Brahmanandam Koduku

ఒక రోజున, బ్రహ్మానందం తన కొడుకు దొరబాబుని తీసుకుని బంధువుల ఇంటికి

వెళ్లాడు. అక్కడ బంధువులు వీళ్ళు వచ్చారని ఎన్నో మర్యాదలు చేశారు.

దొరబాబు కోసం బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీంలు పెట్టారు.

దొరబాబుకి ఐస్ క్రీంలు బాగా ఇష్టం కావడంతో ముందుగా ఒకటి తెచ్చుకుని

తిన్నాడు. ఆ తరువాత మరొకటి తెచ్చుకుని తిన్నాడు.ఇలా మొత్తం ఎనిమిది సార్లు

వెళ్లి ఎనిమిది ఐస్ క్రీంలు తెచ్చుకుని ఐస్ క్రీంలు అన్ని తినేశాడు. తొమ్మిదో ఐస్ క్రీం

కోసం వెళ్లబోతుంటే, గబుక్కున కొడుకుని ఆపేశాడు బ్రహ్మానందం.

“ ఎందుకు నాన్న ఆపారు ?” అని అడిగాడు కొడుకు.

“ ఏరా...నీకసలు బుద్ధుందా? నువ్వు ఇలా ఐస్ క్రీంలు తెచ్చుకుని తీనేస్తుంటే

లోపల ఆంటీగారు ఏమనుకుంటారు. నిన్ను తిండిపోతూ అని అనుకోరూ " అని

అన్నాడు బ్రహ్మానందం కొడుకుతో.

“ అలా అనుకోరు నాన్నా! ఎందుకంటే ఇప్పుడు తెచ్చినవన్నీ మానాన్న

తీసుకురమ్మన్నారు. ఆయనకి ఐస్ క్రీంలు అంటే చాలా ఇష్టం అని చెప్పి తెచ్చాను

నాన్నా!” అని గబుక్కున ఆకడి నుండి లోపలికి పరుగులు తీశాడు దొరబాబు.

“ ఆ...” అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు బ్రహ్మానందం.