TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Teacher and Student Jokes in Telugu
గురునాధం గారు పద్యాలు పాడుతూ పిల్లలకు వినిపిస్తుండగా, అప్పుడు కిరణ్ అనే
స్టూడెంట్ క్లాస్ రూము దగ్గరికి వచ్చి " సార్...నేను లోపలికి రావొచ్చ సార్ "
అని అడుగుతాడు.
పద్యం పాడడం ఆపిన గురునాధం, తన సోడాబుడ్డి అద్దాలోంచి కిరణ్ ను చూసి
" ఓరేయ్ కిరణ్...ఎందుకురా ప్రతి రోజు ఇలా బడికి ఆలస్యంగా వస్తావు " అని అడిగాడు.
" ఇంటి దగ్గర తొందరగానే బయలుదేరుతాను సార్ ! దారి మధ్యలో ఒక మలుపు దగ్గర
ఒక బోర్డు కనిపిస్తుంది సార్...దాంతో ఆలస్యం అవుతుంది సార్ "
అని వినయంగా చెప్పాడు కిరణ్.
" ఏం బోర్డది ?" అని అడిగాడు గురునాధం.
" స్కూల్ ఉంది నెమ్మదిగా వెళ్ళు అని సార్ " అని చెప్పాడు కిరణ్.
" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు గురునాధం.
******************************
పాఠం చెప్పటం అయిపోయిన తరువాత " మాధవి....ఇప్పుడు నిన్ను కష్టమైన ప్రశ్న
ఒకే ఒకటి అడగనా...? లేక సులభమైన ప్రశ్నలు రెండు మూడు అడగనా...." అని
మాధవివి చూస్తూ అడిగింది టీచర్ సరోజ.
లేచి నిలబడిన మాధవి, కాస్త ఆలోచించి " కష్టమైన ప్రశ్న ఒక్కటే అడగండి మేడం "
అని చెప్పింది.
" మన ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి ఎవరో చెప్పు ?" అని అడిగింది టీచర్ సరోజ.
" నీలం సంజీవరెడ్డి మేడం " అని చెప్పింది మాధవి.
" అంతా ఖచ్చితంగా ఎలా చెప్పగలవు " అని మళ్ళీ అడిగింది టీచర్ సరోజ.
" ఒక ప్రశ్న అయిపొయింది మేడం " అని కూర్చుంది మాధవి.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది టీచర్ సరోజ.
*************************
" ఓరేయ్ సాగర్....ఏనుగు పెద్దదా....చీమ పెద్దదా...?" అని సాగర్ అనే స్టూడెంట్ ను
అడిగాడు తెలుగు టీచర్ రామానందం.
" ఆ రెండింటివి పుట్టిన రోజులు చెప్తే, అప్పుడు ఏది పెద్దదో చెప్తాను సార్ " అని తెలివిగా
పకపక నవ్వాడు సాగర్.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు తెలుగు టీచర్ రామానందంగారు.
******************
" రవి....తాజ్ మహల్ నిర్మించింది ఎవరో చెప్పు ?" అని అడిగింది టీచర్.
రవి గబుక్కున లేచి నిలబడి " డి. రామానాయుడు గారు సార్ " అని చెప్పాడు.
" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది టీచర్.
పకపక నవ్వారు మిగితా పిల్లలు.
|