Aahanagar Colony - 26

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

26 వ భాగం

"ఏయ్.....డాళింగ్." ఏంటి డియర్. 'ఈ రోజు నువ్వెంత అందంగా వున్నావో తెలుసా?" 'నిజ్జం'

'నిజ్జ'

'ఎందుకంత అందంగా వున్నానో చెప్పుకోండి చూద్దాం' ఆమె వూరిస్తూ అడిగింది.

"ఎందుకని అడిగితే....నేనేమో....బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి చేసి గడ్డం మీసాలు పెంచుకున్నాను. అప్పుడేమో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై..... 'సుబ్బారావూ....ఏమీ నీ కోరిక' అని అడిగాడు. వెంటనే నేను సిగ్గుతో మెలికలు తిరిగి నాకో అందమైన అమ్మాయి భార్యగా దొరకాలి....' అన్నాను.

'బ్రహ్మదేవుడు కాసింతసేపు ఆలోచించి, రాగాలు....అనే అమ్మాయి అందంగా వుంటుంది. ...ఆమెను నీకు అనుగ్రహిస్తున్నాను. పో...' అన్నాడు. కట్ చేస్తే.... నువ్వు నా భార్యవి అయ్యావు. అన్నాడు ఆమె ఎత్తయిన గుండెల వంక ఆశగా చూస్తూ. అతని నరాలు జివ్వుమంటున్నాయి. కోరికతో రగిలిపోతున్నాడు. రాగాలు అందంగా వుంటుంది. అంతకన్నా అందంగా బుగ్గలు సొట్టలు పడేలా నవ్వుతుంది. పైగా పడక మీద చాలా విద్యలు తెలుసు. అతనికి ఇష్టమైనట్టు నడుచుకుంటుంది. తన చెప్పు చేతల్లో భర్తని వుంచుకుంటుంది.

"సుబ్రాప్ డియర్...' గోముగా పిలిచింది. 'చెప్పు రాగాలు డాళింగ్.'

"ఈ వారంలో ఇది ఏడోసారి ' అంది "అవునా...ఫ్ప్....ఇది పద్నాలుగోసారి అయితే బావుండు" అన్నాడు నిష్పుహగా నిట్టూరుస్తూ. 'టాక్స్ కట్టలేక చావాలి' అంది రాగాలు. 'అవునవును. ఈ సెక్స్ బాక్స్ ఎవడు కనిపెట్టాడో....' బాధ ధ్వనించింది.

సుబ్రాప్ గొంతులో. "పోయిన వారం ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొన్నారంటే రెండుసార్లే...అని చెప్పాను. ఈవారం కూడా అలాగే చెప్పింది. అంది రాగాలు.

"అలాగే...సడన్ గా ఎవడైనా చెక్ చేస్తాడేమోనని హడలి ఛస్తున్నా...మూడంతాపోతుంది. ఈ ఆలోచనలతో" అన్నాడు సుభ్రావ్. తన మీదికి లాక్కుంది రాగాలు సుబ్రావ్ ని మాట్లాడనీయకుండా.

* * *

మంకీ క్యాప్ పెట్టుకున్న శాల్తీ, ఓ ఇంటి ముందు ఆగి, తనని ఎవరూ చూడ్డంలేదని నిర్దారణ చేసుకొని ఆ ఇంటి బెడ్రూమ్ వైపు నడిచాడు మెల్లిగా శబ్దం చేయకుండా బెడ్రూం లోకి తొంగి చూసాడు. భార్య భర్తలిద్దరూ చెరోవైపు తిరిగి పడుకున్నారు. వెంటనే జేబులో నుంచి ఓ చిన్న పుస్తకం తీసి, దాంట్లో ఏదో రాసుకొని, ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి.

మరో ఇంటివైపు నడిచాడు. ఆ ఇంట్లో కూడా మొగుడూ, పెళ్ళాలు డిటో డిటో...కాకపోతే మధ్యలో పిల్లలున్నారు. మళ్ళీ జేబులో వున్న చిన్న పుస్తకంలో ఏదో బరాబర గికేసి, మరో ఇంటివైపు నడిచాడు. సాకేత్ కు పిచ్చెక్కిపోయింది.

అలా ప్రతీ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ బెడ్రూమ్ ల్లోకి తొంగి చూడ్డం...ఏదో రాసుకోవడం ఆ మంకీ క్యాప్ శాల్తీ చేస్తూనే ఉన్నాడు. సాకేత్ కు అనుమానం, క్యూరియసిటీ రెండూ పెరిగాయి. ఇతడేమైనా సెక్స్ మానియాకా? పరాయి వాళ్ల బెద్రూమ్స్ లోకి తొంగి చూడ్డం, ఒక విధమైన మానసిక జబ్బు అని ఎక్కడో చదివినట్టు గుర్తు.

ఈ శాల్తీ కూడా అలాంటి బాపతా? అర్దరాత్రి ఒంటి గంట అవుతుండగా.....మంకీ క్యాపు శాల్తీ. రోడ్డు పక్కనే ఉన్న ఓ సిమెంట్ బెంచి మీద కూలబడి రిలాక్సయ్యాడు. అప్పుడు ఇంటరయ్యాడు డైరెక్ట్ గా సాకేత్.

"హలో....మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటూ. ఆ మంకీ క్యాప్ శాల్తి ఉలిక్కిపడి, బెదిరిపోయి. తన మంకీ క్యాప్ ని ఓ సారి సవరించుకొని, సాకేత్ వైపు చూసి..... 'మీ...రు...' 'నేను ఎవర్ని? నేనెందుకు నిన్ను ఫాలో అవుతున్నానో డిటెయిల్స్ చెబుతాను గాని....నువ్వేంటి? సిగ్గూ ఎగ్గూ లేకుండా పరాయి వాళ్ల పడగ్గదుల్లోకి తొంగి చూస్తున్నావు. అదృష్టం బావుంది అందరూ బుద్ధిగా పడుకున్నారు.

అలాకాక, వాళ్లు రసవత్తర దృశ్యాల్లో కనిపిస్తే గుండాగి చచ్చేవాడివి' అన్నాడు మంకీ క్యాప్ శాల్తీ పక్కనే కూచుంటూ.

"నా డ్యూటినే అది" చెప్పాడు మంకీ శాల్తి.

'ఏంటి? అర్ధరాత్రి, పరాయివాళ్ల పడగద్దుల్లోకి తొంగి చూడ్డమా?"

"అవును..."

'అవునా....! ఆ మాట చెప్పడానికి సిగ్గులేదూ.'

'లేదు....దాని కజిన్ ఎగ్గు కూడా లేదు. తాపీగా అన్నాడు శాల్తీ.

'ఛీ....' అన్నాడు సాకేత్ ఎహ్యంగా మొహం పెట్టి.

'నేను అనగలను ఛీ...ఛీ...అని రెండు సార్లు...' అన్నాడు మంకీ శాల్తీ.

'ఏది...అనుచూద్దాం' కోపంగా అన్నాడు సాకేత్.

"నేనేం అంత బుద్ధి తక్కువ వెధవని కాదు." అంటూ మంకీ క్యాప్ తీసాడు.

'నువ్వు....ను...వ్వు...? నువ్వు హమ్ ఆప్కే హైకౌన్...మల్లిఖార్జునరావువి కదూ...'

'అవును...మీరు...ఆ గుర్తొచ్చింది. ఆరోజు రిక్షా....'

'ఆ....అవునవును....' అన్నాడు సాకేత్.

"మీరేంటి సార్...ఇక్కడ....అర్ధరాత్రి వేళ....'

'నా సంగతి తర్వాత చెబుతాను గానీ,....నువ్వేంటి....ఈ డ్యూటీ ఏమిటి?"

'ఇది నా పార్ట్ టైం జాబ్ సార్.'

'పార్ట్ టైమ్ జాబా? ఏంటీ...పడగ్గదుల్లోకి తొంగి చూడ్డమే.'

'నేను పడగ్గదుల్లోకి తొంగి చూసేది వాళ్ళు ఏం చేసుకుంటున్నారు....ఎలా చేసుకుంటున్నారని కాదు....దంపతులు సెక్స్ చేసుకుంటున్నారా? లేదా? కన్ ఫార్మ్ చేసుకోవడానికి. 'ఛీ...యాక్...అదేంటి....వాళ్లు ఏం చేసుకుంటే, మీకెందుకు?' 'సెక్స్ టాక్స్ వేయడానికి.'

'సెక్స్ టాక్సా.'

"అవును సార్.....'

'అదేంటి.'

'విచిత్రనగర్ కాలనీలో ఆరేళ్ళ క్రితం వంద ఇళ్లు....వెయ్యి మందికి మించి జనాభా వుండేది కాదు. కానీ, పోనూ పోనూ ఇక్కడ ఇళ్ల సంఖ్య, జనాభా పెరిగిపోయింది. ఎవర్నీ ఈ కాలనీలోకి రావద్దని శాసించలేము. ఇక్కడ ఇళ్లు చౌక, హోటళ్లలో రెట్లు తక్కువ. ప్రశాంతంగా వుంటుంది. కుళ్లు వుండదు. కుతంత్రాలూ వుండవు.

కాకపోతే, ఇక్కడ మనుష్యులు రకరకాల మనస్తత్వాలు వున్న వాళ్లు. ఇప్పుడు విచిత్రనగర్ కాలనీలో జనాభా విపరీతంగా పెరిగింది. ఓ పక్క కుటుంబ నియంత్రణ అంటూ ఎంత చెప్పినా, పిల్లలు పుడుతూనే వున్నారు.

ఈ విచిత్రనగర్ కాలనీలో మాత్రం జనాభా ఎక్కువ పెరగకుండా వుండేందుకు సెక్స్ టాక్స్ విధించింది. ఇంటింటికి తిరిగి ఇంట్లోని దంపతులు వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొన్నామని అబద్ధాలు చెబుతారు. అందుకే అప్పుడప్పుడు ఇలా చెకింగ్ చేయడానికి మా లాంటి వాళ్ళను పార్ట్ టైమర్స గా నియమించారు.'

'ఆశ్చర్యపోవడం సాకేత్ వంతయింది.

"అవును సార్...ఈ టాక్స్ ఎమౌంట్ ని విచిత్రనగర్ కాలనీ అభివృద్ధికి వినియోగిస్తారు. అంతే కాదు, విచిత్రనగర్ కాలనీలోని వాళ్ళను ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతే ఫ్రీ మెడికల్ ఎసిస్టెన్స్ కలుగజేస్తారు." మల్లికార్జునరావు చెప్పుకుపోతున్నాడు.

కొన్నాళ్ళ క్రితం ఓ ఇంగ్లీషు మ్యాగజైన్ లో చదివిన విషయం గుర్తొచ్చింది సాకేత్ కు. "ఐలాండ్ ద్వీపంలో జనాభా పెరుగుదల అధికం కావడంతో అక్కడి అధికారులు ఇంటింటికి తిరిగి వారానికి ఆ దంపతులు సెక్స్ లో ఎన్ని సార్లు పాల్గొంటారో తెలుసుకొని అన్ని డాలర్లు పన్ను విధించడం మొదలుపెట్టారు.'

'దీంతో కొంతమంది దంపతులు ఎక్కువసార్లు పాల్గొని తక్కువసార్లు పాల్గొన్నామని తెలివిగా చెప్పడంతో మళ్ళీ తలలు బద్దలు కొట్టుకున్న్నారు..... ఆ తర్వాత ఆ ఐలాండ్ ద్వీపవాసులకు ఆ సమస్యకు పరిష్కారం దొరికిందో లేదో, తెలియదు కానీ, విచిత్రనగర్ కాలనీ వాళ్లు "ఎన్నుకున్న" మార్గం బాగానే అనిపించింది సాకేత్ కు.

'సార్......' మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు.' మల్లిఖార్జునరావు మాటలతో ఆలోచనల్లో నుంచి బయటపడి.... 'వెరీగుడ్....మీ ప్రయత్నం చాలా మంచిది. మిమ్మల్ని చూస్తుంటే గౌరవభావం మరింత ఎక్కువవుతోంది.' మనస్పూర్తిగా అన్నాడు సాకేత్.

"థ్యాంక్యూ సార్...బైదిబై. మీకు పెళ్ళయిందా?" అడిగాడు మల్లిఖార్జునరావు.

'లేదు.' అన్నాడు సిగ్గుపడుతూ సాకేత్.

"పెళ్ళయ్యాక...రోజుకు 'అది' ఎన్నిసార్లు చేసుకుంటారో సిన్సియర్ గా చెప్పండి"

అన్నాడు.

సిగ్గుపడుతూ 'అలాగే' అన్నాడు సాకేత్.