సిల్లీ ఫెలో - 27

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 27

- మల్లిక్

 

"ఈ చిన్న చిన్నవి రేపు చూస్కోవచ్చుగా?" అన్నాడు మెల్లగా.

"భలేవాడివే ! చిన్న చిన్నవా? ఆలు ఇదే మెయిన్ షాపింగ్. మ్యాచింగ్ బ్లావుజూలూ, లంగాలూ, ఫాల్స్, దొరకడం ఎంత కష్టం అనుకున్నావు? అయినా నేను చెప్పడం ఏంటి... ఇప్పుడు నువ్వే చూస్తావుగా? నీకే తెలుస్తుంది. ఇప్పుడు కొంటే ఆ టైలర్ జాకెట్లు కుట్టి ఇచ్చేప్పటికీ, నేను అన్ని చీరాలకి ఫాల్స్ కుట్టేకునేసరికి మన పెళ్లిరోజు వచ్చేస్తుంది".

"అన్ని చీరలూ అంటావెం? నాలుగేగా? ఎన్ని రోజులు పద్తుందేమిటి? సిల్లీగా"

"భలేవాడివే... పెళ్ళికి ఈ నాలుగు చీరలేనంటావా? ఇవి సిల్కు చీరలు.

ఇంకా షిఫాన్స్ లో కొన్ని చీరలు తీస్కోవద్దు? సేఠ్ గుండు కొట్టీస్ లాల్ షాపులో షిఫాన్ శారీస్ బాగుంటాయి. అవి అక్కడ తీసుకుంటా"

"గుండు కొట్టీస్ లాల్? ఏంటో నువ్వు సెలక్టు చేసే షాపులన్నీ సిల్లిగా ఉంటున్నాయి" అన్నాడు బుచ్చిబాబు అయోమయంగా.

షాపుల పేర్లు సిల్లీగా వుంటేనేం... అందులోని చీరలు సిల్లీగా ఏం లేవుగా?

సరే... పద... మనం జాకెట్లు, లంగాలూ కొనుక్కుందాం"

"మనం కాదు. జాకెట్లు, లంగాలూ, నువ్వు కొనుక్కుంటున్నావు!" బుర్ర గోక్కుంటూ అన్నాడు బుచ్చిబాబు.

"ఏదో మాచింగ్ జాకెట్లు, లంగాలూ, ఫాల్స్ కొనడం అంటే అది చాలా సింపుల్ షాపింగ్ అని అనుకున్నాడు గానీ షాపింగ్ పూర్తయ్యేసరికి తను ఎంత పొరపాటు పడ్డాడో బుచ్సిబాబుకి అర్ధం అయ్యింది.

జాకెట్ కలర్, చీర కలర్ తో ఎంత బాగా మ్యాచ్ అయినా సీతకి మ్యాచ్ అయినట్టు అనిపించదు. ఫాల్సూ అంతే.

"అయినా చీర అడుగున ఉండే ఫాల్సూ కనబడనే కనబడవు కదా... మరీ అంత సెంట్ పర్సెంట్ మ్యాచ్ కావాలా?" అని బుచ్చిబాబు అంటే.

"నీకు తెలీయదులే..... ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ కానిదే నాకు తృప్తి వుండదు" అంటుంది.

"లోపల ఉండే లంగా గురించి కూడా అంతిదిగా ఆలోచించాలా సిల్లీగా? అని అంటే.

"అమ్మో .... లంగా చీరకంటే ఇంపార్టెంట్! లంగా లైట్ అయ్యిందంటే చీర కలర్ తేలిపోయి అందమే పోతుంది" అంటుంది.

చీరల షాపింగ్ కి పట్టిన టైమ్ కి నాలుగురెట్లు టైం పట్టింది లంగాలూ, జాకెట్లు షాపింగ్ కి.

బుచ్సిబాబుకి తలకాయ్ బొప్పి కట్టింది.

"అందరూ పెళ్ళయితే కష్టాలన్నారు. కానీ పెళ్ళికి ముందే నా కష్టాలు మొదలయినట్టున్నాయే!" అనుకున్నాడు బుచ్చిబాబు.

అప్పుడు రాత్రి తొమ్మిదయింది.

బుచ్చిబాబు సీతని ఆటోలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముందు దించి అదే ఆటోలో ఇంటికెళ్ళీపోయాడు.

సీత తన గదిలోకి వెళ్లబోతుండగా...