ఆహనగర్ కాలనీ - 23

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

23 వ భాగం

"రాంబో సారూ.....దిగండి" అన్నాడు చెమట్లు కక్కుతూ పాతాళభైరవి.

"దిగలా....ఎందుకో నీ రిక్షాలో ఎక్కాక దిగాలని అనిపించడం లేదయ్యా....హాయిగా నిద్రపట్టింది" అన్నాడు రిక్షా దిగి రాంబో.

'తమరు అడవి దున్నలా మహాచెడ్డ నిద్రపోయారండి. తొక్కలేక చాచ్చానండీ' కాళ్ళు పీకాయండి " అన్నాడు రిక్షా దిగి రాంబో.

'తమరు అడవి దున్నలా మహాచెడ్డ నిద్రపోయారండి చాచ్చానండీ' కాళ్ళు పీకాయండి" అన్నాడు పాతాళభైరవి.

'చాలా థాంక్సోయ్' అని అతని భుజం తట్టి ముందుకు కదిలాడు.

"సారూ....డబ్బులు" 'ఇవ్వక తప్పదంటావా.'

"తప్పదండీ." 'అయితే ఇదిగో' అంటూ రివాల్వర్ ని పాతాళభైరవి డొక్కకు గురిపెట్టాడు.

'నొక్కమంటావా?" అడిగాడు.

'కీచు గొంతుతో అరిచి' హయ్యబాబోయ్ ఇదేమిటండీ.'

'రివాల్వర్...నా పేరేంటో తెలుసా....రాంబో, రివాల్వర్ రాంబో.'

'ఇప్పుడేంటి చేస్తారండీ.

'ఏమీ చేయను నేను రిక్షా ఎక్కి తొంగుటాను. నేను లేచేవరకు రిక్షా తొక్కుతూనే ఉండు. నేను కళ్ళు తెరిచేసరికి, నీ రిక్షా ఆగి ఉందా? మటాష్. ఈ రివాల్వర్ లోని తూటా నీ గుండెల్లో నుంచి దూసుకుపోతుంది. అర్ధమైందా' రివాల్వర్ రాంబో అన్నాడు.

'అర్థమైంది' 'అనవసరంగా రిక్షా డబ్బులడిగి ఇరుక్కుపోయానని తనని తాను తిట్టుకొని రిక్షా తొక్కసాగాడు పాతాళభైరవి.

* * *

హెడ్ కానిస్టేబుల్ సూరిబాబు కళ్ళకు గంతలు కట్టుకొని, ఆ ఇంట్లో ఎంటరయ్యాడు. సరిగ్గా అప్పుడే సాకేత్ తాడు సాయంతో మేడ పై నుంచి కిందికి దిగాడు.

కళ్ళకు గంతలతో ఆ ఇంట్లోకి అడుగుపెడుతున్న సూరిబాబును చూసి ఏదో డౌటొచ్చి 'హలో' అన్నాడు సాకేత్. సూరిబాబు చెవులు రిక్కించి 'ఎవరూ' అన్నాడు.

"నా పేరు సాకేత్. ఈ మేడ పైన పై పోర్షన్ లో ఉంటున్నాను. మీరేంటి కళ్ళకు గంతలు కట్టుకొని వస్తున్నారు."

'అయితే మీరు మా కో - టెనెంట్ అన్నమాట. కొత్తగా వచ్చారా తాడుతో పైకి ఎక్కడం, దిగడం ప్రాక్టీస్ అయిందా.' అడిగాడు కళ్ళకు గంతలు విప్పకుండానే.

"ఏం ప్రాక్టీసో ఏమో మొదటి నాలుగు రోజులు పొక్కలు, తరువాత కాయలు కాసాయి. అయినా ఈ ఇంటిగలావిడకు ఇదేం పోయే కాలమండి' అన్నాడు అక్కసుగా.

"ఇళ్ళ కొరత తీవ్రంగా ఉంది. అన్నట్టు జాగ్రత్త. ఎందుకైనా మంచిది రోజూ దేవుడికి దండం పెట్టుకో."

"అదేమిటండి ఎందుకలా?"

"ఎందుకంటే తాడు పుసుక్కున తెగకుండా నువ్వూ హరీష్ లా అవొద్దు."

"హరీష్....అతనెవరూ...అతనికేమైంది" ఆందోళనగా అడిగాడు సాకేత్.

"మరేం లేదు. హరీష్ అనే ఓ కుర్రాడు పైన మా పోర్షన్ పక్క గదిలో అద్దెకు ఉండేవాడు. నీకు లాగే తాడుతో ఎక్కడం దిగడం చేసేవాడు. ఓ రోజాలా ఎక్కుతుండగా ఇల్లు గలాయనికి విచిత్రమైన సందేహం వచ్చింది. తాడును కట్ చేస్తే అతను భూమి ఆకర్షణ శక్తి వల్ల కిందపడి చచ్చిపోయాడా.?"

"పోయినా బావుండేది."

"మరేమైంది?"

"నరాల వీక్నెస్ అయింది. లాభం లేదన్నారు డాక్టర్లు. ఎందుకైనా మంచిది. మీ జాగ్రత్తలో మీరుండండి" అన్నాడు సూరిబాబు.