Taruchugaa

ఒక పార్కులో ప్రేయసి ప్రియుడు మాట్లాడుకుంటున్నారు.

“ కృష్ణ నువ్వు తాగుతావా...?” అని అడిగింది నవ్య.

“ త్రాగను నవ్య " అని చెప్పాడు కృష్ణ.

“ మరి సిగరెట్లు కాల్చుస్తావా ?” అని అడిగింది నవ్య.

“ అసలు నాకు కాల్చడం అంటే ఏంటో తెలియదు నవ్య డార్లింగ్ " అని ముద్దుగా

చెప్పాడు కృష్ణ.

“ బ్లూ ఫిలిమ్స్ చూస్తావా ?” అని కొంచం సిగ్గు పడుతూ అడిగింది నవ్య.

“ అంటే ఏమిటి డార్లింగ్...అవి కుడా సినిమాలాగే ఉంటాయా " అని అమాయకంగా

అన్నాడు.

“ పేకాట ఆడుతావా ?”

“ అందులో నాకు ఓనమాలు కూడా తెలియవు "

“ అంటే..నీకు ఒక్క వ్యసనం కూడా లేదన్నమాట "

“ ఎందుకు లేదు డియర్...తరుచుగా అబద్ధాలు చెబుతుంటాను " అని గబుక్కున

నాలిక్కరుచుకున్నాడు కృష్ణ.