TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆహా నగర్ కాలనీ
సూరేపల్లి విజయ
13 వ భాగం
"ఎవరమ్మా....అంతసేపు బయట నిల్చోబెట్టి మాట్లాడావు?" అడిగింది లోపలికి వచ్చిన తల్లిని నమ్రత.
పై పోర్షన్ లో అద్దెకు దిగడానికి వచ్చాడని చెప్పింది.
"అద్దేకోసం వచ్చాడా....బ్యాచిలరా?" అడిగింది నమ్రత ఉత్సాహంగా.
"కాదు డిబాచిలర్" అంది కోపంగా చారుమతి.
"అలా అనకే బ్యాడ్ మీనింగొస్తుంది" చెప్పింది తల్లితో.
"ఏ మీనింగొస్తే నాకేంటి...లేకపోతే వయసులో ఉన్న ఆడపిల్లవి అలా అడగొచ్చా."
"అమ్మా....." తలబాదుకుంది.
"నీకి చాదస్తం ఏంటే...మగాళ్ళవంక కూడా చూడనీయవు. ఇలా అయితే నా కలల హీరోని నేనెట్టా పెళ్ళి చేసుకోవాలి."
"హు...ఈ ఇంట్లో ఒక్కొక్కరిది ఒక్కో టైప్."
"నువ్వు ఎన్నయినా చెప్పు...నీ పెళ్ళి మాఅన్నయ్య కొడుకు రాంపండుతోనే" అంది తన నిర్ణయమే ఫైనల్ అన్నట్టు.
"ఏదీ....ఎప్పుడూ చీమిడి ముక్కుతో ఉంటాడే...అతనితోనా. ఛీ....వాక్....?" అంది నమ్రత.
"నువ్వు వాంతులు చేసుకున్నా తల బాదుకున్నా నీ పెళ్ళి రాంపండుతోనే అంది చారుమతి.
"రోడ్డుమీద ముష్టెత్తుకునే సన్యాసి వెదవకి అయినా ఇచ్చి చేస్తాగాని, మీ అన్నయ్య కొడుక్కి మాత్రం ఛస్తే పెళ్ళి చెయ్యను" ఎప్పుడొచ్చాడో భార్య మాటలకు రియాక్టయి అన్నాడు సైంటిస్ట్ సియస్సార్.
"ఆ పంతానికే మీరొస్తే అంత కన్నా అడ్డమైన సన్నాసికైనా ఇస్తాను గాని, మీరు చూసిన వాడిని ఛస్తే నా కూతురిని కట్టబెట్టను" అంది చారుమతి.
"నీకు నచ్చిన వాడు పురుగులు పడి చావ"
"నీకు నచ్చిన వాడు ఎయిడ్స్ తో పోను" తిట్ల దండకం మొదలు పెట్టారిద్దరూ.
"అమ్మా - నాన్నా" గట్టిగా కేకవేసింది నమ్రత.
"మీరిద్దరూ నాకోసం పోట్లాడుకుంటున్నారా? ఏదో సరదాగా మొగుడు పెళ్ళాలం గదా....పోట్లాడుకోకపోతే ఏం బావుంటుందని పోట్లాడుకుంటున్నారా" కోపంగా అడిగింది.
"అదేమిటే అంతమాటనేసావ్" అంది చారుమతి.
"లేకపోతే మీరిద్దరూ కలిసి, నాక్కాబోయే మొగుడ్ని ఇన్నేసి తిట్లు తిడతారా?" మీరిద్దరూ ఏడేడు జన్మలకు కూడా ఇలానే మొగుడూ, పెళ్ళాలయి తన్నుకు చావ" అంది కసిగా తన గదిలోకి వెళ్తూ.
"హు...వచ్చే జన్మలో కూడా ఈ శనిమొహమేనా" అంటూ తన ల్యాబ్ లోకి వెళ్లాడు సియస్సార్.
"ఇంతోడి మొగుడు మళ్ళీ జన్మలో కూడానా" అని మూతి ముప్పయి ఆరు వంకర్లు తిప్పి వంటగదిలోకి వెళ్ళింది చారుమతి.
* * *
వియస్ కాలని పోలీస్ స్టేషన్ ముందు పోలీసు జీపు ఆగింది. ఇన్ స్పెక్టర్ షేర్ ఖాన్ దిగి, స్టేషన్ లోపలికి నడిచాడు. స్టేషన్ గోడల చుట్టూ ఉన్న దేవుళ్ళు పటాలకు వరుసగా మొక్కుతూ వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ ని చూడగానే హెడ్ కానిస్టేబుల్ సూరిబాబు, మిగతా కానిస్టేబుళ్ళు అటెన్షన్ లోకి వచ్చి సెల్యూట్ చేశారు. లోపలికి రాగానే లాకప్ లో ఉన్న ఓ నిందితుడిని చూసి, అటువైపు వెళ్ళి "మీరెవరండి" అని అడిగాడు షేర్ ఖాన్.
"సినిమా హాలు దగ్గర జేబులు కొడుతుంటే మన కానిస్టేబుల్ కనకారావు పట్టుకున్నాడ్సార్."
"మీరు...మీరు జేబులు కొట్టారా? మీ పేరు ఏమిటి సార్? అడిగాడు షేర్ ఖాన్. ఇన్ స్పెక్టర్ తనని ఆటపట్టిస్తున్నాడేమోనన్న అనుమానం కలిగింది. పైగా తనని మీరు...మీరు అని పదే పదే అనడమేమిటి? అనుకున్నాడు నిందితుడు.
"చెప్పండి సార్...మీరెందుకు దొంగతనం చేసారు.?"
"నేను దొంగతనం చేయలేదు" వెంటనే ధీమాగా అన్నాడు.
"కోఠి బస్టాండ్ లో జేబులు కొడుతూ, పోలీసుల వెంటపడ్డంతో పారిపోయి ఆహానగర్ కాలనీలోకి వచ్చాడు. థియేటర్ దగ్గర జేబు కత్తిరించబోయి దొరికిపోయాడు" చెప్పాడు కానిస్టేబుల్.
"తప్పులు ఎవరైనా చేస్తారు. ఆ తప్పులు సరిదిద్దుకునే వాళ్ళే ఉత్తములు." ఇన్ స్పెక్టర్ లో మెతకదనం అర్దమైంది. తను దొంగతనం చేయలేదని దబాయిస్తేసరి. అనుకున్నాడు.
"చెప్పండి...దొంగతనం ఎందుకు చేసారు?"
"నేను దొంగతనం చేయలేద్సార్. మీ పోలీసులు నన్ను నిర్దాక్షిణ్యంగా పట్టుకున్నారు" అన్నాడు.
"తప్పు, అబద్దం చెప్పడం తప్పు." అన్నాడు ప్రశాంతంగా షేర్ ఖాన్.
"దేవుళ్ళ మీద ఒట్టువేసి చెబుతున్నాను సార్."
"అదిగో.....అది మరీ తప్పు. చెంపలు వేసుకో."
"హెడ్ గారూ....లాకప్ ఓపెన్ చేయండి." అన్నాడు షేర్ ఖాన్.
సూరి బాబు లాకప్ ఓపెన్ చేసాడు.
|