Funny Questions and Answers Jokes

Funny Questions and Answers Jokes

కొంటె కొశ్శెన్ : నాటి కాలేజీ కుర్రాళ్ళకి, నేటి కాలేజీ కుర్రాళ్ళకి ఏమిటి తేడా ?

తుంటరి జవాబు : అప్పటి కుర్రాళ్ళు రోడ్డుమీదకు వెళ్లి సైట్ కొట్టేవాళ్ళు. ఇప్పటి కుర్రాళ్ళు

ఇంటర్నెట్ లో వెబ్ సైట్ కొడుతున్నారు.

********

కొంటె కొశ్శెన్ : ప్రజాప్రతినిధి అంటే ఎవరు ?

తుంటరి : ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రతి నిధినీ మనవి చేస్తూ తనవిగా చేసుకునేవాడు.

********

కొంటె కొశ్శెన్ : కొత్త చెప్పులు కరవకుండా ఉండాలంటే ?

తుంటరి జవాబు : కొన్న వెంటనే డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి పళ్ళు పీకించెయ్యాలి.

********

కొంటె కొశ్శెన్ : చూపుల్తోనే కాల్చేస్తే ?

తుంటరి జవాబు : టెలిఫోన్ డిపార్ట్ మెంట్ కి బోలెడంత నష్టం వస్తుంది.

********

కొంటె కొశ్శెన్ : పోస్ట్ పోన్ చెయ్యలేని విషయం ఏది ?

తుంటరి జవాబు : దురద పుడుతుంటే గోక్కోవటం.

*******

కొంటె కొశ్శెన్ : విచిత్ర గాయకుడనగా....?

తుంటరి జవాబు : వేలం పాటకు ఆర్కెస్ట్రా ఉండాలని కోరుకునేవాడు.