TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
మై డియర్ రోమియో - 8
స్వప్న కంఠంనేని
ప్రిన్సిపాల్ తో పాటు ఎవరో కొత్త వ్యక్తి వున్నాడు.
ప్రిన్సిపాల్ డయాస్ మీదకెక్కి క్లాసంతా కలియజూశాడు.
గొంతు సవ్ఫరించుకోబోతూ హనితని చూసి అప్రయత్నంగా బట్టతలా సవరించుకున్నాడు.
మరోసారి గొంతు సవరించుకుని ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు.
అంతలో క్లాస్ లోంచి ఎవరో అరిచారు.
"నోర్మూయ్ చెప్పుతీసుకుని కొడతా!''
ప్రిన్సిపాల్ కి ఇవన్నీ మామూలే
ఆ అరిచిన వాళ్ళను పట్టుకుని "ఎందుకలా అన్నావు?'' అంటే "మిమ్మల్ని కాదు సార్, పక్కసీటు పాండునన్నాను'' అంటూ కుంటిసాకులు చెబుతారని ఆయనకు తెలుసు.
అందుకే తనతోపాటు తీసుకొచ్చిన వ్యక్తిని పరిచయం చేస్తూ అన్నాడు.
"ఈయన నీకిప్పుడు డిమాన్ స్త్రేషన్ క్లాస్ తీసుకుంటారు. తర్వాత మీకు ఈయన టీచింగ్ నచ్చితే ఈయన్ని మీకు మేథ్స్ లెక్చరర్ గా అపాయింట్ చేస్తాం''
ఆ మాటలు చెప్పి ప్రిన్సిపాల్ బయటకు వెళ్ళిపోయాడు.
కొత్త లెక్చరర్ స్టూడెంట్స్ వైపు భయంగా చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.
కాసేపటికి భయం తగ్గి వీరబాదుడు బాదసాగాడు.
స్టూడెంట్స్ కి విసుగొచ్చి మాట్లాడుకోవడం, చుక్కలాట, బుక్ క్రికెట్ వర్డ్స్ బిల్డింగ్ ఆడుకోవడం మొదలుపెట్టారు.
ఆ లెక్చరర్ కి తిక్కరేగింది.
"సైలెన్స్'' దిక్కులు పిక్కటిల్లేట్లుగా అరిచాడు.
క్లాసంతా నిశ్శబ్దంగా అయింది.
అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు లెక్చరర్ సీరియస్ గా.
"చూడండి! మీ పేరెంట్స్ అంతా మిమ్మల్ని ఎంతో కస్టపడి చదివిస్తున్నారు. మా కాలంలో మేం చదువుకుందామన్నా చెప్పించే వాళ్ళు కాదు. ఎంతో మందికి లభించని చదువుకునే
అవకాశం లభించింది మీకు. వీడు మాకెందుకిలా నీతిబోధలు చేస్తున్నాడురా దేవుడా అని తిట్టుకోకండి. నేను చెప్పేది మీ మంచికే.''
హానిత లేచి నిలబడి సీరియస్ గా "నిజంగా ఇవాళ మీరు మా కళ్ళు తెరిపించారు సార్. మీ మేలు జన్మజన్మలకీ మర్చిపోలేము'' అని చెప్పి కూర్చుంది.
ఆ లెక్చరర్ కి వళ్ళు మండిందిగానీ చేసేది లేక మళ్ళీ లెసన్ లోకి వెళ్ళిపోయాడు.
స్టూడెంట్స్ మళ్ళీ గొడవ మొదలుపెట్టారు.
లెక్చరర్ చెప్పడం ఆపి సీరియస్ గా క్లాస్ వైపు చూసాడు.
హానిత విసుగ్గా అరిచింది "పోన్లెండి సార్. వాళ్ళ పాపాన వాళ్ళేపోతారు. మీరు కానీయండి''
హానిత మాటల్లో సాత్వికత వున్నా స్వరంలో కటువు, మోహంలో కోపమూ చూసి కొట్టేట్టుందని భయపడి అక్కడితో చెప్పడం ముగించాడు లెక్చరర్.
ఇక ప్రశ్నలడగటం మొదలుపెట్టాడు.
ముందు వైభవ్ ని లేపి అడిగాడు.
వైభవ్ సమాధానం చెప్పబోతుంటే "ఆ! ఆ! చాల్లే కూర్చో'' అని అరిచారు హానిత, రాజాలు.
ఇంసల్టింగ్ గా ఫీలయినా ఆన్సర్ చెప్పి కూర్చున్నాడు వైభవ్.
తర్వాత మీనాని ఏదో ప్రశ్న అడిగాడు లెక్చరర్.
మీనా లేచి నిలబడింది.
లెక్చరర్ వైపు చూస్తూ "చచ్చిపోవా ప్లీజ్'' అంది.
దడుచుకున్నాడు లెక్చరర్.
ఆమెకు తన ప్రశ్న అర్థం అయి ఉండదనుకుని మళ్ళీ రిపీట్ చేశాడు.
మీనా రెండు చేతులతో మొహం కప్పుకుని అంది "బాబోయ్ ఈయనేమిటి ఇలా అన్నీ నన్నే అడుగుతున్నారు. ఏంటి హనీ! ఇలా అన్నీ నన్నే అడగటం అంటే ఈయన ఉద్దేశ్యం
ఏమైవుంటుంది?''
"నెకెఉ లైనేస్తున్నాడేమో?'' చిలిపిగా అంది హానిత.
"అంతేనంటావా?'' సిగ్గుతో మెలికలు తిరిగిపోసాగింది మీనా.
లెక్చరర్ మీనా సిగ్గుచూసి భయపడి గబగబా క్లాస్ లోంచి పారిపోయాడు.
సంబరంగా నవ్వుకున్నారు హానిత. మీనాలు.
హానిత నవ్వుతూ పక్కకు తల తిప్పి చూసేసరికి తననే చూస్తున్న వ్ఫిభావ్ కనిపించాడు.
చట్తో సైగచేస్తూ "అటువైపు చూడు'' అని అరిచింది.;
వైభవ్ తప్పు చేసినవాడిలా గభాల్న తల దించుకుని కూర్చున్నాడు.
హనితతో అంది మీనా "ఎందుకు హనీ! ఎప్పుడూ ఆయన్నలా ఏదో ఒకటి అంటూనే వుంటావ్?''
వైభవ్ తన కోపాన్నంతా మీనా మీద వెళ్లగక్కుతూ అన్నాడు రోషంగా.
"ఆయనా లేదు, ఈయనా లేదు. ఇంకోసారి ఆయనా ఈయనా అన్నావంటే కాళ్ళు విరగ్గొడతాను, ఏమనుకుంటున్నావో?''
"కాళ్ళు విరగ్గొడతాడంటేవ్'' అంది హానిత.
"ఏది విరగ్గొట్టు చూద్దాం'' అంటూ మీదకెళ్ళింది మీనా.
వైభవ్ భయంగా అన్నాడు.
"అదిగో అలా దగ్గరకు రావద్దు. విరగ్గొడతానన్నాను కానీ ఇప్పుడు విరగ్గొడతాననలేదు కదా, రేపెప్పుడన్నా చూద్దాం. అయినా ఆడపిల్లలను కొట్టడం నాకలవాటు లేదు'
"ఈయనెప్పుడూ ఇంతే. నా మీద చేయి చేసుకోవడానికి మనసొప్పధనుకో హనీ'' అంది మీనా గారాలు పోతూ.
"అబ్బా'' ఇరిటేటింగ్ గా అరుస్తూ తల బాదుకున్నాడు వైభవ్.
|