TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
నవ్వులే నవ్వులు -13
జీవితపు లంచం
“భాస్కర్ మా ఆఫీసులో ఏ పని కావలసినా పైసా లంచం
ఇవ్వకుండా చేయించుకుంటాడు.”చెప్పాడు మురళి.
“అవునా ?”నమ్మనట్టుగా అడిగాడు ప్రసాద్.
“అవును...ఆయన మా ఆఫీసుకి జీవితపు లంచం
కట్టాడులే "అని పకపక నవ్వాడు మురళి.
అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు ప్రసాద్.
మా కుక్క గొప్పదనం
“మీ కుక్క గొప్పదనమేమిటి ?”అడిగాడు చంద్రం.
“ఆ కుక్క వీధి కుక్కలా ఎవరినిపడితే వారిని కరవదు.బాగా
తెలిసినవారినే కరుస్తుంది "అని గబుక్కున
నాలిక్కరుచుకున్నాడు గోవిందం.
మహారాజు -దొంగోడి వేషం
“ఇకపై దొంగవేషంలో నగర సంచారానికి వెళ్ళను"మంత్రితో
అన్నాడు మహారాజు.
“అదేం ప్రభూ ?”తెలియనట్టుగా అడిగాడు మంత్రి.
“అలా వెళ్ళినప్పుడల్లా మన రక్షకభటులకి మామూళ్ళు
ఇచ్చుకోలేక పోతున్నాను కాబట్టి "అని మహారాజు చెప్పగానే వాపోయి నోరు తెరిచాడు
మంత్రి.
జాతీయాభిమానం కలిగిన అల్లుడు
“మన అల్లుడికి జాతీయాభిమానం ఎక్కువోయ్ ?”భార్యతో అన్నాడు భర్త.
“ఎలా చెప్పగలరు ?”అమాయకంగా అడిగింది భార్య.
“ఎలా ఏమిటే పిచ్చిదానా.దసరా,సంక్రాంతులకే కాకుండా
ఆగస్టు 15,జనవరి 26లకి కూడా కొత్త బట్టలు
పెట్టించుకుంటాడు కదా?”అని పకపక నవ్వాడు భర్త.
క్యాలెండర్
“నవమాసాలు మోస్తున్నందుకే ఇంత
మధనపడుతున్నావు.దానిని చూసి బుద్ధితెచ్చుకో.
పన్నెండు నెలలు కష్టమన్నది లేకుండా మోస్తున్నది ?”
భార్య మీద అరిచాడు భర్త.
“ఇంతకీ ఎవరండి అది ?”అమాయకంగా అడిగింది భార్య.
“ఇంకెవరు క్యాలెండరే "అని చెప్పి పకపక నవ్వాడు భర్త.
“ఆ..”ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.
|