Antera Bamardee

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

అంతేరా బామ్మర్దీ

ఆదివిష్ణు

భాగ్యనగరం! భాగ్యనగరం అనగానే ఆ నగరంలో బతికే వాళ్ళంతా భాగ్యవంతులు అనుకోవడం పొరబాటు. పేరుకే అది భాగ్యనగరం.కాని అది భాగ్యవంతులు మాత్రమే వుంటున్న నగరం కాదు.ఆ నగరానికి భాగ్యనగరమని పేరొచ్చిన కారణం వేరేవుంది.అది ఈ కథకి అప్రస్తుతం.

భాగ్యనగరంలో ఉంటున్న భాగ్యవంతులలో బసవరాజు ఒకరు.చెప్పుకో తగ్గ పారిశ్రామిక వేత్త. బసవరాజు టైర్స్,బసవరాజు ట్యూబ్స్,బసవరాజు టైర్సండ్ ట్యూబ్స్ కి రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి గిరాకీ వుంది. ఆ గిరాకీ ప్రభావంతో బసవరాజు చాలా బరువుగా వుంటాడు.

హైదరాబాద్ చివర్లో అతనికి ఒక అందమైన బంగళా వుంది.ఆ బంగాళా కూడా ఎంతో ఖరీదుగానూ మరెంతో అందంగాను వుంటుంది.చాలా విశాలంగా కూడా వుండి అబ్బో అనిపిస్తుంది.

ఆ ఉదయం...బసవరాజు తన గదిలో ముస్తాబు చేసుకుంటుండగా అతనికి పద్మ కాఫీ తెచ్చింది. పద్మను చూస్తూ బసవరాజు అన్నాడు.

“ఏమ్మా?కాఫీ నువ్వు తెచ్చేవే?మీ అత్తయ్య ఏం చేస్తోంది ? "అని.

పద్మ కాఫీ ఇస్తూ "అత్తగారు పూజలో వున్నారండీ "అని చెప్పింది.

బసవరాజు కాఫీ చప్పరించి అన్నాడు. “పతియే ప్రత్యక్ష దైవమన్నారు!ఈ పాతి దేవుణ్ణి గాలికి వదిలేసి ఏ రాతి దేవుణ్ణి కొలుస్తుందో"అని.

“అత్తమామలు కూడా దైవ స్వరూపులే కదా మామయ్యా గారూ"

“అవునమ్మా.సాక్షాత్తూ దేవుళ్లే.బాగా జ్ఞాపకం పెట్టుకో "

“అంచేత- ప్రతిరోజూ మీకు కాఫీ యిచ్చే అవకాశం నాకివ్వమని అత్తగారిని నేను కోరుకున్నానండి "అని పద్మ చెప్పింది. ఆ మాటకు బసవరాజు మురిసిపోయేడు.అలా మురిసిపోతూనే ఇలా అన్నాడు.

“సెభాష్...మీ నాన్నకంటె నువ్వే బెటరు.మంచీ మర్యాదా బాగా తెలిసిన పిల్లవి.కోడలంటే నీలాగా వుండాలి.అత్తమీద ఈగ వాలకుండా జాగ్రత్త పడుతున్నావ్.ఇప్పుడే కాదు ఇక ముందు కూడా నా కాఫీ ఏర్పాట్లు నువ్వే చూడు "అని.

సరిగ్గా అప్పుడే ఆ గదిలోకి డాక్టర్ మురళి వచ్చాడు.వచ్చి బసవరాజుతో అన్నాడు "హాస్పటల్ కి వేళయింది నాన్నా"అని.

“నీ హాస్పటల్ కి టైమైతే నాతో ఎందుకు చెప్పడం?నాకు చెప్పకుండానే వెళ్ళచ్చు "అన్నాడు బసవరాజు. డాక్టర్ మురళి పద్మతో అన్నాడు.

“ఒకసారి యిల్లా వస్తావా ?'అని.

“ఇప్పుడు ఆ పిల్లెందుకురా?నీ కారు డ్రైవ్ చేయాలా?”

“అలాంటిదే "అన్నాడు డాక్టర్ మురళి నసుగుతూ.

“నీ భార్యకి డ్రైవింగు రాదు "

“అల్లాంటిదే అన్నాను గానీ.డ్రైవ్ చేయమనలేదుగా " బసవరాజు పద్మతో విసుగ్గా అన్నాడు. “ఏంటమ్మా వీడు,నన్ను కన్ ఫ్యూజ్ చేస్తాదేమిటి?నన్నే యింత కన్ ఫ్యూజ్ చేసున్నవాడు నిన్ను నీళ్ళు కూడా తాగనివ్వడు కాబోలు!”అన్నాడు బసవరాజు.

“మనీ పర్సు అడుగుతున్నారండి "అంది పద్మ.

“ఓహో..మనీ పర్సా!అలాంటిదే అంటే మనీ పర్సన్నమాట.మంచి కోడే.అవునోరెయ్ మురళీ మనీ పర్సు నీ దగ్గరించుకోవా ?” అడిగాడు బసవరాజు.

“నా దగ్గర దాచుకుంటారండి "అంటూ పద్మ నసిగింది.

“వామ్మో..అదొకటుందా.అయితే వెళ్ళమ్మా.ఆ పర్సు పనేదో చూడు.మగాడి జేబులోపర్సు లేకపోతే పల్సు పనిచేయదని శాస్త్రం.వెళ్ళేళ్ళు "చెప్పాడు బసవరాజు.

పద్మ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది.మురళి కూడా వెళ్లబోయేడు.అతన్ని ఆపే ప్రయత్నంలో బసవరాజు అతన్ని పలకరించాడు.

“ఒరే మురళీ...కొంచం ఆగు "అన్నాడు.

మురళి ఆగిపోయేడు.

బసవరాజు మురళి దగ్గరికి వచ్చాడు.

“నీతో ఒక జీవిత సత్యం చెప్పాలనుకుంటున్నాను "అన్నాడు బసవరాజు.

(హాసం సౌజన్యంతో)