అబద్ధం

 

అబద్ధం

 

 

సీతయ్య వయసు డెబ్భై రెండేళ్ళు. ఈమధ్యనే ఓ కుర్రపిల్లని పెళ్ళి కూడా చేసుకున్నాడు. అది చాలామందికి మింగుడు పడలేదు. ముఖ్యంగా సీతయ్య స్నేహితుడు వీరయ్యకి చాలా ఈర్ష్యగా ఉంది.

“అంత కుర్రపిల్ల ఎలా పడిందిరా?” అన్నాడు.

“నా అందం చూసి” నవ్వాడు సీతయ్య.

“అబ్బో, నాకు మాత్రం లేదేంటి ఆపాటి అందం?”

“తరగని ఆస్తి కూడా ఉందిగా”

“నాకూ ఉందిగా.. ఇంతకీ అసలు కిటుకేంటో చెప్పరా బాబూ”

“తొంభయ్యారేళ్లని అబద్ధం చెప్పానులే” నవ్వాడు సీతయ్య.

బుగ్గలు నొక్కుకున్నాడు వీరయ్య.