లెక్కల్లో పూర్
“మగ పెళ్ళివారు లెక్కల్లో మరీ పూర్ అనుకుంటా!” అంది కాంతం.
“ఎందుకనుకుంటున్నావు?” అడిగాడు కనకం.
“వాళ్ళ కోరికల లిస్ట్ లో ఓ క్యాలికులేటర్ కూడా ఉందిలే...” బదులిచ్చింది కాంతం.