలర్ రౌండ్ నెక్ టీషర్ట్ వేసింది. మొహంలో ఏదో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

    "చెప్పు లూసీ ఏం తీసుకుంటావు...కాఫీ, టీ, కోక్..ఛాయిస్ ఈజ్ యువర్స్"

    "ఓ ఉద్యోగం తీసుకుంటాను" అంది చిన్న స్మయిల్ తో లూసీ.

    "వ్వా...ట్"

    "అవును...మీరే అన్నారుగా...ఎప్పుడైనా రమ్మని...మీ పి.ఏ.గా వుండమని"

    "యస్సెస్...కానీ నువ్వు సీరియస్ గా..."

    "యస్..అయామ్ సీరియస్. నేను సీరియస్ గా అంటున్నాను. ఇండియాకు శాశ్వతంగా వచ్చేస్తాను. మీరే ఉద్యోగం యిచ్చినా సరే" అంది లూసీ.

    "ఆర్యూ జోకింగ్"

    "చెప్పానుగా...ప్రామిస్. నేనూ సీరియస్ గానే అంటున్నాను"

    "వావ్..అయితే వెంటనే పి.ఏ.గా సెలక్టయిపో...జాబ్ కన్ ఫర్మ్ ...నా పి.ఏ. సెలవులో వుంది. బహుశా వచ్చే వుద్దేశం కూడా వుండివుండదు. అపాయింట్ మెంట్ ఆర్డర్ ప్రిపేర్ చేయించనా?"

    "అప్పుడే తొందరపడకండి సార్. మీతో మాట్లాడవలసిన విషయాలు చాలా వున్నాయి"

    "తీరిగ్గా మాట్లాడుకుందాం...అన్నట్టు ఎక్కడదిగావు?"

    "స్టేషన్లో" చెప్పింది లూసీ.

    "యూనాటీ...నేనడిగేది ఏ హోటల్ లో అని?"

    "హోటల్ విహార్ లో. థర్డ్ ఫ్లోర్. త్రిబుల్ సిక్స్ రూమ్ లో" చెప్పింది లూసీ.

    "రైట్...నువ్వు హోటల్ కు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను ఈవెనింగ్ వస్తాను. అక్కడ తీరిగ్గా మాట్లాడుకుందాం. ఈలోగా నేను అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయిస్తాను"

    "ఏంటీ..నాకు షరతులా..ఇదేదో రివర్స్ వ్యవహారంలా వుందే"

    "ప్లీజ్..."

    "ఓ.కె. సాయంత్రం కలుద్దాం"

    "మరి నేను వెళ్ళిరానా సార్"

    "అదేమిటి..ఏదో ఒకటి తీసుకోకుండానే" అంటూ లూసీ వైపు చూసాడు.

    "వాట్ నౌ" అంది లూసీ.

    ఒక్కక్షణం ఆలోచించి "ఆల్ రైట్...నీ యిష్టం లూసీ. మనం సాయంత్రం కలుస్తున్నాం"అన్నాడు.

    మరో రెండు నిమిషాల్లో లూసీ వెళ్ళిపోయింది. ఒక్కక్షణం ఛాంబర్ చిన్నబోయినట్టు అనిపించింది. లూసీ శరీరం తాలూకూ పరిమళం ఆ ఏ.సి. ఛాంబర్ ని ఆక్రమించిన ఫీలింగ్. లూసీ అంటే తనకెందుకింత యిష్టం? లూసీ ఫీలింగ్స్ ఎందుకు తననిలా హంట్ చేస్తున్నాయి?

    *           *             *

  • Prev
  • Next