పీకాకు!

పీకాకు!

 

 

బడి ఎలాగుందో చూసేందుకు పరీక్షకులవారు వచ్చారు. పిల్లల్ని ప్రశ్నలు అడుగుతున్నారు.
పరీక్ష: బాబూ నెమలిని ఇంగ్లీషులో ఏమంటారో‌చెప్పు!
పిల్లలెవ్వరూ మాట్లాడలేదు.
టీచరుగారికి ఉత్కంఠ పెరిగిపోతున్నది. ఎవ్వరూ చెప్పక పోతే పరువు చేటు. ఎలా? అప్పటికప్పుడు ఓ ఆలోచన తట్టింది. ఓ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, పరీక్షకుడు చూడకుండా జుట్టు పట్టుకొని గట్టిగా పీకాడు.
పిల్లవాడు అరిచాడు: పీకాకు సార్! పీకాకు (పీకవాకు) సార్!! అని.
పరీక్ష: (అటువైపు తిరిగి ) కరెక్టు! అన్నారు.
టీచరుగారు గట్టిగా గాలి పీల్చుకున్నారు.