Konte Questions-Tuntari Jawabulu-7

Konte Questions-Tuntari Javabulu -7

*******************************************************************

కొంటె కొశ్శెన్ : రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చపోతే హనుమంతుడికి

సుషేణుడు సంజీవిని పర్వతాన్నే ఎందుకు తెమ్మన్నాడు ?

తుంటరి జవాబు : లక్ష్మణుడు సూర్యవంశానికి చెందినవాడు కదా.అందుకే 'సన్ జీవనీ

'పర్వతాన్ని సజెస్ట్ చేసి వుంటాడు.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : పోస్ట్ పోన్ చెయ్యలేని విషయం ఏది ?

తుంటరి జవాబు : దురద పుడుతుంటే గోక్కోవటం.

*******************************************************************

కొంటె కొశ్శెన్ :పొదుపరికి,పీనాసికి తేడా ఏంటి ?

తుంటరి జవాబు :ట్రాఫిక్ సిగ్నల్స్లో రెడ్ లైట్ పడగానే వెహికల్ ఆపేసి గ్రీన్ పడడానికి ఒక్క

సెకండ్ ముందు కాలిక్యులేటేడ్ గా స్టార్ట్ చేయగలిగినవాడు పొదుపరి. గ్రీన్ లైట్ వెలిగాక

అప్పుడు స్టార్ట్ చేస్తూ,వెనక లైన్ కట్టిన వాళ్ళ చేత తిట్టించుకునేవాడు పీ నాసిరకం.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : ఆవులింతలోస్తే చెయ్యి అడ్డం పెట్టుకుంటారెందుకు ?

తుంటరి జవాబు :ఎదుటివాడు పేగులు లెక్కపెడతాడేమోనని.

*******************************************************************

కొంటె కొశ్శెన్ : ఆడంతే...అదోటైప్ ?

తుంటరి జవాబు :షార్ట్ హ్యాండెం గాదూ

*******************************************************************

కొంటె కొశ్శెన్ : అతడే ఒక సైన్యం ?

తుంటరి జవాబు :యిహనేం,మిలటరీ ఖర్చు బోల్డంత తగ్గించొచ్చు.

*******************************************************************