మై డియర్ రోమియో - 11

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 11

 

స్వప్న కంఠంనేని

 

పబ్లిక్ గార్డెన్స్.
ఉదయం టైం సరిగ్గా ఎనిమిదయ్యింది.
వైభవ్ గేటు దగ్గర నిలబడి వున్నాడు.
అతనక్కడికి అప్పుడే వచ్చాడు.
ఇంతలో సుదేష్ట సురేష్ లు ఆటో దిగారు.
సుదేష్టని చూడగానే వైభవ్ మొహం కందిపోయింది.
వైభవ్ సురేష్ ని పట్టించుకోకుండా సుధేష్ణతో న్నాడు.
"చూడు సుధేష్ణా! నువ్వు నాకు చెల్లెలిలాంటి దానివి. నువ్వలా నాకు ఫోన్ చేయడం బాగాలేదు''
"నేను నీకు ఫోన్ చేశానా? నువ్వేకదా నాకు ఫోన్ చేశావు''
"నేనా?'' స్టనయ్యాడు వైభవ్.
"ఆగండాగండి. నాకో ఆలోచన వస్తోంది. కావాలనే మీకిద్దరికీ ఎవరో ఫోన్ చేసి వుండొచ్చుగదా'' అన్నాడు సురేష్.
వాళ్ళిద్దరికీ కూడా అది నిజమేననిపించింది.
"అంతేనంటావా?''
"అంటే! అంతేకాదు. ఫోన్ చేసింది హనితే అయ్యుంటుంది. ఎందుకంటే మిమిక్రీ చేయడం వచ్చింది ఆమెకొక్కదానికే మన క్లాస్ లో. అలాగే ప్రాక్టికల్ జోక్స్ వేయడం కూడా ఆమెకలవాటు కదా'' అన్నాడు సురేష్.
"నిజమే. ఆమే చేసి ఉంటుంది. హనితనెప్పుడో నేను చంపేస్తాను'' రోషంగా అన్నాడు వైభవ్.
"బైదిబై సుధేష్ణ నా ఫియాన్సీ'' అన్నాడు సురేష్.
"అవునా?'' ఆశ్చర్యంగా అన్నాడు వైభవ్.
"ఎస్! సుధేష్ణ వాళ్ళ ఫాదర్, మా నాన్నగారు బిజినెస్ పార్టనర్స్. మా పెళ్లి చిన్నప్పుడు నిశ్చయం చేశారు. ఆఫ్ కోర్స్, ఈ సంగతి మన క్లాస్ లో ఇంకా ఎవరికీ తెలియదనుకో. నువ్వు సుధేష్ణని అపార్థం చేసుకుంటావని చెప్తున్నాను'' అన్నాడు సురేష్.
"నో! నో! అలాంటిదేమీ లేదు'' అన్నాడు వైభవ్.
"హనితకి మాత్రం మనం తప్పనిసరిగా బుద్ధిచెప్పాలి. మధ్యలో నన్ను కూడా లాగింది కదా!'' కోపంగా అంది సుధేష్ణ.
"అయితే ఏదయినా ప్లాన్ ఆలోచించండి'' ఉత్సాహంగా అన్నాడు వైభవ్.
"యురేకా! నాకో ప్లాన్ తట్టింది'' అరిచాడు సురేష్.
"ఏమిటది?'' ఆసక్తిగా ముందుకు వంగారు సుధేష్ణ, వైభవ్.
"ఎంతసేపు నిద్రపోతారు? లేవండి. కాలేజీ లేదా ఇవాళ?''
మర్నాడు ఉదయం పదింటికి గిరిజ నిద్ర లేపుతుంటే మెలకువ వచ్చింది మీనా, హనితలకి.
"టైమెంతయ్యింది మమ్మీ'' అడిగింది హనిత.
"పదయింది''
"అయ్యో!'' ఒక్కసారే అన్నారు మీనా, హనిత.
"ఎందుకు ఏమైంది?'' అనుమానంగా అంది గిరిజ.
"ఏం లేదాంటీ! ఈరోజు పొద్దునే లేచి సూర్య నమస్కారాలు చేద్దామనుకున్నాం కదా! అందుకని'' తడబడింది మీనా.
"సూర్యనమస్కారాలెందుకు?'' అడిగింది గిరిజ.
"ఆరోగ్యానికి మంచిదనీ'' దీర్ఘం తీసింది హనిత.
"ఏంటో? ఏమో?'' గొణుక్కుంటూ వెళ్ళిపోయింది గిరిజ.
"ప్చ్! మంచి అవకాశం మిస్సయ్యాం'' బాధగా అంది హనిత.
అప్పటికే దిండు నోట్లో కుక్కుకుని వలవలా ఏడుస్తోంది మీనా.
"ఏంటి? ఏమైంది?'' అడిగింది హనిత.
"ఇంత లేటయింది. ఇవాళ ఇక కాలేజీకి వెళ్ళడానికి కూడా లేదు. మనం వాళ్ళ ఫీలింగ్స్ కనిపెట్టి సంతోషిద్దామనుకున్నాం కదా. మళ్ళీ రేపటికైనా ఆ ఎఫెక్ట్ తగ్గిపోతుంది కదా'' ఏడుస్తూనే అంది మీనా.
"పోన్లేవే, బాధపడకు, మనకీ మంచిరోజులొస్తాయి'' శూన్యంలోకి చూస్తూ భారంగా డైలాగ్ చెప్పింది హనిత.
వెంటనే అలారం గోలగోలగా మోగడం మొదలెట్టింది.
మరుసటిరోజు.
మీనా, హనితలు కాలేజీలోకి అడుగుపెట్టారు.
మొన్నటి ఫోన్ ఎఫెక్ట్ ఎలా వుంటుందో తెలుసుకోవాలని మహా ఆత్రంగా వుంది వాళ్లకు. గబగబా క్లాస్ రూమ్ లో కెళ్ళారు.
ఎప్పుడూ వైభవ్ కూర్చునే ఫస్ట్ బెంచి వెనుక బెంచీలో కూర్చున్నారు. కాసేపటికి వైభవ్, సుధేష్ణలు చెట్టాపట్టాలేసుకుని వచ్చి ఫస్ట్ బెంచిలో కూర్చున్నారు.
వాళ్ళను చూసి హనితకి, మీనాకి నవ్వాగలేదు.
వాళ్ళెం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రిక్కించారు హనిత, మీనాలు.
వైభవ్ అన్నాడు సుధేష్ణతో "సుధేష్ణా! అందరూ నేనూ నిన్ను సుదేష్టా అని పిలవడం నాకేం నచ్చలేదు. ఇక నుంచి నిన్ను సుధా అని పిలుస్తాను. సరేనా?''
సుధేష్ణ ఏదో చెప్పబోయింది.
ఇంతలో వెనుకనుంచి హనిత కఠినంగా అంది.
"సుధ అనే ఏం ఖర్మ. ఉష్ణ అని కూడా పిలవొచ్చు. ఇంకా బాగుంటుంది.
మీనా కిందపడి గిలగిలా నవ్వసాగింది.